రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సిందూర్: ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితత్వంతో భారతీయ సాయుధ దళాల దాడి
Posted On:
07 MAY 2025 1:44AM by PIB Hyderabad
భారతీయ సాయుధ దళాలు కొద్దిసేపటి కిందట ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో...పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ, కాశ్మీర్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై దాడులు నిర్వహించాయి. భారత్‌పై దాడి చేయడానికి ఉగ్రవాదులు పథక రచన చేసింది ఈ ప్రాంతాల్లోనే. మొత్తం తొమ్మిది (9) ప్రాంతాలపై భారతీయ సాయుధ దళాలు దాడులు నిర్వహించాయి.
మేం తీసుకున్న ఈ చర్యలు... ఎలాంటి కవ్వింపులకూ తావులేని, ఖచ్చితత్వంతో, ఒక లక్ష్యంతో కూడిన లక్ష్యాలు.
తమ లక్ష్యాల్లో పాకిస్తానీ సైన్యానికి చెందిన ఎలాంటి ప్రాంతాలూ లేవు. లక్ష్యాలపై దాడి నిర్వహణలోనూ, లక్ష్యాలను గుర్తించడంలోనూ- భారత్ తగినంత నిగ్రహాన్ని పాటించింది. పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఘోరమైన ఉగ్ర దాడుల్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మరణించారు. ఈ మరణాలకు ప్రతి చర్యగానే ఈ దాడులు జరిగాయి. పహల్గామ్ దాడికి కారణమైన వారిని బాధ్యులు చేయాలన్న మా సంకల్పానికి కట్టుబడి ఉన్నాం. ‘ఆపరేషన్ సిందూర్’ కి సంబంధించిన వివరాలను మరికొద్ది సేపట్లో వెల్లడిస్తాం
****
(Release ID: 2127418)
Visitor Counter : 273
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Nepali
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam