ప్రధాన మంత్రి కార్యాలయం
వ్యక్తిగత అత్యుత్తమ త్రో సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి అభినందన
प्रविष्टि तिथि:
17 MAY 2025 9:10AM by PIB Hyderabad
దోహా డైమండ్ లీగ్ 2025 లో 90 మీటర్ల మార్కును అధిగమించి, వ్యక్తిగత అత్యుత్తమ త్రో సాధించినందుకు నీరజ్ చోప్రాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. "ఇది చోప్రా అలుపెరగని అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచి ఫలితం" అని శ్రీ మోదీ అన్నారు.
‘‘అద్భుతమైన విన్యాసం! దోహా డైమండ్ లీగ్ 2025 లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత ఉత్తమ త్రో సాధించినందుకు నీరజ్ చోప్రాకు హృదయపూర్వక అభినందనలు. ఇది చోప్రా అలుపెరగని అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచి ఫలితం. ఇందుకు భారతదేశం ఎంతగానో గర్విస్తోంది’’ అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2129417)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada