ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రియో డి జనీరోలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా బొలీవియా అధ్యక్షునితో భేటీ అయిన ప్రధానమంత్రి

Posted On: 07 JUL 2025 9:19PM by PIB Hyderabad

బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్లూరినేషనల్ స్టేట్ ఆఫ్ బొలీవియా అధ్యక్షులు గౌరవ లూయిస్ ఆర్స్ కాటకోరాతో సమావేశమయ్యారు.

ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించిన ఇరువురు నేతలు.. సాధించిన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారుకీలక ఖనిజాలువర్తకంవాణిజ్యండిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్యూపీఐఆరోగ్యంఔషధాలుసంప్రదాయిక వైద్యంచిన్న-మధ్య తరహా పరిశ్రమలుశిక్షణసామర్థ్యాలను మెరుగుపరచడం వంటి రంగాల్లో పరస్పర సహకారం గురించి వారు చర్చించారుకీలక ఖనిజాల రంగంలో మెరుగైన సహకారం.. సుస్థిరమైనపరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాల అభివృద్ధికి గల అవకాశాలను ఇరువురు నేతలు ప్రస్తావించారుత్వరిత ప్రభావ ప్రాజెక్టులు.. ఐటీఈసీ స్కాలర్‌షిప్ కార్యక్రమాల కింద చేపట్టిన సామర్థ్యాలను మెరుగుపరిచే కార్యక్రమాల ద్వారా ఇరు దేశాల అభివృద్ధి కోసం కొనసాగుతున్న పరస్పర సహకారం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

2025 మార్చి-ఏప్రిల్‌ కాలంలో బొలీవియాలోని లాజ్ పాజ్ సహా పలు ప్రాంతాల్లో సంభవించిన వరదల నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు ప్రధానమంత్రి సంఘీభావం ప్రకటించారుఅంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన బొలీవియాకు అభినందనలు తెలిపారు.

2025 ఆగస్టు 6న 200వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బొలీవియా నిర్వహిస్తున్న ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ఆ దేశ ప్రజలకూప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

 

***


(Release ID: 2143082)