ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇరాన్‌లో ప్రస్తుత స్థితిపై ఆ దేశ అధ్యక్షునితో మాట్లాడిన ప్రధానమంత్రి


ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాల సత్వర పునరుద్ధరణకు తక్షణం ఉద్రిక్త స్థితిని తగ్గించడం, సంభాషణలు, దౌత్యం.. ఇదే ముందున్న మార్గమని ప్రధానమంత్రి పునరుద్ఘాటన

Posted On: 22 JUN 2025 3:36PM by PIB Hyderabad

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న స్థితిని చర్చించడానికి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెశ్కియన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విస్తృతంగా చర్చించారు.
 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంభాషణలకు, దౌత్యానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తూ, దీర్ఘకాలిక ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్రిక్తతల తగ్గింపు తప్పనిసరి అని పునరుద్ఘాటించారు.
 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ: ‘‘ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ పెజెష్కియన్‌ (@drpezeshkian)తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితి గురించి మేం విస్తృతంగా చర్చించాం. ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు పెరుగుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను.  ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని, సంభాషణలకు, దౌత్యానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడానికి ఇది ఒక్కటే ముందున్న మార్గమని పునరుద్ఘాటించాను’’ అని
పేర్కొన్నారు.


(Release ID: 2139889)