ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వయంసమృద్ధ భారత్‌: శక్తిమంతమైన, వికసిత భారత్‌కు పునాది

Posted On: 15 AUG 2025 10:20AM by PIB Hyderabad

దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూశక్తిమంతమైనవికసిత భారత్‌ సాకారం కావడంలో స్వయంసమృద్ధ భారత్‌ కార్యక్రమం పునాది కాగలదని పేర్కొన్నారుఈ మేరకు రక్షణసాంకేతికఇంధనఅంతరిక్షతయారీ రంగాల్లో మన దేశం ఇప్పటికే పురోగతి సాధించిందని ఆయన ఉటంకించారుఈ విధంగా వికసిత భారత్‌ కీలక పునాదులలో స్వావలంబన ఒకటని ప్రధాని స్పష్టం చేశారుఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను ప్రధానంగా ప్రస్తావిస్తూదేశానికి ఎదురయ్యే ముప్పులను నిర్ణయాత్మకంగా తిప్పికొట్టడంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిస్వదేశీ సామర్థ్యం ప్రధానమని ఆయన చెప్పారుదేశ పటిష్ఠతగౌరవంతోపాటు 2047నాటికి వికసిత భారత్‌ దిశగా పయనంలో స్వావలంబన పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.

స్వయం సమృద్ధ భారత్‌ప్రధాని ప్రసంగంలో కీలకాంశాలు

1.    రక్షణ స్వావలంబన-ఆపరేషన్ సిందూర్: దేశ రక్షణ రంగ స్వావలంబనకు ఆపరేషన్ సిందూర్‌ ఒక నిదర్శనమని ప్రశంసించారుభారత్‌ నిర్ణయాత్మకంగాస్వేచ్ఛగా వ్యవహరించడంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు సహా స్వదేశీ సామర్థ్యం వీలు కల్పిస్తుందన్నారుజాతీయ భద్రత కోసం దిగుమతి పరాధీనత తగదని అవి స్పష్టం చేశాయని పేర్కొన్నారు.

2.   జెట్ ఇంజిన్‌ తయారీలో స్వావలంబన: భవిష్యత్ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యావత్తూ దేశీయంగానే రూపొందుతుందని ప్రధానమంత్రి తెలిపారుఇందులో భాగంగా స్వావలంబన లక్ష్యంతో దేశంలోనే జెట్ ఇంజిన్లను తయారు చేయాలని భారత యువతకుఆవిష్కర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

3.   సెమీకండక్టర్లు-ఉన్నత సాంకేతికతలో అగ్రస్థానం: మన దేశం 2025 చివరికల్లా ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీకండక్టర్ చిప్‌లను ఆవిష్కరిస్తుందని ప్రధాని ప్రకటించారుకీలక సాంకేతిక రంగాల్లో పెరుగుతున్న భారత్‌ ప్రాబల్యానికి ఇది సూచికఅంతర్జాతీయ పోటీతత్వంతో కృత్రిమే మేధసైబర్ భద్రతడీప్-టెక్ఆపరేటింగ్ వ్యవస్థల పరంగా ఆవిష్కరణలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు.

4.   అంతరిక్ష రంగంలో స్వేచ్ఛ:

·         గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సాధించిన అద్భుత విజయాలపై హర్షం వ్యక్తం చేస్తూసొంత అంతరిక్ష కేంద్రం దిశగా భారత్‌ ప్రతిష్ఠాత్మక ప్రణాళికనురచిస్తున్నదని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారుఇది స్వదేశీ అంతరిక్ష సామర్థ్య పురోగమనంలో నవశకానికి సంకేతమని ఆయన అభివర్ణించారు.

·         మరోవైపు ఉపగ్రహాలుఅన్వేషణఅత్యాధునిక అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పన లక్ష్యంగా 300కుపైగా అంకుర సంస్థలు చురుగ్గా కృషి చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారుఅంతరిక్ష శాస్త్రం-అన్వేషణలో భారత్‌ తనవంతు పాత్ర పోషించడమేగాక అంతర్జాతీయ స్థాయిలో ముందంజ వేసిందని ఆయన చెప్పారు.

