హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పద్మ పురస్కారాలు-2026 నామినేషన్ల గడువు 2025, ఆగస్టు 15 వరకు పొడిగింపు

Posted On: 30 JUL 2025 11:07AM by PIB Hyderabad

పద్మ పురస్కారాలకు ప్రతిపాదనలు/సిఫార్సులు సమర్పించడానికి చివరి తేదీని 2025 జులై 31 నుంచి 2025 ఆగస్టు 15 వరకు పొడిగించారుఆన్‌లైన్ విధానంలో రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in ) ద్వారా మాత్రమే పద్మ పురస్కారాలకు నామినేషన్లు/సిఫార్సులు స్వీకరిస్తారు2026లో గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటించే పద్మ పురస్కారాలు - 2026 ప్రతిపాదనలు/సిఫార్సులు 2025 మార్చి 15 న ప్రారంభమయ్యాయి.

పద్మ విభూషణ్పద్మ భూషణ్పద్మశ్రీ పురస్కారాలు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలు. 1954 నుంచి ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజున ఈ పురస్కారాలను ప్రకటిస్తున్నారుపురస్కారాలను కళలుసాహిత్యంవిద్యక్రీడలువైద్యంసామాజిక సేవసైన్స్ అండ్ ఇంజినీరింగ్ప్రజా వ్యవహారాలుప్రజాసేవవ్యాపారంపరిశ్రమలు సహా అన్ని రంగాలు/విభాగాల్లో ‘అత్యుత్తమ సేవలు’ అందించిన వారికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేస్తారుజాతివృత్తిస్థాయిలింగ వివక్ష లేకుండా అందరూ ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి అర్హులేప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వైద్యులుశాస్త్రవేత్తలు మినహా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ పద్మ పురస్కారాలకు అనర్హులు.

పద్మ పురస్కారాలను ‘‘ప్రజల పద్మ’’గా’ మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందిఅందుకే స్వీయ నామినేషన్‌తో సహా అర్హులైన వారిని నామినేట్/సిఫార్సు చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసిందిమహిళలుబలహీన వర్గాలకు చెందిన వారుఎస్సీఎస్టీలుదివ్యాంగులునిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్న వారిలో ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

పైన పేర్కొన్న పోర్టల్ లో సూచించిన విధానంలో నామినేషన్సిఫార్సు చేయాలనుకున్న వ్యక్తి వివరాలతో పాటు వారి విశిష్టతనుసంబంధిత రంగం/విభాగంలో సాధించిన విజయాలు/సేవను స్పష్టంగా కథన రూపంలో ( 800 పదాలకు మించకుండావివరించాలి.

కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల వెబ్ సైటు (https://mha.gov.inలో ‘‘అవార్డ్స్ అండ్ మెడల్స్’’ శీర్షికలోనూపద్మ పురస్కారాల పోర్టల్ (https://padmaawards.gov.in ) లోనూ ఈ వివరాలు అందుబాటులో ఉంటాయిఈ పురస్కారాలకు సంబంధించిన నిబంధనలునియమాలు https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్ లో ఉన్నాయి.

 

***


(Release ID: 2150245) Visitor Counter : 9