ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీమతి ప్రమీలా తాయ్ మేడే మృతిపట్ల ప్రధాని సంతాపం
Posted On:
31 JUL 2025 7:28PM by PIB Hyderabad
రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ్ సంచాలిక శ్రీమతి ప్రమీలా తాయ్ మేఢే మృతికిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం తెలిపారు. ఆమె ఆదర్శప్రాయమైన జీవితం, ముఖ్యంగా సమ్మిళిత సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత సాధనలో ఆమె కృషి రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వేర్వేరు పోస్టుల్లో ఆయన ఇలా పేర్కొన్నారు:
"రాష్ట్ర సేవికా సమితి ప్రధాన సంచాలికగా పని చేసిన శ్రద్ధేయ ప్రమీలా తాయ్ మేఢే మృతిచెందిన వార్త ఎంతో దుఃఖాన్ని కలిగించింది. సమాజ సేవ, జాతిసేవకే ఆమె తన జీవితాన్ని అంకితమిచ్చారు. మహిళా సాధికారతకు తోడుగా, సమాజంలో ఆమె చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఈ శోకసమయంలో భగవంతుడు ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి!"
"రాష్ట్ర సేవికా సమితి ప్రధాన సంచాలికగా ఉన్న ప్రమీలా తాయ్ మేఢే గారి మృతి వార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాజ సేవ, జాతి సేవకే ఆమె తన సమస్త జీవితాన్ని అంకితం చేశారు. మహిళా సాధికారతతోపాటు ఆమె చేసిన సామాజిక సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఈ శోకసమయంలో భగవంతుడు ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధైర్యాన్ని ప్రసాదించు గాక. ఓం శాంతి!"
***
(Release ID: 2151181)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam