ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్‌లోని ఝాలావాడ్‌లో బడి దుర్ఘటన.. విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 JUL 2025 11:17AM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని ఝాలావాడ్‌లో ఒక పాఠశాలలో జరిగిన దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘ఈ కష్టకాలంలో బాధిత విద్యార్థులతో పాటు వారి కుటుంబాలకు కలిగిన వేదనకు గాను నేను నా సంతాపం తెలియజేస్తుఃన్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘రాజస్థాన్‌లోని ఝాలావాడ్‌లో ఒక పాఠశాలలో జరిగిన దుర్ఘటన విషాదకరం, చాలా బాధాకరం కూడా. ఈ కష్టకాలంలో బాధిత విద్యార్థులతో పాటు వారి కుటుంబాలకు కలిగిన వేదనకు గాను నేను నా సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అధికారులు చేతనైన అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తున్నారు: ప్రధానమంత్రి (@narendramodi)’’
***
(रिलीज़ आईडी: 2148311)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam