ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి బ్రెజిల్‌లో అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’’ ప్రదానం
Posted On:
09 JUL 2025 12:58AM by PIB Hyderabad
బ్రెజిల్‌లో అత్యున్నత జాతీయ పురస్కారం అయిన ‘‘ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’’ అవార్డుతో ఆ దేశ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సత్కరించారు.
ఈ విశిష్ట గౌరవాన్ని తనకు ఇచ్చినందుకు బ్రెజిల్ అధ్యక్షునికి, బ్రెజిల్ ప్రభుత్వంతో పాటు బ్రెజిల్ ప్రజానీకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును స్వీకరిస్తూ, ఈ సన్మానం 140 కోట్ల మంది భారతీయులకే కాకుండా భారత్, బ్రెజిల్‌ల మైత్రీబంధానికి లభించిన గుర్తింపు అని అన్నారు. అధ్యక్షుడు శ్రీ లూలాను భారత్, బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఆద్యునిగా శ్రీ మోదీ చెబుతూ, ఈ అవార్డు ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు తాను చేస్తున్న కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రశంస ఇరు దేశాల ప్రజలకు, వారి మధ్య ఇప్పుడున్న ఆత్మీయతను, మైత్రీపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తగిన స్ఫూర్తిని అందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
***
(Release ID: 2143319)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam