ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 20 JUN 2025 7:48PM by PIB Hyderabad

జైజగన్నాథ్!

జై బాబా లింగరాజ్ !

నా ప్రియమైన ఒడిశా ప్రజలకు  శుభాకాంక్షలుజోహార్!

ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబుప్రజాదరణ పొందిన మన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఘీనా కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ జువాల్ ఓరంశ్రీ ధర్మేంద్ర ప్రధాన్శ్రీ అశ్వినీ వైష్ణవ్ఒడిశా ఉప ముఖ్యమంత్రులు శ్రీ కనక్ వర్ధన్ సింగ్ దేవ్శ్రీమతి ప్రవతి పరీడారాష్ట్ర మంత్రులూపార్లమెంటు సభ్యు లూశాసనసభ సభ్యులూఇంకా నా ఒడిశా సోదరసోదరీమణులారా!

ఈరోజు,  జూన్ 20, చాలా ప్రత్యేకమైన రోజుఈ రోజు ఒడిశాలో మొదటి బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుందిఈ వార్షికోత్సవం కేవలం ఒక ప్రభుత్వానిది కాదుఇది సుపరిపాలనకు వార్షికోత్సవంఇది ప్రజల సేవకు,  ప్రజల నమ్మకానికి అంకితమయిన సంవత్సరంఒడిశాలోని కోట్లాదిమంది ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలకు ఇది ఒక గుర్తించదగిన సంవత్సరంఒడిశా ప్రజలకుమీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలుముఖ్యమంత్రి శ్రీ మోహన్ మాఝీ,  ఆయన బృందానికి కూడా నా శుభాకాంక్షలు.  మీరంతా ప్రశంసనీయమైన కృషితో ఒడిశా అభివృద్ధికి కొత్త ఊపునిచ్చారు.

మిత్రులారా

ఒడిశా కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదుఒడిశా భారత వారసత్వంలో ఒక దివ్య తారవందల సంవత్సరాలుగా ఒడిశా భారత నాగరికతను,  సంస్కృతిని సుసంపన్నం చేసిందిఅందుకే నేడు, 'వికాస్' (అభివృద్ధి), 'విరాసత్' (వారసత్వంమంత్రం భారత పురోగతికి పునాదిగా మారిన వేళఒడిశా పాత్ర మరింత గొప్పదిగా మారిందిగత సంవత్సరంలోఒడిశా నిజంగా 'వికాస్ భీవిరాసత్ భీ'  అంటే అభివృద్ధి,  వారసత్వం రెండూ-  అనే ఈ మంత్రాన్ని స్వీకరించి వేగంగా ముందుకు సాగింది.

మిత్రులారా

ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సమయంలోమీరంతా జగన్నాథ రథయాత్ర సన్నాహాల్లో నిమగ్నమై ఉండటం ఒక ఆహ్లాదకరమైన యాదృచ్ఛికంమహాప్రభువు మనకు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదుఆయన మనకు స్ఫూర్తినిచ్చే మూలం కూడాఆయన ఆశీస్సులతోశ్రీమందిరానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమయ్యాయిలక్షలాది భక్తుల ఆకాంక్షలను గౌరవించినందుకు ముఖ్యమంత్రి మోహన్ కుఆయన ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.. ప్రభుత్వం ఏర్పడిన వెంటనేశ్రీమందిరం నాలుగు ద్వారాలు తెరుచుకున్నాయిశ్రీమందిరం లోని రత్న భండార్ (ఆభరణాల గదిను కూడా తెరిచారునేను స్పష్టం చేయదలుచుకున్నది ఏమిటంటే — ఇది రాజకీయ లాభం లేదా విజయానికి సంబంధించిన విషయం కాదుఇది కోట్లాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని గౌరవించే చర్య.

మిత్రులారా

కేవలం రెండు రోజుల క్రితంనేను జీసదస్సు కోసం కెనడాలో ఉన్నప్పుడుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాకు ఫోన్ చేశారుఆయన మాట్లాడుతూ, "మీరు ఇప్పటికే కెనడాలో ఉన్నారు కాబట్టివాషింగ్టన్‌కు వచ్చి వెళ్లవచ్చు కదామనం కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుందాంఅని నన్ను ఆప్యాయంగా ఆహ్వానించారునేను అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపి, "మీ ఆహ్వానానికి ధన్యవాదాలుకానీ మహాప్రభువు పుణ్యభూమికి వెళ్లడం నాకు అత్యవసరంఅని చెప్పానుఅలా నేను ఆయన ఆహ్వానాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరించానుమీ ప్రేమమహాప్రభువుపై భక్తి నన్ను ఈ పవిత్ర భూమికి తీసుకువచ్చాయి.

సోదరసోదరీమణులారా,

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటుదేశం కాంగ్రెస్ నమూనాను చూసిందికాంగ్రెస్ నమూనా సుపరిపాలనను అందించలేదుప్రజల జీవితాలను సులభతరం చేయలేదుతీవ్రమైన అవినీతితో పాటు అభివృద్ధి ప్రాజెక్టులను ఆలస్యం చేయడంనిలిపివేయడంఅడ్డుకోవడం కాంగ్రెస్ అభివృద్ధి నమూనాకు ప్రత్యేక లక్షణాలుగా మారాయికానీ ఇప్పుడుగత కొన్ని సంవత్సరాలుగా దేశం బీజేపీ అభివృద్ధి నమూనాను చూస్తోందిగత దశాబ్దంలోబీజేపీ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనేక రాష్ట్రాలు ఉన్నాయిఈ రాష్ట్రాలలో కేవలం ప్రభుత్వ మార్పు మాత్రమే కాదు... అది సామాజికఆర్థిక మార్పు దిశగా కూడా కొత్త శకానికి నాంది పలికిందితూర్పు భారతదేశంలోని ఉదాహరణలతో దీన్ని వివరిస్తానుఅస్సాం ఉదాహరణను తీసుకోండిపదేళ్ల క్రితంఅస్సాం పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదిఅస్థిరతవేర్పాటువాదంహింస విపరీతంగా ఉండేవికానీ నేడుఅస్సాం అభివృద్ధిలో కొత్త మార్గంలో దూసుకుపోతోందిదశాబ్దాలుగా కొనసాగిన విద్రోహ కార్యకలాపాలు ముగిశాయిఅనేక రంగాలలోఅస్సాం ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోందిఅదేవిధంగానేను మరొక రాష్ట్రం గురించి చెప్పదలుచుకున్నానుఅది త్రిపురదశాబ్దాల వామపక్ష పాలన తర్వాతప్రజలు బీజేపీకి మొదటిసారి అవకాశం ఇచ్చారుత్రిపుర కూడా అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉండేదిమౌలిక సదుపాయాలు దారుణంగా ఉండేవిప్రజల గొంతులు ప్రభుత్వ యంత్రాంగానికి వినిపించేవి కావుప్రజలంతా హింసఅవినీతితో ఇబ్బంది పడుతుండేవారుకానీ బీజేపీకి సేవ చేసే అవకాశం లభించినప్పటి నుంచి త్రిపుర ఇప్పుడు శాంతి,  పురోగతికి ప్రతీకగా మారుతోంది.

మిత్రులారా

మన ఒడిశా కూడా దశాబ్దాలుగా అనేక సమస్యలతో సతమతమవుతూ వచ్చిందిపేదలురైతులకు  న్యాయబద్ధమైన వాటా లభించలేదుఅవినీతిజాప్యం ప్రబలంగా ఉండేవిఒడిశాలో మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉండేవిఒడిశాలోని అనేక ప్రాంతాలు అభివృద్ధి పరుగులో నిరంతరం వెనుకబడి పోయాయిఈ సవాళ్లు ఒడిశా దురదృష్టకర వాస్తవంలో ఒక భాగంగా మారాయిఈ సవాళ్లను అధిగమించడానికి గత ఒక్క సంవత్సరంలోనే బీజేపీ ప్రభుత్వం పూర్తి శక్తితో నిబద్ధతతో పనిచేసింది.

మిత్రులారా

ఇక్కడ పనిచేస్తున్న డబుల్-ఇంజిన్ అభివృద్ధి నమూనా దాని ప్రయోజనాలను స్పష్టంగా చూపుతోందినేడు కూడావేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల ప్రారంభోత్సవంశంకుస్థాపన ఈ డబుల్ ఇంజిన్ ముద్రను కలిగి ఉన్నాయిడబుల్ ఇంజిన్ ఒడిశా ప్రజలకు రెట్టింపు ప్రయోజనాలను అందించిందినేను మీకు ఒక ఉదాహరణ ఇస్తానుఒడిశాలోని కోట్లాది పేద కుటుంబాలు చాలా కాలంగా ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలకు దూరంగా ఉన్న విషయం మీకు తెలుసునేడు ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజనగోపబంధు జన్ ఆరోగ్య యోజన రెండూ కలిసి నడుస్తున్నాయిదీని ఫలితంగాఒడిశాలో సుమారు కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు ఉచిత వైద్య చికిత్సకు హామీ లభించిందిఒడిశాలోని ఆసుపత్రులలో మాత్రమే కాదు... ఒడిశా నుంచి ఎవరైనా మరో రాష్ట్రంలో పని చేయడానికి వెళ్ళినాఅవసరమైనప్పుడు వారికి అక్కడ కూడా ఉచిత వైద్య చికిత్స లభిస్తోందినేను గమనించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నానునేను గుజరాత్‌లో పుట్టానుసూరత్‌లో మీకు అడుగడుగునా ఒడిశా వ్యక్తులు తగులుతారుఅంత మంది ఒడియా ప్రజలు అక్కడ నివసిస్తున్నారుఇప్పుడుసూరత్‌లో నివసిస్తున్న ఒడియా సోదర సోదరీమణులు కూడా ఈ పథకం నుంచి నుండి ప్రయోజనం పొందుతారుఇప్పటివరకుఒడిశా నుంచి రెండు లక్షల మంది ప్రజలు ఈ పథకం కింద చికిత్స పొందారువారిలో చాలా మంది దేశవ్యాప్తంగా డజనుకు పైగా రాష్ట్రాలలో ఉచిత వైద్య సేవలను పొందారుసంవత్సరం కిందట ఇంత మంది ప్రజలకు ఇటువంటి సౌకర్యం ఊహించనిదిఈ డబుల్-ఇంజిన్ నమూనాకు ధన్యవాదాలుమనం ఊహించిన దానికంటే గొప్పదాన్ని సాధించాంఒక సువర్ణావకాశం మరింత ప్రత్యేకంగా మారింది.

ఇక్కడ ఒడిశాలో, 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు 23 లక్షల మందికి పైగా ఉన్నారుపీఎం వయ వందన యోజన ద్వారావారికి ఇప్పుడు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స లభిస్తుందిఅంటేసాధారణ కుటుంబాల అతి పెద్ద ఆందోళనల్లో ఒకదానికి మన ప్రభుత్వం పరిష్కారం చూపిందిఅదేవిధంగాఇంతకు ముందుఒడిశాలోని రైతులకు పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పూర్తి ప్రయోజనాలు లభించలేదుఇప్పుడుఒడిశాలోని రైతులు కేంద్రరాష్ట్ర పథకాలు రెండింటి నుంచీ ద్వంద్వ ప్రయోజనాలను పొందుతున్నారువరి ధాన్యానికి కనీస మద్దతు ధరను పెంచుతామని మనం ఇచ్చిన హామీ లక్షలాది వరి రైతులకు కూడా ప్రయోజనం చేకూర్చింది.

మిత్రులారా

గతంలో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలు ఒడిశాకు చేరలేదుకానీ ఇప్పుడు ప్రజలు కేంద్రరాష్ట్ర ప్రభుత్వ పథకాలు రెండింటి ప్రయోజనాలను పొందుతున్నారుఅంతేకాకుండా ఎన్నికల సమయంలో మనం తల్లులకుసోదరీమణులకురైతులకుయువతకు ఇచ్చిన హామీలు క్షేత్ర స్థాయిలో వేగంగా అమలు జరుగుతున్నాయి

మిత్రులారా

మన ప్రభుత్వ అతి పెద్ద విజయాలలో ఒకటి బలహీన వర్గాల సాధికారతఒడిశాలోజనాభాలో పెద్ద భాగం మన గిరిజన వర్గాలకు చెందినవారుదురదృష్టవశాత్తుఈ వర్గాలను గతంలో నిరంతరం నిర్లక్ష్యం చేశారువారు వెనుకబాటుతనంపేదరికంవంచనకు గురయ్యారుదశాబ్దాలుగా దేశాన్ని పాలించిన పార్టీ గిరిజన జనాభాను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సాధనంగా ఉపయోగించిందివారు గిరిజన వర్గాలకు అభివృద్ధిని గానీభాగస్వామ్యాన్ని గానీ ఇవ్వలేదుబదులుగావారు దేశంలోని విస్తారమైన ప్రాంతాలను నక్సలిజంహింసఅణచివేత అగ్నిగుండంలోకి నెట్టారు.

మిత్రులారా

2014 ముందు పరిస్థితి ఎలా ఉందంటేదేశంలోని 125కు పైగా గిరిజన ప్రాబల్య జిల్లాలు నక్సల్స్ హింసాత్మక చర్యల పట్టులో ఉండేవిగిరిజన ప్రాంతాలు "రెడ్ కారిడార్అనే ముద్రతో అపఖ్యాతి పాలయ్యాయిఈ జిల్లాల్లో చాలా వాటిని కేవలం "వెనుకబడినవి"గా ప్రకటించిప్రభుత్వాలు వాటి బాధ్యత నుంచి తప్పుకున్నాయి.

సోదరసోదరీమణులారా,

ఇటీవలి సంవత్సరాలలోగిరిజన వర్గాలను హింసాత్మక వాతావరణం నుంచి బయటకు తీసుకువచ్చివారిని అభివృద్ధి పధంలోకి నడిపించడానికి మేం  కృషి చేశాంబీజేపీ ప్రభుత్వం ఒకవైపు హింసను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూమరోవైపు గిరిజన ప్రాంతాలలో అభివృద్ధిని తీసుకువచ్చిందిదీని ఫలితంగానేడు దేశం మొత్తం మీద నక్సల్స్ హింస కేవలం 20 జిల్లాలకు మాత్రమే పరిమితమైందిచర్యలు తీసుకుంటున్న వేగాన్ని బట్టి చూస్తేఅతి త్వరలో మన గిరిజన సోదర,సోదరీమణులు హింస నుంచి పూర్తిగా విముక్తి పొందుతారుదేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాంఇది మోదీ హామీ.

మిత్రులారా

మన గిరిజన సోదరసోదరీమణుల కలలను నెరవేర్చడంవారికి కొత్త అవకాశాలను కల్పించడంవారి జీవితాల్లోని కష్టాలను తగ్గించడం మన ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతలుఅందుకేగిరిజన అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రెండు ప్రధాన జాతీయ పథకాలు మొదటిసారిగా ప్రారంభమయ్యాయిఈ రెండు పథకాలపై లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాంమొదటి పథకం బిర్సా ముండా పేరు మీదుగా ప్రారంభించిన 'ధర్తి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్'. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 60,000కు పైగా గిరిజన గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయిఒడిశాలో కూడా గిరిజన కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నారురోడ్లు వేస్తున్నారువిద్యుత్ నుస్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారుఒడిశాలోని 11 జిల్లాల్లో 40 రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా నిర్మిస్తున్నారుఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.

మిత్రులారా

రెండో పథకం పీఎం-జన్ మన్ యోజనఈ పథకానికి స్ఫూర్తి ఒడిశా గడ్డ నుంచే వచ్చిందిదేశానికి మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిఒడిశా ముద్దుబిడ్డగౌరవ ద్రౌపది ముర్ము ఈ పథకాన్ని రూపొందించడంలో మనకు మార్గనిర్దేశం చేశారుఈ పథకం కిందఅత్యంత బలహీనమైన గిరిజన వర్గాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయివారి అనేక చిన్న గిరిజన ఆవాసాలలోవందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

మిత్రులారా

ఒడిశాలో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు నివసిస్తున్నారువారి కోసం కూడామొదటిసారిగా ఒక పెద్ద దేశవ్యాప్త పథకంపీఎం మత్స్య సంపద యోజన అమలు జరుగుతోందిమొట్టమొదటిసారిగామత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయికేంద్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందిఇది ఒడిశాలోని తీరప్రాంత మత్స్యకార సమాజాలకుయువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

మిత్రులారా

21వ శతాబ్దపు భారతదేశ అభివృద్ధికి తూర్పు భారతదేశం వేగాన్ని అందిస్తోందిఇది పూర్వోదయ-   తూర్పు ప్రాంత ఆవిర్భావ శకంఈ స్ఫూర్తితోఒడిశాతో పాటు దేశంలోని తూర్పు ప్రాంతం మొత్తం అభివృద్ధికి మేము అంకితమయ్యాంఒక సంవత్సరం కిందట ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఈ లక్ష్యాన్ని మరింత వేగవంతం చేసిందిపరదీప్ నుంచి ఝార్సుగూడ వరకు పారిశ్రామిక ప్రాంతాలు విస్తరిస్తున్నాయిఇది ఒడిశా ఖనిజ,  ఓడరేవు ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందికేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్డురైలు విమాన మార్గాల కనెక్టివిటీ కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోందిపరదీప్‌లో మెగా డ్యూయల్-ఫీడ్ క్రాకర్డౌన్‌స్ట్రీమ్ యూనిట్ల స్థాపన కావచ్చుచండిఖోల్‌లో క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ సౌకర్యం కావచ్చులేదా గోపాల్‌పూర్‌లో ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మాణం కావచ్చు ఇవన్నీ ఒడిశాను ఒక ప్రధాన పారిశ్రామిక రాష్ట్రంగా నిలుపుతాయిపెట్రోలియంపెట్రోకెమికల్స్వస్త్రాలుప్లాస్టిక్‌లకు సంబంధించిన పరిశ్రమలు ఇక్కడ గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందుతాయిఇది చిన్నమధ్య తరహా పరిశ్రమల విస్తృత వ్యవస్థను సృష్టిస్తుందియువతకు లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందిఇటీవలి సంవత్సరాలలోఒడిశాలో ఒక్క పెట్రోలియంపెట్రోకెమికల్ రంగంలో సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయిఒడిశా భారతదేశ పెట్రోకెమికల్ కేంద్రంగా మారడానికి శరవేగంగా పురోగమిస్తోంది.

మిత్రులారా

పెద్ద లక్ష్యాలను సాధించడానికి మనం ఇంకా చాలా దూరం చూడాలిమనకు దూరదృష్టి కావాలిఇక్కడ మన బీజేపీ ప్రభుత్వం కేవలం ఒక సంవత్సరం విజయాలను జరుపుకోవడానికి లేదా ఐదేళ్ల వ్యవధికి మాత్రమే ఆలోచించడానికి పరిమితం కాబోదు.. ఇది రాబోయే దశాబ్దాల పాటు ఒడిశా అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికపై పనిచేస్తోందిరాష్ట్రం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే 2036 సంవత్సరం కోసం ఒడిశా ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేసిందిదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి కూడా ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం ఒక దార్శనికతను కలిగి ఉందినేను ఒడిశా విజన్ 2036ని సమీక్షిస్తున్నానుఅందులో కొన్ని చాలా ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు ఉన్నాయిఒడిశా యువత ప్రతిభకష్టపడే తత్వంతో మీరు ప్రతి ఒక్క లక్ష్యాన్ని సాధిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉందిఅందరం కలిసి ఒడిశాను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తాంఈ వాగ్దానంతోమీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మరోసారి అందరికీ నా ఆత్మీయ శుభాకాంక్షలు!

జై జగన్నాథ్!

జై జగన్నాథ్!

జై జగన్నాథ్!

గమనికఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం

 

***


(Release ID: 2139070)