ప్రధాన మంత్రి కార్యాలయం
127 ఏళ్ల తర్వాత పవిత్ర పిప్రహ్వా అవశేషాల పునరాగమనాన్ని స్వాగతించిన ప్రధాని
Posted On:
30 JUL 2025 2:44PM by PIB Hyderabad
భగవాన్ బుద్ధుడి పవిత్ర పిప్రహ్వా అవశేషాలు 127 ఏళ్ల సుదీర్ఘ కాలం అనంతరం భారత్‌కు తిరిగి రావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుసంపన్నమైన దేశ సాంస్కృతిక వారసత్వంలో గర్వించదగిన, ఆనందకరమైన క్షణంగా దీనిని అభివర్ణించారు.
వికాస్ భీ విరాసత్ భీ స్ఫూర్తిని చాటేలా చేసిన ఓ ప్రకటనలో.. భగవాన్ బుద్ధుడి బోధనలపట్ల భారత్‌కు ఉన్న పూజ్య భావాన్ని, అలాగే వాటి ఆధ్యాత్మిక, చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడంలో దేశ అచంచలమైన నిబద్ధతను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“మన సాంస్కృతిక వారసత్వంలో సంతోషకరమైన రోజు ఇది!
భగవాన్ బుద్ధుడి పవిత్ర పిప్రహ్వా అవశేషాలు 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రావడం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. ఈ పవిత్ర అవశేషాలు భగవాన్ బుద్ధుడితో భారత్కు ఉన్న సన్నిహిత సంబంధాన్ని, ఆయన ఉదాత్త బోధనలను చాటుతున్నాయి. మహిమాన్వితమైన మన సంస్కృతిలోని వివిధ అంశాలను సంరక్షించి, భద్రపరచడంలో మా అంకిత భావానికి కూడా ఇది నిదర్శనం. #VikasBhiVirasatBhi”
“పిప్రహ్వా అవశేషాలు 1898లోనే బయటపడినప్పటికీ.. వలస పాలన కాలంలో వాటిని భారత్ నుంచి తరలించారు. ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ వేలంలో అవి కనిపించగా.. వాటిని తిరిగి స్వదేశానికి తెచ్చేందుకు మేం అమితంగా కృషి చేశాం. ఈ కృషిలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు.”
(Release ID: 2150494)
Read this release in:
Gujarati
,
Malayalam
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada