సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2025 లో 'ది ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్' పై అభిప్రాయాలను పంచుకున్న దిగ్గజ నటుడు-సృష్టికర్త అమీర్ ఖాన్
* 3 నుంచి 4 నెలల పాటు నేను స్క్రిప్ట్ తోనే ఉంటాను ": అమీర్ ఖాన్
* మీరు ఎంత నిజాయితీగా ఉంటారో, అంత బాగా నటిస్తారు ": అమీర్ ఖాన్
Posted On:
03 MAY 2025 6:08PM
|
Location:
PIB Hyderabad
దిగ్గజ నటుడు-సృష్టికర్త అమీర్ ఖాన్ వేవ్స్ 2025 లో భాగంగా ఈ రోజు క్రియేటోస్పియర్ వేదిక నుంచి 'ది ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్' పై తన సహేతుక చిట్కాలతో పలువురి హృదయాలను గెలుచుకున్నారు. ఒక అనుభవజ్ఞుడైన నటునిగా ఏళ్ల తరబడి సినీ నిర్మాణంలో తన అనుభవాలను క్రోడీకరించి ఆయన ఈ ఆచరణాత్మక సలహాలు ఇచ్చారు. "నేనేమీ శిక్షణ పొందిన నటుణ్ని కాదు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు వెళ్లాలనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయా. నా సినీ ప్రయాణంలో నేను పాటించిన చిట్కాలు నాకెంతో ఉపయోగపడుతున్నాయి" అని అమీర్ చెప్పారు.
చలనచిత్ర నిర్మాణ భవిష్యత్తు గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ... సన్నివేశంలో నటుడు లేకుండా చిత్రాలను చిత్రీకరించడానికి ఏఐ సాంకేతికత వీలు కల్పించిందని అన్నారు. AI మరియు సాంకేతికత తరువాత నటులు లేకపోయినా ఒక సన్నివేశం తీసి ఆ తర్వాతి దశలో వారిని జోడించగల సామర్ధ్యం ఏఐ, టెక్నాలజీ లకు ఉన్నాయి.
ఒక నటుడికి మొదటి, అత్యంత ప్రాధాన్యమైన పని తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడమని భారతీయ చలన చిత్ర రంగానికి ఏళ్ల తరబడి అనేక చిరస్మరణీయ చిత్రాలను అందించిన అమీర్ పేర్కొన్నారు. ఆ పాత్రలోకి ఎలా ప్రవేశించాలి? అన్నదానికి ఆయన ఇలా వివరించారు.. "నేను స్క్రిప్ట్ లతో చాలా సమయం గడుపుతాను. స్క్రిప్ట్ ను పదే పదే చదువుతా. స్క్రిప్ట్ బాగుంటే పాత్రను సులువుగా అర్థం చేసుకుంటారు, దాని ఆహార్యం అన్నీ దాని నుంచే వస్తాయి". ఇక దర్శకుడితో పాత్ర, కథపై చర్చించడం కూడా మరింత ఉపయోగపడతాయి.
తన కష్టపడి పనిచేసే స్వభావం గురించి ఖాన్ ఇలా వెల్లడించారు. "నాకు జ్ఞాపకశక్తి తక్కువ. కాబట్టి, నేను సంభాషణలు చేతితో రాస్తా. కష్టమైన సన్నివేశాలను మొదట తీసుకుంటా. సంభాషణలు గుండెల్లోంచి రావాలి. మొదటి రోజు నేను ఇదే పాటిస్తా. 3-4 నెలల పాటు ప్రతిరోజూ ఇలాగే చేస్తా. అవి నాకు కరతలామలకం అయిపోతాయి. సంభాషణలు మీవి కావాలి. మీరు దానిని సొంతం చేసుకోవాలి. అవి రాసినప్పుడు స్క్రిప్ట్-రైటర్ వే కావచ్చు. కానీ మీ చేతికొచ్చాక అవి మీవే. మీరు ఒక పంక్తిని అదేపనిగా పునరావృతం చేస్తుంటే దాన్ని ఇంకా ఎంత బాగా చేయొచ్చో మీరు అర్ధం చేసుకోగలుగుతారు.
నటులకు కష్టమైన పని ఏమిటి? ఒక నటుడు ప్రతిరోజూ అదే భావోద్వేగ తీవ్రతతో సన్నివేశాలను పునరావృతం చేసి తిరిగి తీయాల్సి ఉండటమే అని అమీర్ ఖాన్ వివరించారు.
"మీరు ఎంత నిజాయితీగా ఉంటారో, అంత బాగా నటించగలుగుతారు "అని వర్ధమాన నటులకు అమీర్ ఖాన్ మరో ముఖ్యమైన చిట్కా చెప్పారు.
మిస్టర్ అమీర్ ఖాన్ తన సన్నివేశాలను ఎలా ప్రాక్టీస్ చేస్తారు?
సమాధానం ఏమిటంటే "నేను షాట్ కి ముందే సన్నివేశాలను ఊహించుకుంటాను. వాటిని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడుఎప్పుడూ అద్దంలోకి చూడను" అని చెప్పారు.
తన అన్ని ఫిలిం ప్రాజెక్టులలో వ్యక్తిగతంగా నచ్చినది ఏమిటి? 'తారే జమీన్ పర్' అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎంత సహనంగా వ్యవహరించాలి, ఎంత సహకారం అందించాలి, చిన్నపిల్లలతో ఎలా మెలగాలి! వంటి విషయాలను ఈ సినిమా చర్చిస్తుంది.
ఇప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్న వారికి ఈ అనుభవజ్ఞుడైన నటుడు ఇంకా ఏమేమి చిట్కాలు ఇస్తారు ?
"నేను పలికించే భావోద్వేగాలు స్క్రిప్ట్ నుంచి రావాలి. మీరు స్క్రిప్ట్ ను నమ్మాలి. కొన్నిసార్లు సినిమాల్లో నమ్మదగని సన్నివేశాలు ఉంటాయి. కానీ నటుడు మిమ్మల్ని నమ్మేలా చేయవచ్చు. నటుడు తన నటనతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలి" అని చెప్పారు.
మంచి స్క్రిప్ట్ అంటే ఏమిటో అమీర్ ఖాన్ వివరిస్తూ.. "మంచి స్క్రిప్ట్ కి స్పష్టమైన ఆధారం ఉంటుంది. మనం ఏమి చెప్పదలచుకున్నామో అదిమొదటి పది శాతంలో ఉండాలి. లేకపోతే ప్రేక్షకులకు ఆసక్తి పోతుంది" అని అన్నారు.
"సన్నివేశం ఏమి కోరుతుందో అదే చేయండి, అందులో మీ సొంత పని గురించి మాత్రమే ఆలోచించవద్దు" అని చిత్ర నిర్మాణంలో పాలుపంచుకునే వారికి అమీర్ అత్యంత ముఖ్యమైన సలహా చెప్పారు.
ఫోటో రైట్ అప్: అమీర్ ఖాన్ ను సత్కరిస్తున్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు
మరిన్ని అధికారిక వివరాల కోసం:
X లో:
https://x.com/WAVESummitIndia
https://x.com/MIB_India
https://x.com/PIB_India
https://x.com/PIBmumbai
ఇన్స్టాగ్రామ్ లో:
https://www.instagram.com/wavesummitindia
https://www.instagram.com/mib_india
https://www.instagram.com/pibindia
***
Release ID:
(Release ID: 2126725)
| Visitor Counter:
5