ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి మోదీతో రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుని ప్రతినిధి బృందం భేటీ
భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాధాన్యం, కీలక రంగాల్లో సహకారం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ప్రధాని
భారత్‌లో పర్యటించాల్సిందిగా అధ్యక్షుడు లీ జే మ్యంగ్ ను ఆహ్వానించిన ప్రధాని
Posted On:
17 JUL 2025 8:35PM by PIB Hyderabad
రిపబ్లిక్ ఆప్ కొరియా అధ్యక్షుడు గౌరవ లీ జే మ్యంగ్ ప్రత్యేక రాయబారి కిమ్ బో క్యూమ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమైంది.
2025 జూన్లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అధ్యక్షుడు లీ జే మ్యంగ్‌తో జరిగిన ఆత్మీయమైన, ఫలప్రదమైన సమావేశాన్ని ప్రధానమంత్రి గుర్తు తెచ్చుకున్నారు. అధ్యక్షుడు లీ తన అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని భారత్‌కు పంపడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అధ్యక్షుడు లీ జే మ్యంగ్ తెలిపిన శుభాకాంక్షలను ప్రధానమంత్రికి కిమ్ తెలియజేశారు. భారత్‌తో రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తూ.. అందించిన సందేశాన్ని కూడా పంచుకున్నారు.
రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య, ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బలమైన, బహుముఖ సంబంధాలు పోషిస్తున్న స్థిరమైన పాత్రను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
భారత ఆర్థిక, తయారీ రంగాల వృద్ధి గురించి ప్రధానమంత్రి వివరించారు. ఇది నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, నౌకా నిర్మాణం, రక్షణ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీలు లాంటి ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడులు, సహకారానికి అవకాశాలను తెరుస్తుంది. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి తోడ్పడే భారత జనాభా, నైపుణ్యం కలిగిన మానవ వనరుల సామర్థ్యం గురించి ప్రధానమంత్రి తెలియజేశారు.
ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలనే తమ అంకితభావాన్ని ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి.
రాయబారులు బృందం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. భారత్‌లో అధ్యక్షుడు లీ జే మ్యంగ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలియజేశారు.
****
(Release ID: 2151272)
Visitor Counter : 3
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam