సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
10వ జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డుల ప్రదానం
* అత్యుత్తమ సేవలకు గాను 12 కమ్యూనిటీ రేడియో స్టేషన్లను
సత్కరించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్
* దేశంలోని నలుమూలలకు చేరుకోవడానికి
కమ్యూనిటీ రేడియో ఒక సాధనం; అవి అందరికీ ముఖ్యమైన
అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తాయి: డాక్టర్ ఎల్. మురుగన్
* ముంబయిలోని వేవ్స్ 2025లో 8వ జాతీయ కమ్యూనిటీ రేడియో సమావేశం
Posted On:
03 MAY 2025 4:26PM
|
Location:
PIB Hyderabad
ముంబయి లో వరల్డ్ ఆడియో-విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికషన్స్ లు 8 వ జాతీయ కమ్యూనిటీ రేడియో సదస్సును ఈరోజు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో 12 అత్యుత్తమ కమ్యూనిటీ రేడియో స్టేషన్లను 10వ జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డులతో కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎల్. మురుగన్ విజేతలను అభినందిస్తూ... ఆవిష్కరణలు, సమగ్రత, ప్రభావాల ద్వారా దేశంలో కమ్యూనిటీ మీడియా స్థాయిని బలోపేతం చేయడమే ఈ జాతీయ సదస్సు లక్ష్యమని అన్నారు. దేశంలోని నలుమూలల పౌరులను చేరుకోవడానికి కమ్యూనిటీ రేడియో ఒక సాధనం అని కేంద్ర సహాయ మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ రేడియోలు ఏదో ఒక సంక్షేమ ప్రయోజనాన్ని అందిస్తూ భారతీయ సంప్రదాయం, సంస్కృతిని ప్రోత్సహించడంతో సహా పలు ప్రోత్సాహక పనులకు సహకరిస్తున్నాయని ఆయన అన్నారు. కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు దర్పణంగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను దేశంలోని అన్ని ప్రాంతాలకు తీసుకువెళుతున్నాయి. ఈ స్టేషన్లు మహిళలు, గిరిజన వర్గాలు వంటి వివిధ సంఘాలు, సమూహాల కోసం చేపట్టే సంక్షేమ కార్యకలాపాలకు కొత్త కోణాన్ని జోడిస్తున్నాయి.
వేవ్స్ 2025 మొదటి ఎడిషన్ గురించి డాక్టర్ ఎల్. మురుగన్ మాట్లాడుతూ, ఈ వేదికపై కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయని, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న రంగమని, ఇది రాబోయే రోజుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.


ఫోటో రైట్ అప్: నాలుగు విభిన్న ఇతివృత్తాల కింద ప్రదానం చేసిన కమ్యూనిటీ రేడియో స్టేషన్ల జాబితా
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, జాయింట్ సెక్రటరీ (బ్రాడ్కాస్టింగ్); ఎన్ఎఫ్డీసీ ఎండీ శ్రీ పృథ్వీ కుమార్, ఐఐఎంసీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అనుపమ భట్నాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సమావేశం దేశవ్యాప్తంగా 400 కి పైగా కమ్యూనిటీ రేడియో (సీఆర్) స్టేషన్ల ప్రతినిధులను ఒక వేదికపైకి తీసుకువచ్చి సంభాషణలు, ఒప్పందాలకు అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 531 సీఆర్ స్టేషన్లు ఉన్నాయి. పబ్లిక్ కమ్యూనికేషన్, అవగాహన కల్పనలో కమ్యూనిటీ రేడియో ప్రాథమిక పాత్రను, సామాజిక అభివృద్ధిలో వాటి సామర్థ్యాన్ని కూడా ఈ సమావేశం తెలియజెప్పింది.
***
Release ID:
(Release ID: 2126727)
| Visitor Counter:
6
Read this release in:
Marathi
,
English
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Urdu
,
Assamese
,
Odia
,
Malayalam