ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నమీబియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 09 JUL 2025 10:43PM by PIB Hyderabad

నమీబియా జాతీయ అసెంబ్లీ స్పీకర్ గౌరవ సారా కుగోంగెల్వా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారునమీబియా నుంచి వచ్చిన ఈ ప్రత్యేక ఆహ్వానంతో ప్రధానమంత్రి పర్యటన మరింత ఫలప్రదమైంది.

పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్య మాతప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ తరపున.... గౌరవ పార్లమెంటు సభ్యులకునమీబియా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారుఇరు దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలనుస్వాతంత్య్రం కోసం చేసిన ఉమ్మడి పోరాటాలను గుర్తు చేసుకుంటూ.. నమీబియా జాతిపిత డాక్టర్ సామ్ నుజోమాకు ప్రధానమంత్రి నివాళులర్పించారుఇరు దేశాల జాతిపితలు ప్రోత్సహించిన ప్రజాస్వామ్య విలువలుసూత్రాలు రెండు దేశాల్లో పురోగతికి మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారుప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో నమీబియా ప్రభుత్వంప్రజల పాత్రను ఆయన ప్రశంసించారు.

ఆ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా నమీబియా ప్రజలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారుఇది భారత్-నమీబియా ప్రజాస్వామ్యాల విజయానికి లభించిన గౌరవమని అని ఆయన పేర్కొన్నారుస్వేచ్ఛసమానత్వంన్యాయం అండగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల గళాన్ని ప్రపంచానికి వినిపించడమే కాకుండావారి ఆశలుఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చేందుకు ఇరు దేశాలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారుజీ20కి అధ్యక్షత వహించిన సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించినట్లుగానేభారత్ ఎల్లప్పుడూ ఆఫ్రికా పురోగతి కోసం కృషి చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుభారత్ తన అభివృద్ధి అనుభవాన్ని నమీబియాతో పాటు ఇతర ఆఫ్రికా దేశాలతో పంచుకునే అదృష్టం పొందిందన్నారుసామర్థ్యాలను పెంపొందించడంనైపుణ్యాలను అభివృద్ధి చేయడంస్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంఆఫ్రికా ఎజెండా 2063కి మద్దతునివ్వడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

తనకు లభించిన గౌరవం పట్ల స్పీకర్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారుఇరుదేశాల ప్రజల మధ్య అనుసంధానత పెరగాలనీతద్వారా రెండు ప్రజాస్వామ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన పిలుపునిచ్చారు. "మనం పోరాడి సాధించిన స్వేచ్ఛను మాత్రమే కాకుండామనం ఐక్యంగా నిర్మించుకునే భవిష్యత్తును కూడా మన పిల్లలు వారసత్వంగా పొందాలిఅని చెబుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

***


(Release ID: 2143619) Visitor Counter : 4