ప్రధాన మంత్రి కార్యాలయం
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని
प्रविष्टि तिथि:
09 MAY 2025 2:27PM by PIB Hyderabad
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
భారత దేశ సాహిత్య, సంస్కృతీపరమైన ఆత్మను తీర్చిదిద్దిన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను సదా స్మరించుకుంటామని శ్రీ మోదీ అన్నారు. ఆయన రచనలు మానవత్వానికి ప్రాధాన్యమిచ్చాయని, అదే సమయంలో ప్రజల్లో జాతీయవాద స్ఫూర్తిని రగిలిస్తాయని శ్రీ మోదీ తెలిపారు.
ఎక్స్ లో ప్రధాని చేసిన పోస్టు:
‘‘గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. భారతీయ సాహిత్యం, సంస్కృతుల ఆత్మను తీర్చిదిద్దిన ఆయన ఎప్పటికీ గుర్తుంటారు. ఆయన రచనలు మానవత్వానికి ప్రాధాన్యమిచ్చాయి. అదే సమయంలో ప్రజల్లో జాతీయవాద స్ఫూర్తిని రగిలిస్తాయి. శాంతి నికేతన్‌ను ఆయన ఎలా తీర్చిదిద్దారో పరిశీలిస్తే.. విద్య, అభ్యాసం విషయంలో ఆయన చేసిన కృషి సైతం స్ఫూర్తిదాయకం’’.
***
(रिलीज़ आईडी: 2127904)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam