సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్-2025 లో భారత్ ప్రత్యక్ష కార్యక్రమాల విభాగంపై శ్వేత పత్రాన్ని విడుదల చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్
Posted On:
03 MAY 2025 5:46PM
|
Location:
PIB Hyderabad
వేవ్స్ 2025 విజ్ఞాన భాగస్వాములలో ఒకటైన ఈవెంట్ఎఫ్ఏక్యూస్ మీడియా తయారు చేసిన "ఇండియాస్ లైవ్ ఈవెంట్స్ ఎకానమీ: ఎ స్ట్రాటజిక్ గ్రోత్ ఇంపెరేటివ్" శ్వేత పత్రాన్ని కేంద్ర సమాచార, ప్రసార - పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఆవిష్కరించారు. ఈ తరహా మొట్టమొదటి శ్వేత పత్రం తయారీకి ఈవెంట్ఎఫ్ఏక్యూస్ మీడియాను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియమించింది.
ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీ ఆర్. కె. జెనా, సంయుక్త కార్యదర్శి శ్రీమతి మీను బాత్రా, సంయుక్త కార్యదర్శి (ప్రసార విభాగం) శ్రీ పృథుల్ కుమార్, ఈవీఏ లైవ్, ఈవెంట్ఫాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దీపక్ చౌదరి పాల్గొన్నారు.
భారత్ లో వేగంగా విస్తరిస్తున్న వినోద పరిశ్రమ నిరంతర పురోగతికి ఉన్న వృద్ధి అవకాశాలు, కొత్త పోకడలు, వ్యూహాత్మక సిఫార్సులతో కూడిన సమగ్ర విశ్లేషణను ఈ శ్వేతపత్రం అందిస్తుంది.
భారత ప్రత్యక్ష కార్యక్రమాల ముఖచిత్రం ఒక చిన్న స్థాయి నుంచి దేశ సాంస్కృతిక, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలకు నిర్మాణాత్మక, ప్రభావవంతమైన దివ్వెలా మార్పు చెందుతోంది. 2024 నుంచి 2025 వరకు అహ్మదాబాద్, ముంబయిలలో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కోల్డ్ ప్లే ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని భారత్ చాటిచెప్పింది.
ఈవెంట్ టూరిజం పెరగడం ఈ రంగంలోని ప్రధాన పోకడల్లో ఒకటి. ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలకు హాజరయ్యేందుకు దాదాపు 5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. బలమైన సంగీత-పర్యాటక ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావానికి ఇదొక సంకేతంగా భావించవచ్చు. విఐపీ, క్యూరేటెడ్, లగ్జరీ హాస్పిటాలిటీ వంటి ప్రీమియం టికెటింగ్ విభాగాలు ఏడాదికి 100% నమోదు చేశాయి. అనుభవ-ఆధారిత ప్రేక్షకుల పెరుగుదలకు ఇది నిదర్శనం. రకరకాల నగరాలు పర్యటించడం, స్థానిక పండగలకు విస్తృతమవుతున్న ప్రజాదరణ వంటి కారణాలతో టైర్-2 నగరాల నుంచి పాల్గొనే వారి సంఖ్య పెరిగింది.
ఈ పురోగతి వినోద రంగంలో ఉద్యోగాలు, ప్రతిభలను ప్రతిబింబిస్తుంది. ఇకపై భారతదేశపు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ప్రత్యక్ష వినోదాన్ని పక్కన పెట్టేయలేం. ఇది ఒక వ్యూహాత్మక విభాగం. ఇది ఉపాధిని, నైపుణ్య అభివృద్ధిని పెంచుతుంది. ఇలా భారీ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలు సాధారణంగా సుమారు 2,000 నుంచి 5,000 వరకు తాత్కాలిక ఉద్యోగాలను సృష్టిస్తాయి. జీవనోపాధి, విస్తృత శ్రామిక శక్తిని పెంపొందించడంలో ఈ రంగం పాత్రను ఈ అంశాలు స్పష్టం చేస్తాయి.
మీడియా-వినోద రంగం 2024-25 పై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రూపొందించిన గణాంకాల పుస్తకంతో సహా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తయారుచేసిన 'ఫ్రమ్ కంటెంట్ టు కామర్స్: మ్యాపింగ్ ఇండియాస్ క్రియేటర్ ఎకానమీ', ఎర్నెస్ట్ & యంగ్ రూపొందించిన 'ఎ స్టూడియో కాల్డ్ ఇండియా', ఖైతాన్ & కో సిద్ధం చేసిన 'లీగల్ కరెంట్స్: ఎ రెగ్యులేటరీ హ్యాండ్బుక్ ఆన్ ఇండియాస్ మీడియా & ఎంటర్టైన్మెంట్ సెక్టార్ 2025' వంటి కీలక నివేదికలను కూడా ఈ కార్యక్రమంలో విడుదల చేశారు.
పెట్టుబడులు, విధాన మద్దతు, మౌలిక సదుపాయాల మెరుగుదలతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొదటి ఐదు ప్రత్యక్ష వినోద గమ్యస్థానాలలో ఒకటిగా నిలబడే దిశగా భారత్ సాగుతోంది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, పర్యాటకం, ప్రపంచ సాంస్కృతిక ఉనికికి కొత్త మార్గాలను తెరవడం ఇందుకు అవకాశం కల్పిస్తాయి.
అధికారిక తాజా సమాచారం కోసం "X " లో ఈ లింకులను చూడండి.
https://x.com/WAVESummitIndia
https://x.com/MIB_India
https://x.com/PIB_India
https://x.com/PIBmumbai
ఇన్స్టాగ్రామ్ లో:
https://www.instagram.com/wavesummitindia
https://www.instagram.com/mib_india
https://www.instagram.com/pibindia
***
Release ID:
(Release ID: 2126649)
| Visitor Counter:
7