ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్రాండ్‌మాస్టర్‌గా దివ్యా దేశ్‌ముఖ్…. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 JUL 2025 6:00AM by PIB Hyderabad

దివ్యా దేశ్‌ముఖ్ ‘ఫిడే’ మహిళల ప్రపంచ కప్-2025ను గెలుచుకోవడం ఒక్కటే కాకుండా గ్రాండ్‌మాస్టర్‌‌గా కూడా నిలిచినందుకు ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. ‘‘ఆమె సాధించిన విజయం ఎంతో మందికి ప్రేరణను ఇవ్వడంతో పాటు చదరంగ క్రీడ మన యువతలో ఇప్పటికన్నా మరింత ఎక్కువ ఆదరణ పొందడానికి తోడ్పడుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం  ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్నిస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ఈరోజు భారతీయ చదరంగ క్రీడలో అసాధారణమైన రోజు!

దివ్యా దేశ్‌ముఖ్ ‘ఫిడే’ మహిళల ప్రపంచ కప్- 2025ను గెలుచుకోవడం ఒక్కటే కాకుండా గ్రాండ్‌మాస్టర్‌‌గా కూడా నిలిచారుఆమెకు అభినందనలుఆమె సాధించిన విజయం ఎంతో మందికి ప్రేరణను ఇవ్వడంతో పాటు చదరంగ క్రీడ మన యువతలో ఇప్పటికన్నా మరింత  ఎక్కువ ఆదరణ పొందడానికి తోడ్పడుతుంది’’.

@DivyaDeshmukh05 ‌

 


(రిలీజ్ ఐడి: 2149558) సందర్శకుల సూచీ సంఖ్య : : 22