5.   కాలుష్యరహిత పునరుత్పాదక ఇంధనం:

·         ఇంధన స్వేచ్ఛను ప్రముఖంగా ప్రస్తావిస్తూయువతరం ఉజ్వల భవిరైతు సంక్షేమం లక్ష్యంగా అవిరళ కృషి చేస్తామని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు.

·         ప్రపంచం ఒకవైపు పెరుగుతున్న భూతాపం గురించి చర్చిస్తుండగామరోవైపు 2030కల్లా 50 కాలుష్యరహిత ఇంధన ఉత్పాదక సామర్థ్యం సాధించాలని భారత్‌ కృతనిశ్చయం పూనిందని గుర్తుచేశారుఅయితే2025కే ఆ లక్ష్యాన్ని చేరుకున్నామనిఈ దిశగా ప్రజల నిబద్ధతకు ధన్యవాదాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.

·         సౌరఅణుజలహైడ్రోజన్ ఇంధన సామర్థ్యం సాధనలో దేశం ముందడుగు వేసిందనిఇంధన స్వేచ్ఛ దిశగా పురోగమనాన్ని ఇది సూచిస్తున్నదని పేర్కొన్నారు.

·         ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో అణు విద్యుదుత్పాదన విస్తరణపై దేశం దృష్టి సారించిందని ప్రధాని మోదీ తెలిపారుప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కొత్త అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారుఈ నేపథ్యంలో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకల వేళకు ఈ సామర్థ్యాన్ని 10 రెట్లు పెంచాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నట్లు తెలిపారుఇంధన స్వావలంబన బలోపేతానికిసుస్థిర వృద్ధికి ప్రభుత్వ మద్దతు మరింతగా ఉంటుందని ప్రకటించారు.

6.   జాతీయ కీలక ఖనిజ కార్యక్రమం: ఇంధనపారిశ్రామికరక్షణ రంగాలకు అవసరమైన వనరుల సముపార్జన కోసం 1,200 ప్రదేశాల్లో అన్వేషణ లక్ష్యంగా జాతీయ కీలక ఖనిజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధానమంత్రి తెలిపారుఈ ఖనిజాల నియంత్రణ మన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేస్తుందని ఆయన చెప్పారుమన పారిశ్రామికరక్షణ రంగాల స్వావలంబనకు ఇది దోహదం చేస్తుందని స్పష్టం చేశారు.

7.   జాతీయ సముద్రగర్భ అన్వేషణ కార్యక్రమం: భారత్‌ తన ప్రాదేశిక సముద్రగర్భ ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుంటుందితద్వారా ఇంధన స్వావలంబన ఇనుమడించిదిగుమతి పరాధీనత గణనీయంగా తగ్గుతుంది.

8.   వ్యవసాయ స్వావలంబన-ఎరువులు: రైతుల సాధికారతజాతీయ ఆహార భద్రతకు భరోసా లక్ష్యంగా దేశీయంగానే ఎరువుల ఉత్పత్తి అత్యావశ్యకమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారుఎరువుల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గితే మన వ్యవసాయ రంగం స్వేచ్ఛగా పురోగమిస్తుందన్నారుదీంతో రైతు సంక్షేమానికే కాకుండా దేశ ఆర్థిక సార్వభౌమత్వ బలోపేతానికీ హామీ ఉంటుందన్నారు.

9.   డిజిటల్ సార్వభౌమాధికారం-దేశీ వేదికలు: పూర్తి భారతీయ సామాజిక మాధ్యమ వేదికలుడిజిటల్ మౌలిక సదుపాయాలను రూపొందించాలని ప్రధానమంత్రి యువతకు పిలుపునిచ్చారుఅలాగే కమ్యూనికేషన్డేటాసాంకేతికావరణ వ్యవస్థలు సురక్షితంగాస్వతంత్రంగా ఉండేవిధంగా చూడాలన్నారుదేశం తన డిజిటల్ స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసుకోవడం అత్యవసరమని స్పష్టం చేశారు.

