ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ జో బైడెన్ త్వరగా కోలుకోవాలి: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 MAY 2025 2:30PM by PIB Hyderabad

అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ ఆరోగ్యం పట్ల ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శీఘ్రంగా, సంపూర్ణంగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ‘‘డాక్టర్ జిల్ బైడెన్‌తో పాటు కుటుంబ సభ్యుల వేదనలో నేను పాలుపంచుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

ప్రధాని ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ… ‘‘జో బైడెన్ (@JoeBiden) గారి ఆరోగ్యం విషమించిందని తెలిసి, నేను చాలా బాధ పడ్డాను. ఆయన త్వరగా, పూర్తి స్థాయిలో కోలుకోవాలి. ఇదే మా ఆకాంక్ష. డాక్టర్ జిల్ బైడెన్‌‌తోపాటు కుటుంబానికి కలిగిన వేదనలో నేను సైతం పాలుపంచుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.‌

 

**‌*


(रिलीज़ आईडी: 2129622) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam