హోం మంత్రిత్వ శాఖ
కొత్త ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) పోర్టల్ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా చేతుల మీదుగా న్యూ ఢిల్లీలో ప్రారంభం
• ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఓసీఐ కార్డుదారులైన పౌరులకు ప్రపంచ స్థాయి ఇమిగ్రేషన్ సౌకర్యాల్ని అందించే దిశగా భారత్ నిరంతర కృషి
• ఓవర్‌సీస్ సిటిజన్స్ నమోదును సరళతరంగా తీర్చిదిద్దడానికి అత్యంత ఆధునిక యూజర్ ఇంటర్‌ఫేస్‌తో నూతన ఓసీఐ పోర్టల్ ప్రారంభం
• ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నివసిస్తున్న భారతీయ మూలాలున్న పౌరులు...వారు భారత్ వచ్చి, ఇక్కడ ప్రవాసముండే వేళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మనం జాగ్రత్తలు తీసుకొని తీరాలి
• గత దశాబ్దంలో నమోదైన సాంకేతిక ప్రగతి, ఓసీఐ కార్డుదారుల ప్రతిస్పందనల ఆధారంగా లోపాల తొలగింపు... యూజర్లకు మరింత చక్కని అనుభవాన్నివ్వడానికి ఓసీఐ పోర్టల్‌కు మెరుగులు
• ప్రస్తుతం 50 లక్షలకు పైబడిన ఓసీఐ కార్డుదారులతో పాటు కొత్త యూజర్లకు కూడా మెరుగైన సేవలను, అధిక భద్రతను, ఉపయోగానికి అనువైన అనుభవాన్ని అందించనున్న కొత్త పోర్టల్
• ఓసీఐ కొత్త పోర్టల్ https://ociservices.gov.in చిరునామాలో సంప్రదించవచ్చు…
Posted On:
19 MAY 2025 6:34PM by PIB Hyderabad
కొత్త ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) పోర్టల్‌ను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సోమవారం (మే 19న) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టరు సహా హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ఓసీఐ కార్డులు కలిగిన పౌరులకు ప్రపంచ శ్రేణి ఇమిగ్రేషన్ సౌకర్యాలను అందించేందుకు నిరంతరంగా పాటుపడుతోందన్నారు. ఓవర్‌సీస్ సిటిజన్ల నమోదును సులభతరంగా మార్చడానికి అతి కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన సరికొత్త ఓసీఐ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. భారతీయ మూలాలున్న పౌరులు ప్రపంచంలో అనేక దేశాల్లో నివసిస్తున్నారనీ, మరి వారు భారత్‌కు రావడంతో పాటు ఇక్కడ ప్రవాసమున్న కాలంలో ఎలాంటి ఇబ్బందులనూ ఎదుర్కోకుండా ఉండేలా మనం చూడాల్సి ఉందని మంత్రి అన్నారు.
కొత్త పోర్టల్ ఇప్పటి 50 లక్షలకు పైచిలుకు ఓసీఐ కార్డుదారులతో పాటు కొత్త యూజర్లకు మెరుగైన సేవలను, మరింత ఎక్కువ భద్రతను, వినియోగదారు అనుకూల అనుభవాన్ని అందిస్తుంది. నూతన ఓసీఐ పోర్టల్ ఇప్పటి యూఆర్ఎల్ అయిన https://ociservices.gov.in లో అందుబాటులో ఉంది.
సిటిజన్‌షిప్ యాక్టు-1955 లో ఒక సవరణను చేస్తూ, ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) పథకాన్ని 2005లో ప్రవేశపెట్టారు. భారతీయ మూలాలున్న వ్యక్తులకు భారత్‌లో ప్రవాసీ పౌరులు(ఓసీఐ)గా నమోదు చేసుకొనేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. అయితే దీనికి వారు 1950 జనవరి 26న గాని లేదా ఆ తరువాత భారతీయ పౌరులుగా ఉండడమో, లేదా ఆ తేదీనాటికి పౌరులు కావడానికి అర్హులై ఉండడమో జరగాలి. ఏమైనా, వ్యక్తులు స్వయంగా, లేదా తల్లితండ్రులు, అమ్మమ్మ-తాతయ్యలు, ముత్తవ్వ-ముత్తాతలు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ పౌరులుగా ఉండి ఉంటే గనక దీనికి- అంటే ఓసీఐగా నమోదుకు- అర్హులు కారు.
ఇప్పుడున్న ఓసీఐ సేవల పోర్టల్‌ను 2013లో రూపొందించారు. దీనిని విదేశాల్లో 180కి పైగా భారతీయ దౌత్య కార్యాలయాలతో పాటు 12 విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయాలు (ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్..‘ఎఫ్ఆర్ఆర్ఓ’స్)లో ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా రోజూ సుమారు 2000 దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు చేపడుతున్నారు. గత పది సంవత్సరాల్లో సాంకేతికంగా ముఖ్యప్రగతి చోటుచేసుకోవడంతోపాటు ఓసీఐ కార్డుదారుల నుంచి అందిన సూచనల్ని లెక్కలోకి తీసుకొని ప్రస్తుతం కనిపిస్తున్న లోటుపాట్లను సరిచేయడానికి, యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఓసీఐ పోర్టల్‌లో అనేక మార్పుచేర్పులను చేసి, దీనికి ఒక కొత్త రూపును ఇచ్చారు.
కొత్త ఓసీఐ పోర్టల్‌లో అనేక వినియోగదారుకు అనుకూలంగా పలు సౌకర్యాలను చేర్చారు. వాటిలో కొన్ని ఈ కింది విధంగా ఉన్నాయి:
• యూజర్ సైన్-అప్ ను రిజిస్ట్రేషన్ మెన్యూనూ వేరు చేయడం
• నమోదు ఫారాల్లో యూజర్ ప్రొఫైల్ వివరాలకు ఆటో-ఫిల్ పద్ధతి
• పూర్తి చేసిన, పాక్షికంగా వివరాలు నింపిన దరఖాస్తులను ప్రదర్శించే డ్యాష్‌బోర్డు
• ఎఫ్ఆర్ఆర్ఓలలో దరఖాస్తులు పెట్టిన వారి కోసం ఏకీకృత ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే
• దరఖాస్తు దశల్లో ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగా మార్గనిర్దేశం
• దరఖాస్తు రకాన్ని బట్టి అప్‌లోడ్ చేయాల్సిన అవసరమైన దస్తావేజుల వర్గీకరణ
• దరఖాస్తును దాఖలు చేసే కన్నా ముందు ఏ స్థాయిలో అయినా దరఖాస్తుదారుకు ఎడిటింగ్ చేసుకొనే సౌలభ్యం
• పోర్టల్‌లో ఏకీకృత ఎఫ్ఏక్యూ (తరచుగా అడిగే ప్రశ్నలు) సౌకర్యం.
• తుది దాఖలుకు ముందు సమాచారాన్ని సరిచూడడానికి దరఖాస్తుదారుకు రిమైండర్ సదుపాయం
• ఎంపిక చేసుకున్న దరఖాస్తు రకం ఆధారంగా అర్హత ప్రమాణం, అవసరపడే దస్తావేజులను చూపే ఏర్పాటు
• దరఖాస్తుదారు ఫొటోలను, సంతకాలను అప్‌లోడ్ చేయడానికి ఇన్-బిల్ట్ ఇమేజ్ క్రాపింగ్ వెసులుబాటు
సాంకేతిక విశిష్టతలు:
మౌలిక సదుపాయాల ఆధునికీకరణ
అత్యంత తాజా ఆపరేటింగ్ సిస్టమ్, అంటే రెడ్ హ్యాట్ 0 లో అనేక వెబ్ సర్వర్లతో పాటు లోడ్ బ్యాలెన్సర్ సహా పలు సేవలు లభ్యమవుతాయి
2. సాఫ్ట్‌వేర్ - ప్లాట్‌ఫారమ్ ఉన్నతీకరణలు
• ఫ్రేంవర్క్ అప్డేట్లు: అనేక ఉపకరణాలకు సరిపోలడానికి అనువుగా జేడీకే, స్ట్రట్స్ 2.5.30తోపాటు బూట్‌స్ట్రాప్ 5.3.0లతో కూడిన అత్యంత తాజా వెర్షన్‌లకు మారేందుకు వీలు
3. భద్రతకు సంబంధించిన మరిన్ని ప్రోటోకాల్స్
• ఎస్ఎస్ఎల్-టీఎల్ఎస్ ఎన్క్రిప్షన్: డేటా గోప్యతకు, సురక్షకు భరోసానిస్తుందిది.
• రెగ్యులర్ పినిట్రేషన్ టెస్టింగ్-ప్యాచ్ మేనేజ్‌మెంట్
4. ప్రక్రియకు సంబంధించి స్వయంచాలిత ఏకీకరణ
• ప్రక్రియలో ఆటోమేషన్‌కు ప్రాధాన్యం: బ్యాక్ ఎండ్ కార్యకలాపాలతోపాటు వర్క్‌ఫ్లోను సువ్యవస్థీకరించడం
5. డేటా నిర్వహణ
డేటాను భద్రపరచడంతోపాటు సుగమతను కేంద్రీకరించడం, అనుకూలంగా ఉండే విధంగా ప్రభావశీలంగా మలచడం
6. యూజర్ అనుభవాన్ని పెంపొందింపచేయడం
• ప్రతిస్పందనపూర్వక వెబ్ డిజైను: అన్ని ఉపకరణాలను దృష్టిలో పెట్టుకొని అనుకూలంగా ఉండే విధంగా మార్పుచేర్పులను జోడించడం
• వేగవంతమైన లోడ్ టైమ్స్ ను ప్రవేశపెట్టి, మొబైల్ అనుకూలతను సంతరించడం
7. సైబర్ భద్రతను పెంచే దిశగా చర్యలు
• అనేక అంశాల ప్రమాణీకరణ (మల్టి-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్..‘ఎంఎఫ్ఏ’)
• సర్వర్ హార్డెనింగ్‌తో పాటు అత్యంత నవీన ఏవీ ఏకీకరణ సదుపాయం
***
(Release ID: 2129851)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam