రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: రాష్ట్రపతి భవన్లో వివిధ కార్యక్రమాల ప్రారంభం


దివ్యాంగజనులకు అనుకూలంగా.... ప్రెసిడెంట్స్ ఎస్టేట్
22 భాషల్లో... రాష్ట్రపతి భవన్ వెబ్‌సైటు

Posted On: 25 JUL 2025 3:33PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు తో (2025, జులై 25)తో మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.

తన పదవీకాలంలో మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి భవన్ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లో చేపట్టిన వివిధ ముఖ్యమైన కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారుఅవి:

  • దివ్యాంగులకు అనుకూలంగా ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌ను మార్చినట్లు ప్రకటనపండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజెబిలిటీస్ సిఫారసు చేసిన 50 పాయింట్లను అమలు చేసిన అనంతరం రాష్ట్రపతి భవన్అమృత్ ఉద్యాన్రాష్ట్రపతి భవన్ మ్యూజియం దివ్యాంగజనులకు అనుకూలమైన ప్రాంగణాలుగా మారాయి.

  • 22 భారతీయ భాషల్లో రాష్ట్రపతి భవన్ వెబ్‌సైట్ల ప్రారంభంరాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్లు https://www.rashtrapatibhavan.gov.in/ , https://www.presidentofindia.gov.in/ ఇప్పుడు 22 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

  • ప్రెసిడెంట్స్ ఎస్టేట్ ను సందర్శించే వారికినివాసితులకు వివిధ మౌలిక వసతుల ప్రారంభంవాటిలో రాష్ట్రపతి నిలయంలో విజిటర్ ఫెసిలిటేషన్ సెంటర్హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిలయం నికుంజ్మషోబ్రాలోని రాష్ట్రపతి నివాస్‌లో కెఫెటేరియాసావనీర్ షాప్రిసెప్షన్ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లో పునరుద్ధరించిన వ్యాయామశాల ఉన్నాయి.

  • 250కి పైగా వస్తువులను వేలం వేసేందుకు ఈ-ఉపహార్ సీజన్ ప్రారంభంవేలం నుంచి వచ్చే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమానికి దోహదపడే కార్యక్రమాలకు విరాళమిస్తారువివరాలకు https://upahaar.rashtrapatibhavan.gov.in/

  • -బుక్ ఆవిష్కరణ – గతేడాది కాలంలో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సంకలనం (లింక్ https://rb.nic.in/ebook25.htm).

  • మార్చి 2027 నాటికి రాష్ట్రపతి భవన్లో సున్నా కర్బన ఉద్గారాలు సాధించే కార్యక్రమాల ప్రారంభం.

వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. గత మూడేళ్లలో రాష్ట్రపతి భవన్‌తో ప్రజల సంబంధాలను బలోపేతం చేసేలా అనేక నిర్ణయాలు తీసుకోవడంపనులు చేపట్టడం సంతృప్తికరమైన విషయమన్నారుసమాజంలోని అన్ని వర్గాలనుముఖ్యంగా వెనుకబడినఅణగారిన వర్గాల వారిని దేశాభివృద్ధి ప్రయాణంలో భాగం చేయడమే మా లక్ష్యందివ్యాంగజనులకు అనుకూలంగా రాష్ట్రపతి భవన్ మారడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారురానున్న రోజుల్లో మరిన్ని కొత్త కార్యక్రమాలు చేపడతామన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.

 

 

 

 

 

***


(Release ID: 2148556)