10.   ఔషధాలు-ఆవిష్కరణల స్వావలంబన: “ప్రపంచ ఔషధ సరఫరాదారు”గా భారత్‌ తన సామర్థ్యాన్ని చాటుకున్నదని ప్రధానమంత్రి మోదీ ప్రముఖంగా ప్రస్తావించారుపరిశోధన-ఆవిష్కరణల రంగంలో మరింత పెట్టుబడులు తక్షణావసరమని స్పష్టం చేశారు. “మానవాళి సంక్షేమం కోసం అత్యుత్తమఅత్యంత చౌక మందులను అందిస్తున్నది మనం కాక మరెవరు?” అని వ్యాఖ్యానించారు.

·         దేశీయ ఔషధ ఆవిష్కరణలలో ఇనుమడిస్తున్న భారత్‌సామర్థ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారుకొత్త మందులుటీకాలుప్రాణరక్షక చికిత్స విధానాలు పూర్తిగా దేశంలోనే రూపొందించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

·         కోవిడ్‌-19 భారత్‌ ప్రతిస్పందనలో భాగంగా ప్రపంచ మానవాళి రక్షణకు స్వదేశీ టీకాలతోపాటు ‘కో-విన్‌’ వంటి వేదికలను రూపొందించామని ప్రధాని గుర్తుచేశారుఈ ఆవిష్కరణ స్ఫూర్తిని దేశం మరింత విస్తృతం చేయాలని ఆయన కోరారు.

·         భారత్‌ సొంత ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చుకుంటూ ప్రపంచ శ్రేయస్సుకు దోహదం చేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారువైద్య రంగంలో స్వావలంబనఆవిష్కరణల కూడలిగా తననుతాను నిరూపించుకున్నదని చెప్పారుఈ నేపథ్యంలో కొత్త మందులువైద్య సాంకేతిక పరిజ్ఞానాలకు పేటెంట్లు పొందాల్సిందిగా పరిశోధకులు-పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

11.    స్వదేశీకి అండదండలు: “స్థానికత కోసం నినాదం” కార్యక్రమం కింద స్వదేశీ వస్తు వినియోగానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి మోదీ పౌరులకుదుకాణదారులకు  సూచించారుఅయితేఇది బల ప్రయోగంతో కాకుండా స్వీయ ప్రతిష్ఠసామర్థ్యాల ప్రాతిపదికన సాగాలని స్పష్టం చేశారుస్వావలంబన పెంపువ్యవస్థాపనకు మద్దతు సహా దేశ ఆర్థిక-పారిశ్రామిక పునాదిని బలోపేతం చేయడం కోసం ‘స్వదేశీ’ బోర్డుల ఏర్పాటు ద్వారా ప్రచారం చేపట్టాలని దుకాణదారులను కోరారు.

12.    మిషన్ సుదర్శన్ చక్ర: సంప్రదాయానికి గౌవంరక్షణ బలోపేతం... శత్రు చొరబాట్లను తిప్పికొట్టడంభారత్‌ దాడి సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా మిషన్ సుదర్శన్ చక్రను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.

ఆధునిక రక్షణ రంగ ఆవిష్కరణలకు మార్గనిర్దేశంలో భారత్‌ తన సమున్నతసుసంపన్న సాంస్కృతిక-ఐతిహాసిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన తీరును ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారుఇందులో భాగంగా పురాణ పురుషుడైన శ్రీ కృష్ణుని సుదర్శన చక్రం స్ఫూర్తిగా రూపొందించిన రక్షణ వ్యవస్థను ఉటంకించారువ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై భారత్‌ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారుదీనివల్ల ఎలాంటి ముప్పు తలెత్తినా శరవేగంగాగురితప్పకుండా శక్తిమంతంగా ప్రతిస్పందించగల భరోసా లభిస్తుందన్నారు.


(Release ID: 2156771)