రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న భారత రాష్ట్రపతి

Posted On: 13 AUG 2025 6:36PM by PIB Hyderabad

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము రేపు (ఆగస్టు 14, 2025) జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

రాష్ట్రపతి ప్రసంగం ఆకాశవాణి జాతీయ నెట్‌వర్క్ అంతటా రాత్రి 7 గంటల నుంచి ప్రసారం అవుతుంది. అలాగే అన్నిదూరదర్శన్‌ చానెళ్లలో తొలుత హిందీలోనూ, అనంతరం ఆంగ్ల మాధ్యమంలోనూ టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత దూరదర్శన్ ప్రాంతీయ చానెళ్లు తమ ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తాయి. ఆకాశవాణి తన ప్రాంతీయ నెట్‌వర్క్‌లలో రాత్రి 9:30 గంటలకు ఆయా స్థానిక భాషల్లో ప్రసారం చేస్తుంది.

 

***


(Release ID: 2156222)