ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 07 AUG 2025 3:31PM by PIB Hyderabad

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ రోజు సృజనాత్మకతకు దర్పణంగా నిలిచే మన సుసంపన్న చేనేత సంప్రదాయాలను  గుర్తు చేసుకుంటూ
 జరుపుకొనే రోజని శ్రీ మోదీ పేర్కొన్నారు. వైవిధ్యంతో కూడిన మన చేనేత రంగం జీవనోపాధి, శ్రేయస్సును పెంపొందించడంలో పోషిస్తున్న పాత్ర మనకెంతో గర్వకారణమని ఆయన అన్నారు.

'ఎక్స్ ' వేదికగా చేసిన పోస్ట్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ రోజు సృజనాత్మకతకు ప్రతిబింబంగా నిలిచే మన సుసంపన్న చేనేత సంప్రదాయాలను  గుర్తు చేసుకుంటూ
 జరుపుకొనే రోజు.  వైవిధ్యంతో కూడిన దేశ చేనేత రంగం జీవనోపాధి, శ్రేయస్సును పెంపొందించడంలో పోషిస్తున్న కీలక పాత్ర మనకెంతో గర్వకారణం". 


(Release ID: 2154513)