ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ నారాయణ గురు-మహాత్మాగాంధీల సంభాషణ శతాబ్ది ఉత్సవాలను రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 JUN 2025 5:24PM by PIB Hyderabad

ఆధ్యాత్మికతనైతిక విలువలను బోధించిన గొప్ప నాయకులు శ్రీ నారాయణ గురు మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రాత్మక సంభాషణ శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించనున్నారుఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

ఈ చరిత్రాత్మక సంభాషణ 1925 మార్చి12న మహాత్మాగాంధీ పర్యటన సందర్భంగా శివగిరి మఠంలో జరిగిందిఈ సంభాషణల్లో ఇరువురు మహనీయులు వైకోమ్ సత్యాగ్రహంమత మార్పిడులుఅహింసఅంటరానితనం నిర్మూలనమోక్ష సాధనఅణగారిన వర్గాల అభ్యున్నతి వంటి అంశాల గురించి చర్చించారు.

శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు నిర్వహించే ఈ వేడుకలు.. భారత సామాజికనైతిక నిర్మాణాన్ని రూపొందించుటలో మార్గదర్శనం చేస్తున్న ఈ దార్శనిక సంభాషణలను గురించి చర్చించివాటిని స్మరించుకోవడానికి ఆధ్యాత్మిక నాయకులుఇతర సభ్యులను ఒకే వేదికకు చేర్చనున్నాయిశ్రీ నారాయణ గురు-మహాత్మాగాంధీలు ఇరువురూ ప్రచారం చేసిన సామాజిక న్యాయంఐక్యతఆధ్యాత్మిక సామరస్యాల సమష్టి దృక్పథానికి ఈ కార్యక్రమం శక్తిమంతమైన నివాళి అవుతుంది.

 

***


(रिलीज़ आईडी: 2139072) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Kannada , Assamese , Bengali-TR , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Malayalam