సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

100 కంటే ఎక్కువ దేశాల నుంచి 1 లక్షల మంది హాజరు, రూ. 8000 కోట్ల ఒప్పందాలతో సృజనాత్మకత విషయంలో భారతదేశ నాయకత్వ స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన వేవ్స్-2025

వేవ్స్-2025తో ప్రపంచ స్థాయి సృజనాత్మక సమావేశాన్ని నిర్వహించిన భారత్..

పరిశ్రమ ప్రతినిధులు, సాంకేతిక రంగప్రతినిధులతో 140 కంటే ఎక్కువ సమావేశాల నిర్వహణ

300 కంటే వ్యాపార సంబంధిత (బీ2బీ) సమావేశాలకు వేదికైన వేవ్స్

స్రిప్ట్, సంగీతం, దృశ్య శ్రవణ హక్కుల మార్కెట్‌కు ఊతమిచ్చిన వేవ్స్

Posted On: 25 JUL 2025 6:11PM by PIB Hyderabad

కంటెంట్ క్రియేషన్‌లో భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రపంచ దృశ్య శ్రవణ వినోద సదస్సు (వేవ్స్) 2025ను నిర్వహించారుఇది క్రియేటర్లువిధాన నిర్ణేతలుపరిశ్రమ ప్రతినిధులుమీడియా సంస్థలుసాంకేతిక రంగ మార్గదర్శకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది.

భారత క్రియేటర్లు కొత్త సాంకేతికతలుపెట్టుబడిదారులునిర్మాతలుకొనుగోలుదారులతో భాగస్వామ్యాలు ఏర్పరచుకునేందుకు వేవ్స్ ఒక వేదికను అందించిందిఇందులో 100 కంటే ఎక్కువ దేశాల నుంచి లక్ష మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారుఈ కార్యక్రమంలో 50 ప్లీనరీలు, 35 మాస్టర్‌క్లాస్‌లుప్రపంచ పరిశ్రమ ప్రతినిధులు భాగస్వామ్యంతో 55 బ్రేక్అవుట్ సెషన్‌లతో సహా 140కి పైగా సెషన్‌లు జరిగాయి

వేవ్స్ 2025 ముఖ్యాంశాలు:

● గ్లోబల్ మీడియా చర్చా కార్యక్రమంప్రభుత్వప్రైవేట్ రంగ ప్రతినిధులు సహా కీలక భాగస్వాములు పెరుగుతోన్న మీడియావినోద రంగ పాత్ర గురించి చర్చించారుశాంతిడిజిటల్ సమ్మిళిత్వం విషయంలో మీడియాను ప్రోత్సహించడానికి వేవ్స్ డిక్లరేషన్‌కు ఆమోదం లభించింది

● వేవ్స్‌ఎక్స్మీడియావినోద రంగంలో అంకురాల నేతృత్వంలోని ఆవిష్కరణలకు వేదిక ఇదిఇందులో భాగంగా ఉన్న రెండు రోజుల ప్రత్యక్ష పిచింగ్ కార్యక్రమంలో అంకురాలు తమ ఆలోచనలను పెట్టుబడిదారుల ముందు ఉంచాయి

● వేవేస్ బజార్స్క్రిప్ట్‌సంగీతంకామిక్స్ద్రృశ్య శ్రవణ హక్కులకు సంబంధించి మార్కెట్‌‌గా ఇది పనిచేసింది. 3 వేలకు పైగా వ్యాపార సమావేశాలకు (బీ2బీఇది వేదికగా మారిందితద్వారా కొత్త ఆదాయ మార్గాలను సృష్టించింది

● ఆర్థికవ్యూహాత్మక ఫలితాలుఫిల్మ్ సిటీలుసృజనాత్మక విషయంలో సాంకేతికకు సంబంధించిన విద్యప్రత్యక్ష వినోదం విషయంలో మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల కోసం రూ. 8 వేల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు జరిగాయి

● క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐసీ): యానిమేషన్గేమింగ్ఏఆర్వీఆర్సంగీతం వంటి 34 సృజనాత్మక విభాగాల్లో దేశంలోని తదుపరి తరం సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఉద్దేశించినదిప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా క్రియేటర్లు ఇందులో నమోదు చేసుకున్నారు

● క్రియేటోస్పియర్భారతదేశంలోని తదుపరి తరం సృజనాత్మక ప్రతిభను ప్రధానంగా తెలియజేసేందుకు మాస్టర్‌క్లాస్‌లుపోటీలుప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించారు

● భారత్ పెవిలియన్భారత్ సామర్థ్యాన్నిసాంస్కృతిక నాయకత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శిస్తూ కథలు చెప్పే విషయంలో భారత్ ఘన వారసత్వాన్ని తెలియజేసే ఒక అనుభవాన్ని ఇది అందించింది

● 8వ జాతీయ సామాజిక రేడియో సమావేశంసామాజిక ప్రసారంలో ఆవిష్కరణసమ్మిళితత్వం కోసం కృషి చేసిన 12 స్టేషన్లు జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డులను అందుకున్నాయి.

సమాచార-ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ ఈరోజు లోక్‌సభలో ఈ వివరాలను పంచుకున్నారు.

 

***


(Release ID: 2148772)