ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ విద్యా విధానం- 2020తో భారతీయ విద్య మరింత సమగ్రంగా,
సమ్మిళితంగా, భవిష్యత్ సన్నద్ధంగా మారిన తీరును వివరించే కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
Posted On:
30 JUL 2025 1:26PM by PIB Hyderabad
భారతీయ విద్యను మరింత సమగ్రంగా, సమ్మిళితంగా, భవిష్యత్ సన్నద్ధంగా తీర్చిదిద్దడం ద్వారా.. జాతీయ విద్యా విధానం-2020, అందులో తెచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించే ఓ కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విద్యా మంత్రిత్వ శాఖ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ, ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“భారతీయ విద్యను మరింత సమగ్రంగా, సమ్మిళితంగా, భవిష్యత్ సన్నద్ధంగా తీర్చిదిద్దడం ద్వారా.. జాతీయ విద్యా విధానం- 2020 అందులో సమూల మార్పులు తెచ్చిన తీరును కేంద్ర మంత్రి శ్రీ @dpradhanbjp వివరించారు. అయిదేళ్ల తర్వాత దాని ప్రభావం తరగతి గదుల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు.”
***
(Release ID: 2150249)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada