హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన అధికారులను న్యూఢిల్లీలో కలిసిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా


చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు అభినందనలు తెలిపిన శ్రీ అమిత్ షా

ధైర్యసాహసాలతో ఈ ఆపరేషన్లను విజయవంతం చేసిన వీర జవాన్లను త్వరలో కలిసేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన శ్రీ అమిత్ షా
నక్సలిజం ముప్పు నుంచి భారత్‌ను విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీ అమిత్ షా

प्रविष्टि तिथि: 07 JUN 2025 4:32PM by PIB Hyderabad

ఇటీవల నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించిన అధికారులను కేంద్ర హోంసహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ ఆపరేషన్లలో చరిత్రాత్మక విజయం సాధించినందుకు వారిని అభినందించారునక్సలిజం ముప్పు నుంచి భారత్‌ను విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు... "ఇటీవల జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన అధికారులను కలిశానుఈ ఆపరేషన్లలో చరిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా వారిని అభినందించానుఈ ఆపరేషన్లను ధైర్యసాహసాలతో విజయవంతం చేసిన సాహసోపేత జవాన్లను కలవడానికి నేను ఆసక్తిగా ఉన్నానుత్వరలోనే వారిని కలవడానికి ఛత్తీస్‌గఢ్‌ వెళతానునక్సలిజం ముప్పు నుంచి భారత్‌ను విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది."

కేంద్ర హోంసహకార మంత్రి మార్గదర్శకత్వంలోభద్రతా దళాలు ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయం విదితమేఈ ప్రయత్నాల్లో భాగంగాఛత్తీస్‌గఢ్ పోలీసులు (నారాయణపూర్దంతేవాడకొండగావ్బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ యూనిట్లతో సహా) 18.05.2025 నుంచి 21.05.2025 వరకు అబుజ్మద్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఒక ఆపరేషన్ నిర్వహించారు. 21.05.2025బోటర్ గ్రామ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది నక్సల్స్ హతమయ్యారు. మృతుల్లో సీపీఐ (మావోయిస్ట్ప్రధాన కార్యదర్శిపొలిట్ బ్యూరో సభ్యుడు బసవరాజు అలియాస్ గగన్న కూడా ఉన్నారుఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఆయుధాలుమందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారుల్లో ఛత్తీస్‌గఢ్ డీజీపీ శ్రీ అరుణ్ దేవ్ గౌతమ్అదనపు డీజీ (యాంటీ-నక్సల్ ఆపరేషన్స్/ఎస్ఐబీ/ఎస్‌టీఎఫ్శ్రీ వివేకానంద్జీ (బస్తర్ రేంజ్శ్రీ సుందర్‌రాజ్సూపరింటెండెంట్ (నారాయణ్‌పూర్శ్రీ ప్రభాత్ కుమార్సూపరింటెండెంట్ (బీజాపూర్శ్రీ జితేంద్ర యాదవ్సూపరింటెండెంట్ (నక్సల్ రహిత బస్తర్ జిల్లాశ్రీ శలభ్ సింగ్‌లను కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా సత్కరించారుఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయిఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ శర్మకేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ తపన్ డేకా సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2134941) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Malayalam