ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధానమంత్రి

Posted On: 09 JUL 2025 7:45PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమీబియాలో పర్యటిస్తున్నారుఈ సందర్భంగా నమీబియా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏనిషంట్ వెల్విచియా మిరాబిలిస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి నమీబియా అధ్యక్షురాలు గౌరవ నెటుంబో నాండి-ఎన్‌డైత్వా ప్రదానం చేశారుఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నేత ఆయనే.

ఈ పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి.. ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకూభారత్-నమీబియా చారిత్రాత్మకశాశ్వత సంబంధాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారుతనకు ఈ అత్యున్నత పురస్కారం అందించిన ఆ దేశ అధ్యక్షురాలు నాండి-ఎన్‌డైత్వాకునమీబియా ప్రజలకూ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధానమంత్రికి ఈ పురస్కారం ప్రదానం చేయడం భారత్-నమీబియా ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక మైలురాయిగా నిలుస్తుందిఈ ప్రత్యేక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇరు దేశాల యువతకూ ఇది ప్రేరణనిస్తుంది.

 

***


(Release ID: 2143586)