ప్రధాన మంత్రి కార్యాలయం
జీపీడీఆర్ఎర్ 2025లో ప్రపంచ విపత్తు ప్రతిస్పందన, ప్రజారోగ్యం పట్ల అంకిత భావాన్ని పునరుద్ఘాటించిన భారత్
జీపీడీఆర్ఆర్ 2025లో జీ20, డబ్ల్యూహెచ్‌వో, ఏయూతో సమావేశమైన డాక్టర్ పీకే మిశ్రా
Posted On:
05 JUN 2025 8:27PM by PIB Hyderabad
జెనీవాలో జరుగుతున్న గ్లోబల్ ప్లాట్‌ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (జీపీడీఆర్ఆర్) 2025లో భాగంగా ఈ రోజు నిర్వహించిన జీ20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (డీఆర్ఆర్) వర్కింగ్ గ్రూప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా పాల్గొన్నారు. ఈ చర్చల్లో భాగంగా అభివృద్ధి అవసరాలకు తగినట్లుగా ఆర్థిక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ప్రపంచంలో విపత్తుల వల్ల ఎదురయ్యే ముప్పును తగ్గించడంలో జీ20 పోషిస్తున్న కీలక పాత్ర గురించి వివరించారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, సమష్టి ప్రయత్నాలను చేపట్టడం గురించి వివరించారు.
ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, స్థిరమైన భవిష్యత్తు కోసం అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరించడంపై భారత్ అంకితభావాన్ని డాక్టర్ మిశ్రా పునరుద్ఘాటించారు. ఏయూ కమిషనర్ మోసెస్ విలాకటి, ఫ్రాన్స్ ఓఎన్‌యూ జెనీవా నుంచి సీడీఆర్ఐ ఉపాధ్యక్ష ప్రతినిధి సమక్షంలో విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన సమితి (సీడీఆర్ఐ)లో నూతన సభ్యత్వం పొందిన ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)కు స్వాగతం పలికారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన సమయంలో జీ20లో ఏయూకి శాశ్వత సభ్యత్వం లభించిన తర్వాత ఇది జరిగింది.
జెనీవాలో జరుగుతున్న జీపీడీఆర్‌ఆర్‌లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్‌తో డాక్టర్ మిశ్రా సమావేశమయ్యారు. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలపై డబ్ల్యూహెచ్‌వోతో భారత్ భాగస్వామ్యం గురించి వారు చర్చించారు. 2025 డిసెంబర్‌లో న్యూఢిల్లీలో డబ్ల్యూహెచ్‌వో నిర్వహించనున్న రెండో అంతర్జాతీయ సంప్రదాయ ఔషధాల సదస్సుకు భారత్ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. గుజరాత్లో జామ్‌నగర్లో ఉన్న డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రం పట్ల భారత్ నిబద్ధతను కూడా తెలియజేశారు.
***
(Release ID: 2136241)
Visitor Counter : 4
Read this release in:
Odia
,
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam