ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి సాధన... ఇదే మా నిబద్ధత... ప్రధానమంత్రి పునరుద్ఘాటన

Posted On: 11 JUN 2025 2:20PM by PIB Hyderabad
సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోవాలన్న మొక్కవోని నిబద్ధత ప్రభుత్వానిదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు. రక రకాల ప్రజానుకూల పథకాల ప్రయోజనాలు వీలయినంత ఎక్కువ మంది పౌరులకు లబ్ధిని చేకూర్చేటట్లుగా తగిన జాగ్రత్త చర్యలను తీసుకొంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలతో క్రమేణా చాలా మందికి  ప్రయోజనాలు అందుతున్నాయని ఆయన ప్రశంసలు కురిపించారు.

కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పొందుపరిచిన ఒక పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:

‘‘ఇది ప్రశంసనీయ వృద్ధి..సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి సాధన బాటలో సాగిపోవడం మా నిబద్ధత... దీనిని ఈ వృద్ధి సూచించడంతో పాటు, మేం అమలు చేస్తున్న అనేక ప్రజానుకూల పథకాలతో రానురాను మరింత ఎక్కువ మందికి ప్రయోజనాలు కలుగుతున్నాయని కూడా ఇది చాటిచెబుతోంది’’ అని పేర్కొన్నారు. ‌
 
***‌

(Release ID: 2135739) Visitor Counter : 6