ప్రధాన మంత్రి కార్యాలయం
హర్ ఘర్ తిరంగాకు వచ్చిన భారీ స్పందన పట్ల ప్రధాని హర్షం
Posted On:
09 AUG 2025 7:54PM by PIB Hyderabad
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొనటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను ఏకం చేసే దేశభక్తి స్ఫూర్తిని, త్రివర్ణ పతాకం పట్ల వారికి ఉన్న అచంచలమైన గర్వాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. harghartiranga.com. వెబ్‌సైట్‌లో ఫోటోలు, సెల్ఫీలను పంచుకోవటం కొనసాగించాలని ఆయన కోరారు.
హర్ ఘర్ తిరంగాకు వచ్చిన భారీ స్పందనకు సంబంధించి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేసిన పోస్ట్‌పై స్పందిస్తూ ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
"భారతదేశం అంతటా హర్ ఘర్ తిరంగాకు వచ్చిన అద్భుతమైన స్పందన సంతోషం కలిగిస్తోంది. ఇది మన ప్రజలను ఏకం చేసే లోతైన దేశభక్తి స్ఫూర్తిని, త్రివర్ణ పతాకం పట్ల వారికున్న అచంచల అభిమానాన్ని తెలియజేస్తోంది. harghartiranga.com. లో ఫోటోలు, సెల్ఫీలను పంచుకుంటూ ఉండండి.”
***
(Release ID: 2154858)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam