ప్రధాన మంత్రి కార్యాలయం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని మోదీ సంభాషణ
· ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాలపై అభిప్రాయాలను వెల్లడించిన జెలెన్‌స్కీ
· వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న భారత స్థిరమైన వైఖరిని పునరుద్ఘాటించిన ప్రధాని
· వీలైనంత త్వరగా శాంతి పునరుద్ధరణకు ఉద్దేశించిన ప్రయత్నాలకు మద్దతు
· భారత్ - ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యంలో పురోగతిపై సమీక్ష
Posted On:
11 AUG 2025 6:39PM by PIB Hyderabad
ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వోలోదిమిర్ జెలెన్‌స్కీతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్‌లో సంభాషించారు.
ఉక్రెయిన్‌కు సంబంధించిన ఇటీవలి పరిణామాలపై అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధానమంత్రి.. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న భారత దృఢమైన, స్థిరమైన వైఖరిని పునరుద్ఘాటించారు. శాంతి పునరుద్ధరణకు ఉద్దేశించిన ప్రయత్నాలకు అండగా ఉంటామన్నారు.
ఈ విషయంలో అన్నివిధాలా మద్దతివ్వడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యంలో పురోగతిని వారిద్దరూ సమీక్షించారు. ఉమ్మడి ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై చర్చించారు.
సంప్రదింపులను కొనసాగించేందుకు అంగీకరించారు.
****
(Release ID: 2155320)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam