సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ప్రకాశ్ మగ్దుమ్
प्रविष्टि तिथि:
05 MAY 2025 5:00PM by PIB Hyderabad
జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా శ్రీ ప్రకాశ్ మగ్దుమ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
శ్రీ మగ్దుమ్ 1999 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. ఈ పదవి చేపట్టడానికి ముందు అహ్మదాబాద్‌లోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ)కి అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.
రెండు దశాబ్దాల ఉద్యోగ జీవితంలో పుణెలోని నేషనల్ ఫిలిం ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఏఐ)కి డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సమయంలో సినిమాలను భద్రపరచడం, పునరుద్ధరణ తదితర ప్రయత్నాల ద్వారా భారతీయ చలనచిత్ర వారసత్వాన్ని పరిరక్షించడంలో కీలకంగా వ్యవహరించారు.
ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ)కు రిజిస్ట్రార్‌గా సేవలు అందించారు. అలాగే తిరువనంతపురంలో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా సైతం పనిచేశారు.
***
(रिलीज़ आईडी: 2127219)
आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam