ప్రధాన మంత్రి కార్యాలయం
కాశ్మీర్ లోయకు తొలి సరుకు రవాణా రైలు చేరుకోవటం పట్ల ప్రధాని హర్షం
వాణిజ్యం, అనుసంధానతనకు ఇదొక గొప్ప రోజని వర్ణించిన ప్రధాని
Posted On:
09 AUG 2025 6:04PM by PIB Hyderabad
కాశ్మీర్ లోయకు తొలి సరకు రవాణా రైలు చేరుకోవటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ సరకు రవాణా నెట్‌వర్క్‌తో ఈ ప్రాంతాన్ని అనుసంధానించడంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కేంద్ర రైల్వే- కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ - ఐటీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ చేసిన పోస్ట్‌పై స్పందించిన ప్రధాని.. జమ్మూ కాశ్మీర్ వృద్ధి, అభివృద్ధి.. రెండింటినీ ఇది పెంచుతుందని అన్నారు.
‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
"జమ్మూ కాశ్మీర్‌లో వాణిజ్యం, అనుసంధానతకు ఇదొక గొప్ప రోజు. ఇది వృద్ధి, అభివృద్ధి రెండింటినీ పెంచుతుంది"
***
(Release ID: 2154859)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam