సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్-2025లో మీడియా, వినోద రంగంపై కీలకమైన నాలెడ్జ్ రిపోర్టులను విడుదల చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్..
అంతర్జాతీయ సృజన శక్తి కేంద్రంగా భారత పురోగతిని చాటుతున్న నివేదిక
Posted On:
04 MAY 2025 1:50PM
|
Location:
PIB Hyderabad
శరవేగంగా, క్రియాశీలంగా ఎదుగుతున్న భారత మీడియా, వినోద రంగాన్ని సమగ్రంగా సమీక్షిస్తూ రూపొందించిన అయిదు ముఖ్య నివేదికలను ముంబయిలో నిర్వహిస్తున్న వేవ్ సదస్సులో కేంద్ర సమాచార - ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ నిన్న (మే 3న) విడుదల చేశారు.
ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రూపొందించిన ఈ నివేదికలు సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ, కంటెంట్ నిర్మాణం, చట్టపరమైన వ్యవస్థలు, లైవ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ, డేటా ఆధారిత విధానపరమైన చేయూతకు సంబంధించి విలువైన సూచనలను అందించేలా ఉన్నాయి.
మీడియా, వినోద రంగంపై గణాంకాలతో కూడిన కరదీపిక 2024-25:
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ గణాంక కరదీపిక.. సమాచార ఆధారిత విధానాల రూపకల్పనకూ, నిర్ణయాలు తీసుకోవడానికీ కీలకమైన వనరుగా ఉపయోగపడుతుంది. రంగాలవారీగా ధోరణులు, ప్రేక్షకుల అభిరుచులు, ఆదాయ వృద్ధి నమూనాలు, ప్రాంతీయ, జాతీయ పరిణామాలను ఇది సంగ్రహంగా పేర్కొంటుంది. అనుభవపూర్వక ఆధారాలు, ఆచరణాత్మక వాస్తవాలపై ఆధారపడి ఉండేలా చూస్తూ.. భవిష్యత్తులో విధాన రూపకల్పన, పారిశ్రామిక వ్యూహాలకు మార్గనిర్దేశం చేసేలా దీనిని రూపొందించారు. ఈ కరదీపికలోని ముఖ్యాంశాలు:
-
పీజీఆర్ఐలో నమోదైన ప్రచురణలు: 1957 లో 5,932 నుండి 2024-25 నాటికి 154,523 కు పెరిగింది. ఇందులో సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 4.99%.
-
పబ్లికేషన్స్ విభాగం వారు వెలువరించిన పుస్తకాలు: బాల సాహిత్యం, చరిత్ర, స్వాతంత్య్ర పోరాటం, సైన్స్, పర్యావరణం, జీవిత చరిత్రల వంటి అంశాలపై 2024-25లో 130 పుస్తకాలు ప్రచురితమయ్యాయి.
-
దూరదర్శన్ ఉచిత డిష్: 2004లో 33 ఛానళ్ల నుంచి 2025 నాటికి 381కి పెరిగింది.
-
డీటీహెచ్ సేవలు: 2025 మార్చి నాటికి పూర్తిగా అన్ని ప్రాంతాలకూ చేరాయి.
-
ఆలిండియా రేడియో (ఏఐఆర్):
-
ప్రైవేటు ఉపగ్రహ టీవీ చానెళ్లు: 2004–05లో 130 నుంచి 2024–25లో 908కి పెరిగాయి.
-
ప్రైవేటు ఎఫ్ఎం స్టేషన్లు 2001లో4 ఉండగా, 2024 నాటికి 388 కి చేరాయి. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రాల వారీగా వాటి సంఖ్యను నివేదిక పేర్కొన్నది.
-
సామాజిక రేడియో కేంద్రాలు (సీఆర్ఎస్): 2005లో 15 నుంచి 2025 నాటికి 531కి పెరిగాయి. రాష్ట్రం / జిల్లా / ప్రాంతాల వారీగా వివరాలు నివేదికలో ఉన్నాయి.
-
చిత్ర ధ్రువీకరణ: ధ్రువీకరణ పొందిన భారతీయ కథా చిత్రాల (ఫీచర్ ఫిల్ములు) సంఖ్య 1983లో 741 కాగా, 2024-25లో ఆ సంఖ్య 3,455కు పెరిగింది. 2024-25 నాటికి మొత్తంగా 69,113 సినిమాలు ధ్రువీకరణ పొందాయి.
-
సినీ రంగ విశేషాలు: పురస్కారాలు, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు, ఎన్ఎఫ్డీసీ నిర్మించిన డాక్యుమెంటరీలకు సంబంధించిన సమాచారం ఈ కరదీపికలో ఉంటుంది.
-
డిజిటల్ మీడియా, సృజనాధార ఆర్థిక వ్యవస్థ: వేవ్స్ ఓటీటీ విజయాలు, భారత సృజనాత్మక సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) ఏర్పాటు, క్రియేట్ ఇన్ ఇండియా పోటీ (సీఐసీ) మొదలైన విశేషాలు ఇందులో ఉన్నాయి.
-
గుర్తించ దగిన కాలక్రమణిక: కేంద్ర సమాచార ప్రసార శాఖ సాధించిన విజయాలు: పీఆర్జీఐ, ఆకాశవాణి, దూరదర్శన్, ఇన్సాట్ ఆధారిత టెలివిజన్ సేవలు, ప్రైవేటు ఎఫ్ఎం రేడియో.
-
నైపుణ్య కార్యక్రమాలు: మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం.
-
వాణిజ్య సౌలభ్యం: సరళీకృత, పారదర్శక ప్రక్రియల దిశగా మీడియా, కంటెంట్ సృజనకారులకు సదుపాయం కల్పించేలా అమలు చేసిన చర్యలను నివేదికలో పేర్కొన్నారు.
‘కంటెంట్ నుంచి వాణిజ్యం దాకా: భారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ విశేషాలు’ – బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) నివేదిక
డిజిటల్ యుగంలో భారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ అపూర్వ స్థాయిని చేరుకున్న తీరును, దాని ప్రభావాన్ని ఈ నివేదిక వెల్లడించింది. 20 నుంచి 25 లక్షల మంది క్రియాశీల డిజిటల్ సృజనకారులతో.. ప్రపంచంలో శరవేగంగా ఎదుగుతున్న సృజన వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఇప్పటికే వినియోగదారు వార్షిక వ్యయంలో 350 బిలియన్ డాలర్లకు పైగా వారు ప్రభావితం చేయగా, ఈ సంఖ్య 2030 నాటికి మూడింతలు పెరిగి 1 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా.
సంఖ్యాపరమైన కొలమానాలకు అతీతంగా ఆలోచించాలనీ.. కథకులుగా, సాంస్కృతిక రూపకర్తలుగా, ఆర్థిక చోదకులుగా క్రియేటర్ల పాత్ర విస్తరిస్తున్న తీరును గుర్తించాలని ఈ నివేదిక వారందరినీ కోరింది. కేవలం లావాదేవీలను ప్రభావితం చేసే భాగస్వామ్యాలను కాకుండా.. ప్రామాణికత, విశ్వాసం, సృజనాత్మక సామర్థ్యం ప్రాతిపదికన దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకునే దిశగా వ్యాపార సంస్థలు ఆసక్తి చూపడాన్ని ఈ మార్పు సూచిస్తుంది.
ఎర్నెస్ట్ అండ్ యంగ్ రూపొందించిన ‘భారత్ స్టూడియో’ – అంతర్జాతీయ కంటెంట్ కేంద్రంగా భారత్
ఈ నివేదిక భారత్ను కేవలం కంటెంట్ వినియోగించే దేశంగానే కాకుండా ప్రపంచానికి స్టూడియోగా పరిచయం చేస్తోంది. భాషా వైవిధ్యం, సుసంపన్నమైన సంస్కృతి, సాంకేతికతను అందిపుచ్చుకోగల ప్రతిభావంతులు భారత్‌కు బలమనీ.. సరిహద్దులకు అతీతమైన కథనాలను సృష్టించే స్థాయిలో అవి దేశాన్ని నిలుపుతాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.
యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సేవలకు సంబంధించి నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి విస్తృతంగా అందుబాటులో ఉన్న భారత్‌లో వ్యయంలో 40% నుంచి 60% వరకు ఆదా అవుతుంది. భారతీయ ఓటీటీ కంటెంట్ వీక్షణలో 25% వరకు విదేశీ ప్రేక్షకుల నుంచి వచ్చినవే అని చెప్తూ.. ఇక్కడి కథనాలకు అంతర్జాతీయంగా కూడా ఆదరణ పెరుగుతోందని నివేదిక పేర్కొన్నది. ఇది కేవలం వాణిజ్యపరమైన అంశం మాత్రమే కాదు – సాంస్కృతిక దౌత్యాన్నీ ఇది ప్రతిబింబిస్తుంది. భారతీయ కథలు ఖండాంతరాల్లో భావోద్వేగపరమైన, సాంస్కృతిక సంబంధాలను ఏర్పరుస్తున్నాయి.
ఖైతాన్ అండ్ కో వారి ‘లీగల్ కరెంట్స్: భారతీయ మీడియా, వినోద రంగంపై నియమాల కరదీపిక - 2025’
సృజనాత్మకతకు నియమ నిబంధనలపై స్పష్టత ఉండాలని గుర్తించిన ఖైతాన్ అండ్ కో.. మీడియా, వినోద రంగాలకు సంబంధించి చట్టపరమైన, నియమ నిబంధనలతో వివరణాత్మక హ్యాండ్ బుక్‌ను రూపొందించింది. నిర్మాతలు, స్టూడియోలు, ఇన్ఫ్లూయెన్సర్లు, వివిధ వేదికలకు సంబంధించి ఆచరణాత్మక నిర్దేశకంగా రూపొందించిన ఈ హాండ్‌బుక్‌లో అనేక కీలకమైన చట్టపరమైన అంశాలున్నాయి:
-
దేశీయ, విదేశీ సంస్థలకు సంబంధించి అనుమతి నిబంధనలు
-
అంతర్జాతీయ నిర్మాణాలకు ప్రోత్సాహక పథకాలు
-
ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, డిజిటల్ కంటెంట్‌కు సంబంధించి చట్టపరమైన ఏర్పాట్లు
-
గేమింగ్ రంగంలో నిర్వచనాలు, జీఎస్టీ సహా పన్ను సంక్లిష్టతలు
-
సెలెబ్రిటీ హక్కుల రక్షణ
-
ఏఐ వెలువరించిన కంటెంట్‌కు సంబంధించి నైతిక పరిశీలనలు, నియంత్రణ విధానం
తగిన విధానాలను, మార్గాలను తెలియజేస్తూ.. ఆత్మవిశ్వాసంతో, నిబంధనలకు అనుగుణంగా, బాధ్యతాయుతంగా సృజనాధారిత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యేలా ఆ రంగంలో అందరినీ సన్నద్ధులను చేయడం దీని లక్ష్యం.
భారత లైవ్ ఈవెంట్స్ పరిశ్రమపై శ్వేతపత్రం
భారత లైవ్ ఈవెంట్స్ పరిశ్రమపై శ్వేతపత్రం ఈ రంగంలో విశేషమైన వృద్ధిని, వినియోగదారు తీరుతెన్నుల్లో మార్పును స్పష్టంగా పేర్కొంటోంది. గతేడాదితో పోలిస్తే 15% వృద్ధి రేటుతో ఈ పరిశ్రమ ఒక్క 2024 లోనే 13 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందించింది.
ఈవెంట్లకు హాజరయ్యేందుకు దాదాపు అయిదు లక్షల మంది అభిమానులు దేశంలో వివిధ నగరాలకు ప్రయాణిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. దేశంలో ఈవెంట్ ఆధారిత పర్యాటకం బలోపేతమవుతుండడాన్ని ఇది సూచిస్తుంది. ప్రీమియం సర్వీసులకు కూడా ఆదరణ పెరుగుతోంది. షిల్లాంగ్, వడోదర, జంషెడ్పూర్ వంటి ద్వితీయశ్రేణి నగరాలు సాంస్కృతిక కేంద్రాలుగా ఎదుగుతున్నాయి.
ఈ పురోగతికి చేయూతనిచ్చి కొనసాగించడం కోసం కింది అంశాలు ఆవశ్యకమని ఈ శ్వేతపత్రం వెల్లడిస్తుంది:
-
ఈవెంట్ మౌలిక సదుపాయాలను ఉన్నతీకరించడం
-
లైసెన్స్ ప్రక్రియను క్రమబద్దీకరించడం, సరళీకృతం చేయడం
-
సంగీత హక్కులకు సంబంధించి దృఢమైన, మరింత పారదర్శకమైన వ్యవస్థలు
-
లైవ్ ఈవెంట్ల రంగాన్ని ఎంఎస్ఎంఈ, సృజనాత్మక ఆర్థిక విధానాల కింద అధికారికంగా గుర్తించడం
ప్రపంచ సాంస్కృతిక రంగంలో భారత్‌ను కేవలం ప్రేక్షక పాత్రలో కాకుండా, అంతర్జాతీయంగా కేంద్రంగా కీలక వేదికగా నిలిపేలా వ్యూహాత్మకంగా పునర్నిర్మించాలని ఈ నివేదిక పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమానికి సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఎంఐబీ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీ ఆర్.కె. జెనా, ఎంఐబీ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మీనూ బాత్రా, ఎంఐబీ సంయుక్త కార్యదర్శి- ఎన్ఎఫ్డీసీ ఎండీ శ్రీ పృథుల్ కుమార్ హాజరయ్యారు. నాలెడ్జ్ పార్టనర్ల ప్రతినిధులుగా- బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, పార్టనర్ శ్రీ విపిన్ గుప్త, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పార్టనర్ పాయల్ మెహతా, ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్‌నర్లు శ్రీ ఆశిష్ ఫేర్వాణీ, శ్రీ అమీయ స్వరూప్, కైతాన్ అండ్ కో టెక్నాలజీ అండ్ మీడియా పార్టనర్ తనూ బెనర్జీ, కైతాన్ అండ్ కో పార్ట్‌నర్ శ్రీ ఇషాన్ జోహారీ, ఈవెంట్స్ ఎఫ్ఏక్యూ లైవ్ డైరెక్టర్ శ్రీ వినోద్ జనార్ధన్, ఈవెంట్స్ ఎఫ్ఏక్యూ ఎండీ శ్రీ దీపక్ చౌధరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎప్పటికప్పుడు అధికారిక అప్‌డేట్ల కోసం ఫాలో అవ్వండి:
‘ఎక్స్’లో:
https://x.com/WAVESummitIndia
https://x.com/MIB_India
https://x.com/PIB_India
https://x.com/PIBmumbai
ఇన్‌స్టాగ్రామ్‌లో:
https://www.instagram.com/wavesummitindia
https://www.instagram.com/mib_india
https://www.instagram.com/pibindia
***
Release ID:
(Release ID: 2127041)
| Visitor Counter:
11
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam