సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఏవీజీసీ-ఎక్స్ఆర్‌లో అత్యాధునిక కోర్సులను ప్రకటించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్: 2025, ఆగస్టులో మొదటి బ్యాచ్ ప్రారంభం
Posted On:
15 JUL 2025 11:16AM by PIB Hyderabad
ఈ ఆగస్టులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) మొదటి బ్యాచ్‌కు అడ్మిషన్లు ప్రారంభించనున్న నేపథ్యంలో భారత్‌లో అభివృద్ధి చెందుతున్న డిజిటల్, క్రియేటివ్ ఆర్థిక వ్యవస్థ పరివర్తన చెందడానికి సిద్ధమవుతోంది. ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాల్టీ) రంగంలో పరిశ్రమ అవసరాలకు తగిన కోర్సులకు సంబంధించిన విస్తృతమైన పోర్ట్‌ఫోలియోను ఈ సంస్థ అందిస్తుంది.
2025, మేలో జరిగిన వరల్డ్ ఆడియో, విజువల్ ఎంటర్ టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)లో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాలు, పరిశ్రమ దిగ్గజాల తోడ్పాటు ఉంది. గేమింగ్‌లో ఆరు ప్రత్యేక కోర్సులు, పోస్ట్ ప్రొడక్షన్లో నాలుగు, యానిమినేషన్, కామిక్స్, ఎక్స్ఆర్‌లో ఎనిమిది కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక సాంకేతిక రంగంలో విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు పరిశ్రమలో అగ్రశ్రేణి నిపుణుల సహకారంతో వీటిని నిశితంగా రూపొందించారు.
బ్రిటన్ లోని యోర్క్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందంపై ఐఐసీటీ ఇటీవలే సంతకం చేసింది. ఇది సహకారాత్మక పరిశోధన, అధ్యాపకులను పరస్పరం మార్చుకోవడం, అంతర్జాతీయ సర్టిఫికేషన్లకు మార్గాన్ని సుగమం చేస్తుంది. దాని బలమైన పునాదికి తోడుగా.. అంతర్జాతీయంగా అగ్రశ్రేణి సంస్థలైన గూగుల్, యూట్యూబ్, అడోబ్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్వీఐడీఐఏ, జియోస్టార్ లాంటి సంస్థలు ఐఐసీటీతో సుదీర్ఘ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయి. పాఠ్యాంశాల అభివృద్ధి, ఉపకార వేతనాలు, ఇంటర్న్షిప్పులు, స్టార్టప్ ఇంక్యుబేషన్, ప్లేస్మెంట్ అవకాశాల్లో ఈ సంస్థలు మద్దతు ఇస్తాయి.
ప్రపంచ స్థాయి ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ రంగంలో భారత్‌ను అంతర్జాతీయ శక్తిగా మార్చడమే లక్ష్యమని ఐఐసీటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ విశ్వాస్ దేవోస్కర్ తెలియజేశారు. అభివృద్ధి చెందుతున్న భారతీయ సృజనాత్మక సామర్థ్యానికి అనుగుణంగా ఉంటూనే అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా కోర్సులను రూపొందించారు. వివరణాత్మకమైన పాఠ్యాంశాలను ఈ నెల చివరిలో ప్రకటిస్తారని భావిస్తున్నారు.
ఐఐసీటీ బోర్డులో శ్రీ సంజయ్ జాజు, శ్రీ వికాస్ ఖర్గే, శ్రీమతి స్వాతి మాసే, శ్రీ చంద్రజిత్ బెనర్జీ, శ్రీ ఆశీష్ కులకర్ణి, శ్రీ మన్వేంద్ర షుకుల్, శ్రీ రాజన్ నవానీ ఉన్నారు. పాలకమండలిలో శ్రీ ముంజాల్ ష్రాఫ్, శ్రీ చైతన్య చిచ్లీకర్, శ్రీ బీరెన్ ఘోష్, శ్రీ భూపేంద్ర కైంతోలా, శ్రీ గౌరవ్ బెనర్జీ ఉన్నారు.
ఏవీజీసీ-ఎక్స్ఆర్ పరిశ్రమ అసాధారణంగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఐఐసీటీ సమగ్ర కోర్సులను అందిస్తోంది. భారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే, ఇమర్సివ్, డిజిటల్ కంటెంట్ సాంకేతికతల్లో దేశాన్ని అంతర్జాతీయ స్థాయి అగ్రగామిగా నిలబెట్టే, భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా ప్రతిభావంతులను తయారు చేయడమే వీటి లక్ష్యం.
***
(Release ID: 2145113)
Visitor Counter : 2
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam