ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్’ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 29 MAY 2025 7:41PM by PIB Hyderabad

జై జగన్నాథ్‌!

దేశంలోని రైతుల కోసం ఈ రోజు జగన్నాథ స్వామి ఆశీస్సులతో ‘వ్యవసాయాభివృద్ధి సంకల్ప కార్యక్రమం’ (వికసిత కృషి సంకల్ప్‌ అభియాన్‌పేరిట విశిష్ట పథకానికి శ్రీకారం చుడుతున్నాంరుతుపవనాలు వచ్చేశాయి... ఖరీఫ్ సాగుకు సన్నాహాలు మొదలయ్యాయిఈ నేపథ్యంలో మరో 12 నుంచి 15 రోజుల్లో శాస్త్రవేత్తలునిపుణులుఅధికారులుప్రగతిశీల రైతులతో కూడిన 2,000 బృందాలు దేశవ్యాప్తంగా గ్రామ సందర్శనకు బయల్దేరుతాయిఈ కార్యక్రమంపై 700కుపైగా జిల్లాల్లోని లక్షలాది రైతులకు ఈ బృందాలు అవగాహన కల్పిస్తాయిఈ విశిష్ట కార్యక్రమందీనిపై విస్తృత ప్రచారం ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత వ్యవసాయ రంగ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ రైతులందరితోపాటు ప్రచార బృందాలకు నా శుభాకాంక్షలు.

మిత్రులారా!

మన దేశంలో వ్యవసాయం సంప్రదాయకంగా రాష్ట్ర పరిధిలోని అంశంకాబట్టిప్రతి రాష్ట్రం తన సొంత వ్యవసాయ విధానాలను రూపొందిస్తూ రైతు ప్రయోజనాల దిశగా చర్యలు చేపడుతుందిఅయితేవేగంగా మారుతున్న కాలమాన పరిస్థితుల్లో దేశ వ్యవసాయ రంగంలో సమగ్ర సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందిమన రైతులు రికార్డు స్థాయిలో దిగుబడి సాధించడం ద్వారా గాదెలు నింపుతున్నారుఅయితేమార్కెట్లు విస్తరించడమే కాకుండా వినియోగదారు ప్రాధాన్యాలు కూడా మారిపోతున్నాయిఅయితేరాష్ట్ర ప్రభుత్వాలతో రైతుల సంయుక్త కృషి ద్వారా వ్యవసాయ వ్యవస్థలో మార్పుల దిశగా ఇదొక వినమ్ర ప్రయత్నంభారత వ్యవసాయ రంగ ఆధునికీకరణే దీని లక్ష్యంఅందుకేరైతులతో ప్రత్యక్ష చర్చలను ప్రారంభించాలన్నది ఈ కార్యక్రమ ధ్యేయందీనికింద మన శాస్త్రవేత్తల బృందాలు “ప్రయోగశాల నుంచి కమతానికి” అనే భావనను భారీస్థాయిలో ముందుకు తీసుకెళ్తాయివిస్తృత సమాచారం ప్రాతిపదికన వారు రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ సాగు సమయం మొదలయ్యే ముందు వారికి మద్దతిస్తారు.

మిత్రులారా!

మన వ్యవసాయ శాస్త్రవేత్తలు గత దశాబ్దాలుగా విలువైన పరిశోధనలతో అద్భుత ఫలితాలు సాధించారుమరోవైపు మన ప్రగతిశీల రైతులు తమ సొంత ప్రయోగాలతో వ్యవసాయంలో గణనీయ మార్పులు తెస్తూ దిగుబడుల పెంపుద్వారా గొప్ప విజయం సాధించారుఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాలుప్రగతిశీల రైతుల పద్ధతుల సాఫ్యలాలు మన వ్యవసాయ సమాజానికి మరింత చేరువ కావడం చాలా అవసరంమీరందరూ ఈ దిశగానే కృషి చేస్తున్నారు... కానీఇప్పుడు దీన్ని సరికొత్త శక్తితో ముందడుగు వేయాల్సి ఉందిఇందుకు ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్’ విశిష్ట అవకాశమిస్తుంది.

మిత్రులారా!

వికసిత భారత్’ సంకల్ప సాకారం కోసం దేశ వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలిఅందుకేకేంద్ర ప్రభుత్వం అనేక కీలక రంగాలపై దృష్టి సారిస్తోందిఈ మేరకురైతు ఉత్పత్తికి గిట్టుబాటు ధర లభించేలా చూడటం ఎలావ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమెలాజాతీయ అవసరాల మేరకు పంటల సాగు ఎలాసొంత ఆహార అవసరాలు తీర్చుకుంటూ ప్రపంచ ఆహార సరఫరాదారుగా భారత్‌ రూపొందడం ఎలాభారత్ ఆహార భాండంగా మారడం ఎలావాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కోవడం ఎలాతక్కువ నీటితో ఎక్కువ ధాన్యం ఉత్పత్తి ఎలాహానికర రసాయనాల నుంచి భూమాతకు రక్షణ ఎలావ్యవసాయ ఆధునికీకరణకు ఏంచేయాలిశాస్త్ర-సాంకేతికతల ఫలితాలను పొలాలకు చేర్చడం ఎలాఇత్యాది అనేకానేక అంశాలపై గత 10–11 ఏళ్లుగా మా ప్రభుత్వం నిరంతరం విస్తృత స్థాయిలో కృషి చేసిందిఇక ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా రైతులలో సాధ్యమైనంత ఎక్కువగా అవగాహన పెంచడం మీ కర్తవ్యం.

మిత్రులారా!

ఈ సందర్భంగా మనం దృష్టి సారించాల్సిన ముఖ్యాంశంరైతుకు అదనపు ఆదాయ వనరులు సమకూర్చడంఇందులో భాగంగా పొలం గట్లపై సౌర ఫలకాల ఏర్పాటుదేశంలో విస్తరిస్తున్న మధుర విప్లవం (తేనెటీగల పెంపకం)తో అధికశాతం రైతుల అనుసంధానంవ్యర్థాలుగా పరిగణించే పంట అవశేషాలతో ఇంధనోత్పత్తివ్యర్థం నుంచి అర్థం (సంపద సృష్టి), ఏ తరహా నేల ఎలాంటి చిరుధాన్యం (శ్రీ అన్నసాగుకు అనుకూలమో గుర్తించడంవివిధ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు మార్గాన్వేషణ వంటి కార్యకలాపాలు చేపట్టాలినేడు గోబర్‌’ధన్‌’ యోజన ద్వారా వట్టిపోయిన పశువులు కూడా ఆదాయ వనరుగా మారుతున్నాయిఈ అంశాలన్నిటినీ మనం రైతు సోదరీసోదరులతో కూర్చుని చర్చిస్తూవారికి వివరణాత్మక సమాచారం అందించాలి.

మిత్రులారా!

భారత వ్యవసాయ రంగాన్ని ‘వికసిత భారత్’ పునాదిగా మార్చడంలో ఇదో మహా సంకల్పంరైతులంతా వీలైనన్ని ఎక్కువ సందేహాలను గ్రామ సందర్శనకు వచ్చే శాస్త్రవేత్తల ముందుంచాలని నా సూచనఅలాగే శాస్త్రవేత్తలుఅధికారులను కూడా నేను కోరుతున్నదేమిటంటేఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు... ఇదొక ఒక జాతీయ లక్ష్యంకాబట్టిదేశ సేవ స్ఫూర్తితో ఈ కార్యక్రమ లక్ష్యాన్ని సాధించండిరైతు సంధించే ప్రతి ప్రశ్నకూ బదులివ్వండి... అదే సమయంలో వారి విలువైన సూచనలను కూడా నమోదు చేయండి. ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్’ మన ‘అన్నదాత’లకు సరికొత్త ప్రగతి ద్వారాలు తెరుస్తుంది.  ఈ ఆశాభావనతో అన్ని బృందాలకురైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ధన్యవాదాలు!

 

***


(Release ID: 2132932)