ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అధికారిక పర్యటన నిమిత్తం ఘనా చేరుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 JUL 2025 8:40PM by PIB Hyderabad

అధికారిక పర్యటన నిమిత్తం ఘనాలోని ఆక్రాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఇది రెండు దేశాల మధ్య కొనసాగుతున్న బలమైన, చారిత్రక స్నేహబంధాన్ని ప్రతిబింబిస్తుంది.
గడచిన మూడు దశాబ్దాల్లో ప్రధాని ఘనాను సందర్శించడం ఇదే తొలిసారి. భారత్, ఘనా మధ్య భాగస్వామ్యాన్ని ఈ చారిత్రక పర్యటన బలోపేతం చేస్తుంది. అలాగే ఆఫ్రికా,అభివృద్ధి చెందుతున్న దేశాలతో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భారత్ అంకిత భావాన్ని తెలియజేస్తుంది.


(रिलीज़ आईडी: 2141687) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam