హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రతిష్ఠాత్మక వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్- 2029 ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికపై కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా హర్షం.. ఇది ప్రతి పౌరుడికీ గర్వకారణమన్న మంత్రి


ప్రధాని శ్రీ మోదీ నేతృత్వంలో నిర్మించిన విస్తృత క్రీడా మౌలిక సదుపాయాలకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు ఇది

అహ్మదాబాద్‌ వేదికగా ఎంపికవడం క్రీడా గమ్యస్థానంగా ఆ నగరం ఎదుగుతున్న తీరుకు నిదర్శనం: శ్రీ అమిత్ షా

Posted On: 27 JUN 2025 4:48PM by PIB Hyderabad

ప్రతిష్ఠాత్మక వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్- 2029కి ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికవడంపై కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా హర్షం వ్యక్తం చేశారుఇది దేశ పౌరులందరికీ గర్వకారణమన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో “ప్రతిష్ఠాత్మక వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్-2029కి ఆతిథ్య దేశంగా భారత్ కా ఎంపిక కావడం ప్రతి పౌరుడికీ గర్వకారణంఈర్యక్రమ నిర్వహణ కోసం ప్రతిష్ఠాత్మక బిడ్‌ను భారత్ గెలుచుకోవడమన్నది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్మించిన విస్తృత క్రీడా మౌలిక సదుపాయాలకు లభించిన అంతర్జాతీయ గుర్తింపుపోలీసుఅగ్నిమాపకవిపత్తు సహాయక సిబ్బందిని ఒక్కచోట చేర్చే ఈ కార్యక్రమానికి వేదికగా అహ్మదాబాద్ ఎంపికైంది. 50కి పైగా క్రీడల్లో వారు పోటీ పడతారుక్రీడా గమ్యస్థానంగా నగరం ఎదుగుతున్న తీరుకు ఇది నిదర్శనం” అని కేంద్ర హోంసహకార శాఖల మంత్రి పేర్కొన్నారు.

 

***


(Release ID: 2140515)