సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కువైట్‌లో పర్యటించనున్న భారత అఖిలపక్ష ప్రతినిధి బృందం (మే 26-27)

Posted On: 25 MAY 2025 3:18PM by PIB Hyderabad

గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ బైజయంత్ జయ్ పాండా నేతృత్వంలో ప్రస్తుత పార్లమెంటు సభ్యులుమాజీ మంత్రిభారత మాజీ విదేశాంగ కార్యదర్శితో కూడిన భారత అఖిలపక్ష ప్రతినిధి బృందంఅన్ని రూపాల్లో గల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ఐక్యమైనస్థిరమైన వైఖరిని వివరించే లక్ష్యంతో నిర్వహిస్తున్న దౌత్యపరమైన పర్యటనలో భాగంగా ఈనెల 26 నుంచి 27 వరకు కువైట్‌లో పర్యటించనుంది.

2.      ఈ ప్రతినిధి బృందంలోని సభ్యులు:

i)  శ్రీ బైజయంత్ జయ్ పాండాగౌరవ పార్లమెంటు సభ్యులులోక్‌సభ, మాజీ పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ)

ii)   డాక్టర్ నిషికాంత్ దుబేగౌరవ పార్లమెంటు సభ్యులు (లోక్‌సభ)కమ్యూనికేషన్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ చైర్మన్

iii)   శ్రీమతి ఎస్ ఫాంగ్నాన్ కోన్యాక్గౌరవ పార్లమెంటు సభ్యురాలు (రాజ్యసభ)నాగాలాండ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన తొలి మహిళ.

iv)   శ్రీమతి రేఖా శర్మగౌరవ పార్లమెంటు సభ్యురాలు (రాజ్యసభ)జాతీయ మహిళా కమిషన్ మాజీ జాతీయ చైర్‌పర్సన్

v)   శ్రీ అసదుద్దీన్ ఒవైసీగౌరవ పార్లమెంటు సభ్యులు (లోక్‌సభ)ఆల్ ఇండియా మజ్లిస్--ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షులు

vi)   శ్రీసత్నామ్ సింగ్ సంధూగౌరవ పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ)వ్యవస్థాపక ఛాన్సెలర్చండీగఢ్ విశ్వవిద్యాలయం

vii)  శ్రీ గులాం నబీ ఆజాద్కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ మాజీ మంత్రిమాజీ ముఖ్యమంత్రిమాజీ పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ)

viii)  శ్రీ హర్ష్ వర్ధన్ శ్రింగ్లామాజీ విదేశాంగ కార్యదర్శియునైటెడ్ స్టేట్స్బంగ్లాదేశ్థాయిలాండ్‌ దేశాలకు మాజీ రాయబారి

3.      కువైట్‌లో తమ పర్యటన సందర్భంగా భారత ప్రతినిధి బృందంకువైట్ ప్రభుత్వ సీనియర్ ప్రతినిధులుపౌర సమాజంలోని ప్రముఖులుప్రభావశీలురుమేధావులుమీడియావివిధ రంగాలకు చెందిన ప్రవాస భారతీయులతో సంభాషించనున్నారు.

 

***


(Release ID: 2131166)