సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        ఈ నెల 27- 29 తేదీల్లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పర్యటించనున్న  విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ మిస్రీ
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                26 MAY 2025 6:58PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                
విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ మిస్రీ రేపటి (ఈ నెల 27 మంగళవారం) నుంచి ఈ నెల 29 తేదీ వరకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పర్యటించనున్నారు. ఆయన అమెరికా పాలనాయంత్రాంగంలోని సీనియర్ అధికారులతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి గత ఫిబ్రవరిలో చేపట్టిన అమెరికా పర్యటనకు తరువాయిగా శ్రీ మిస్రీ ఆ దేశంలో పర్యటించనున్నారు. ప్రధాని యూఎస్ పర్యటన సందర్బంగా రెండు దేశాలూ ‘ఇండియా-యు.ఎస్. కాంపాక్ట్’ (క్యాటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలిటరీ పార్ట్‌నర్‌షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ) పేరిట ఒక కొత్త భాగస్వామ్యానికి నాంది పలికాయి. 21వ శతాబ్దంలో సైన్య సహకారం, వాణిజ్యంలతో పాటు సాంకేతికత.. ఈ రంగాల్లో మరిన్ని అవకాశాలను కల్పించుకోవాలన్నదే ఇండియా-యు.ఎస్. కాంపాక్ట్ ఉద్దేశం.  
 
 
                
                
                
                
                
                (Release ID: 2131601)
                Visitor Counter : 4