WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

భారత్‌లో క్రియేటర్-ఫస్ట్ వ్యవస్థ సృష్టించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్


వేవ్స్‌ 2025లో భారత వినోద రంగ ఆర్థిక వ్యవస్థపై కీలక నివేదికను విడుదల చేసిన మోషన్ పిక్చర్ అసోసియేషన్

 प्रविष्टि तिथि: 03 MAY 2025 8:55PM |   Location: PIB Hyderabad

ముంబయిలో జరుగుతోన్న ప్రపంచ దృశ్య శ్రవణ వినోద సదస్సు(వేవ్స్) మూడో రోజున మోషన్ పిక్చర్ అసోసియేషన్(ఎంపీఏ) దేశ ఆర్థిక వ్యవస్థపై చలనచిత్ర, టెలివిజన్, స్ట్రీమింగ్ రంగాల ప్రభావాన్ని తెలియజేస్తూ ఒక సమగ్ర నివేదికను ఆవిష్కరించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్.. ఎంపీఏ చైర్మన్, సీఈఓ చార్లెస్ రివ్కిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ ఎంపీఏ అంతర్జాతీయ నాయకత్వాన్ని ప్రశంసించారు. ప్రపంచ ప్రేక్షకులపై భారతీయ సినిమా ప్రభావం పెరుగుతోందని ఈ సందర్భంగా కొనియాడారు. భారతీయ కథలు భాషలు, భౌగోళిక ప్రాంతాలకు అతీతంగా అలరించగలవని.. దీనిని ఆర్ఆర్ఆర్, బాహుబలి వంటి చిత్రాలు రుజువు చేశాయని అన్నారు.

విధానాలు, నిర్మాణ ప్రోత్సాహకాలు, మేధో సంపత్తి రక్షణ విషయంలో సహకారంతో క్రియేటర్ ఫస్ట్ వ్యవస్థను సృష్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రధానంగా చెప్పారు. పైరసీ నిరోధించేందుకు ఇటీవల చేపట్టిన సంస్కరణలను ఉటంకిస్తూ డిజిటల్ యుగంలో క్రియేటర్ల హక్కులను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ప్రస్తావించారు.

''సినిమా అనేది కేవలం ఆర్థిక ఇంజిన్ మాత్రమే కాదు. ఇది ఒక ముఖ్యమైన దౌత్య, సాంస్కృతిక వారధి. ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందే, సురక్షితమైన సృజనాత్మక పరిశ్రమను సృష్టించడానికి మోషన్ పిక్చర్ అసోసియేషన్‌తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ ఎదురుచూస్తోంది" అని ఆయన అన్నారు.

ఇప్పటికే భారత్‌తో కొనసాగుతోన్న ఎంపీఏ భాగస్వామ్యం విషయంలో చార్లెస్ రివ్కిన్ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. దేశ వినోద పరిశ్రమకు ఇది చాలా కీలకమని అన్నారు. "భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అసాధారణ వృద్ధికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో సహాయం అందించటం ఎంపీఏకు గర్వకారణం” అని వ్యాఖ్యానించారు.

నివేదికను ఆవిష్కరించిన ఆనంతరం రివ్కిన్ మాట్లాడుతూ.. భారతీయ చలనచిత్ర, టీవీ, స్ట్రీమింగ్ పరిశ్రమలు 2.6 మిలియన్ల ఉద్యోగాలు కల్పించాయని, వార్షిక ఆర్థిక ఉత్పత్తి ప్రకారం 60 బిలియన్ డాలర్లకు పైగా సంపదను సృష్టించాయని తెలిపారు.  పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ముందుచూపుతో కూడిన విధానాల కోసం కృషి చేయటం ద్వారా భారత వినోద రంగ వృద్ధిని పెంపొందించడానికి ఎంపీఎకు చెందిన స్టూడియోలు కట్టుబడి ఉన్నాయని అన్నారు.

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ విషయంలో ఎంపీఏ లక్ష్యాలు, గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత మధ్య సమన్వయాన్ని రివ్కిన్ ప్రధానంగా పేర్కొన్నారు. కథ, విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచ స్థాయి కంటెంట్ ఎగుమతిలో భారత్‌కు ఉన్న బలాలను తెలిపారు.

ఎంపీఏ నివేదికలోని ముఖ్యాంశాల ప్రజంటేషన్ వీడియోతో ఈ సెషన్ ముగిసింది. సహకారం, సృజనాత్మకత, సమ్మిళిత వృద్ధితో ముందుకు సాగే భవిష్యత్తుకు సంబంధించి విధాన రూపకర్తలు, ప్రపంచ మీడియా నాయకుల మధ్య భాగస్వామ్య దార్శనికతను ఇది సూచించింది.

 

తాజా సమాచారం కోసం మమ్మల్ని అనుసరించండి- 

 

ఎక్స్ :

 

https://x.com/WAVESummitIndia

https://x.com/MIB_India

https://x.com/PIB_India

https://x.com/PIBmumbai

 

ఇన్‌స్టాగ్రామ్:

https://www.instagram.com/wavesummitindia

https://www.instagram.com/mib_india

https://www.instagram.com/pibindia

 

***


रिलीज़ आईडी: 2126874   |   Visitor Counter: 42

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam