ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ ఎన్.టీ రామారావు గారికి అంజలి ఘటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 MAY 2025 9:41AM by PIB Hyderabad
శ్రీ ఎన్.టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అంజలి ఘటించారు. ‘‘సమాజ సేవలోనూ, పేదల, నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి కారణంగా ఆయన ఎంతగానో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ వాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ఆయన ఒక సందేశాన్ని పోస్టు చేశారు:
‘‘ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నాను. సమాజ సేవలోనూ, పేదల, నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి కారణంగా ఆయన ఎంతగానో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన నటించిన సినిమాలు నేటికీ ఎందరినో అలరిస్తున్నాయి. ఆయన మనందరికీ ఎనలేని స్ఫూర్తిని అందించారు’’
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎన్టీఆర్ కన్న కలల్ని నెరవేర్చేందుకు కృషి చేస్తోంది’’ @ncbn
(रिलीज़ आईडी: 2131871)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam