ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నార్వే చెస్ 2025లో మాగ్నస్ కార్ల్‌సెన్‌ పై తొలిసారిగా విజయం సాధించిన గుకేశ్ ను అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 JUN 2025 8:06PM by PIB Hyderabad

తొలిసారిగా మాగ్నస్ కార్ల్‌సెన్‌పై విజయం సాధించినందుకు చెస్ ఆటగాడు  గుకేశ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. నార్వే చెస్ 2025 రౌండ్‌ 6లో మాగ్నస్  కార్ల్‌సెన్‌  పై గుకేశ్ గెలిచాడు.
"అత్యుత్తమ ఆడగాడిపై విజయం సాధించినందుకు అభినందనలు. నార్వే చెస్ 2025 రౌండ్ 6లో తొలిసారిగా మాగ్నస్ కార్ల్‌సెన్‌పై విజయం సాధించడం అతని ప్రతిభ, అంకితభావాన్ని తెలియజేస్తోంది." అని ప్రధాని అన్నారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు. 

 

" గుకేశ్ సాధించినది అసాధారణ విజయం! అత్యుత్తమ ఆటగాడిపై విజయం సాధించినందుకు అతనికి అభినందనలు. నార్వే చెస్ 2025 రౌండ్ 6లో మాగ్నస్ కార్ల్‌సెన్‌పై తొలి విజయం అతని ప్రతిభ, అంకితభావాన్ని తెలియజేస్తోంది. ముందున్న జీవన ప్రయాణంలో అతనికి విజయం కలగాలని కోరుకుంటున్నాను."


(रिलीज़ आईडी: 2133425) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Malayalam , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada