WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్ బజార్ 2025లో రూ.250 కోట్లకు పైగా ఒప్పందాలు, అంతర్జాతీయంగా ముఖ్యమైన భాగస్వామ్యాల ఖరారు: సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు

 Posted On: 02 MAY 2025 9:33PM |   Location: PIB Hyderabad

 వేవ్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ మార్కెట్ విభాగమైన వేవ్స్ బజార్మీడియావినోద రంగంలో అంతర్జాతీయ సహకారానికి శక్తిమంతమైన ప్రేరకశక్తిగా నిలిచిందిపెట్టుబడిదారులుకొనుగోలుదారులుభాగస్వాములతో సృష్టికర్తలను అనుసంధానించేందుకు ఏర్పాటు చేసిన ఈ వేవ్స్ బజార్కంటెంట్ పరమైన వాణిజ్యానికి భారత్‌ను వ్యూహాత్మక కేంద్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందివేవ్స్ బజార్ 2025లో రూ.250 కోట్లకు పైగా ఒప్పందాలు కుదిరాయనిముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రకటించామని ముంబయిలో జరిగిన వేవ్స్ కార్యక్రమంలో సమాచారప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.

ప్రారంభం రోజునే వేవ్స్ బజార్ దక్షిణ కొరియాజపాన్అమెరికాజర్మనీరష్యానెదర్లాండ్స్న్యూజిలాండ్ వంటి 22కి పైగా దేశాల నుంచి ప్రముఖ భాగస్వాములను ఒకచోట చేర్చిందిఅలాగే, 95 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు, 224 మంది అమ్మకందారులు కూడా పాల్గొన్నారుప్రధాన కొనుగోలుదారులలో నెట్ ఫ్లిక్స్అమెజాన్ ప్రైమ్ వీడియోమెటాడిస్నీ స్టార్జీ ఎంటర్టైన్మెంట్బనిజే ఆసియావార్నర్ బ్రదర్స్ డిస్కవరీసోనీ లివ్వైఆర్ఎఫ్ధర్మాజియో స్టూడియోస్రోటర్డామ్ ఫిల్మ్ ఫెస్టివల్రష్లేక్ మీడియా ఉన్నాయి.

వ్యూయింగ్ రూమ్ మార్కెట్ స్క్రీనింగ్ లు

115 మంది ఫిల్మ్ మేకర్స్ పూర్తి చేసిన రచనలను అంతర్జాతీయ కొనుగోలుదారులకు సమర్పించారు.15 అద్భుతమైన ప్రాజెక్టులను వ్యూయింగ్ రూమ్ నుంచి అత్యుత్తమమైనవిగా ఎంపిక చేసి లైవ్ లో ప్రదర్శించారుఈ చిత్రనిర్మాతలను ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా సత్కరించారుఎంపికైన ప్రాజెక్టులలో ఒకదానికి నటుడు టైగర్ ష్రాఫ్ మద్దతు పలికారుమార్కెట్ స్క్రీనింగ్స్‌లో ప్రతిభావంతులైన చిత్రనిర్మాతల 15 ప్రశంసనీయ,  ప్రముఖమైన ప్రాజెక్టులను ప్రదర్శించారు

పిచ్ రూమ్‌ -  మొత్తం 104 ప్రాజెక్టుల నుంచి జాగ్రత్తగా ఎంపిక చేసిన 16 ప్రాజెక్టులను ప్రత్యక్షంగా ప్రదర్శించేందుకు ఎంపిక చేశారువేవ్స్ బజార్‌ సదస్సు తొలి రెండు రోజులలో సృష్టికర్తలకు పరిశ్రమలోని ముఖ్యమైన భాగస్వాములతో నేరుగా సంభాషించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించింది.

బి2బి బయర్-సెల్లర్ మార్కెట్వేవ్స్ బజార్ భారత్‌లో తొలిసారిగా ప్రత్యేక బి2బి కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలను ప్రారంభించిందిఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీసహకారంతో మే 1-3 వరకు ఈ సమావేశాలను నిర్వహించి నిర్దేశించిన ఒప్పందాల ఖరారుకుసృజనాత్మక వ్యాపార అభివృద్ధికి అనుకూల వేదికగా నిలిచింది.

ప్రారంభ వ్యాపార ఫలితాలు

సినిమాసంగీతంయానిమేషన్రేడియోవీఎఫ్ఎక్స్ విభాగాల్లో తొలి రోజు రూ.250 కోట్ల లావాదేవీలు జరిగాయివచ్చే రెండు రోజుల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగి 400 కోట్లకు పైగా దాటే అవకాశం ఉంది.

2025 మే 2న కీలక ఒప్పందాలుముఖ్యమైన ప్రకటనలు

*అత్యుత్తమ చిత్రంగా ఎంపిక యిన ఖిడ్కీ గావ్” ఆసియన్ సినిమా ఫండ్‌తో పోస్ట్ ప్రొడక్షన్విఎఫ్ఎక్స్ ఒప్పందాన్ని సాధించిందిబుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నిర్వహించే ఆసియన్ సినిమా ఫండ్ (ఏసిఎఫ్ఆసియా దేశాల ఫిక్షన్డాక్యుమెంటరీ చిత్రాలకు ఆర్థిక సహాయం అందించే ఒక మద్దతు కార్యక్రమం.

*ఇండో-యూరోపియన్ యానిమేషన్ అలయన్స్ (€30 మిలియన్లు)

బ్రాడ్ విజన్ పర్స్పెక్టివ్స్ (ఇండియా), ఫాబ్రిక్ డి ఇమేజెస్ గ్రూప్ (యూరప్నాలుగు యానిమేటెడ్ ఫీచర్ల కోసం 30 మిలియన్ యూరోల సహ-నిర్మాణ ఒప్పందాన్ని ప్రకటించాయి. 7-8 మిలియన్ యూరోల బడ్జెట్ తో ఇండో-ఫ్రెంచ్ఇండో-బెల్జియన్ ట్రీటీ ఫ్రేమ్ వర్క్స్ కింద ఒక్కో టైటిల్ ను అభివృద్ధి చేయనున్నారుఈ భాగస్వామ్యాన్ని ఎఫ్ డీఐ  గ్రూప్ సీఓఓ మార్క్ మెర్టెన్స్,  బ్రాడ్‌విజన్ వ్యవస్థాపకుడుసీఈఓ శ్రీరామ్ చంద్రశేఖరన్ ప్రారంభించారు. యానిమేషన్ రంగంలోభారతదేశం- అంతర్జాతీయ భాగస్వామ్యానికి కొత్త ప్రమాణంగా నిలుస్తుంది

*భారత్-యూకే కో-ప్రొడక్షన్ ఎంవోయూపై సంతకాలు

అమండా గ్రూమ్ (ఫౌండర్ అండ్ సీఈఓది బ్రిడ్జ్యూకే), ముంజాల్ ష్రాఫ్ (సహ వ్యవస్థాపకుడుగ్రాఫిటీ స్టూడియోస్ఇండియాకలసి భారతదేశ వలసవాద చరిత్రను అన్వేషించే వాస్తవిక సిరీస్ లను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఫిల్మ్ బజార్ నుంచి ప్రారంభమైన అనేక సంవత్సరాల సహకార ఫలితంగా అభివృద్ధి చెందిన ఈ భాగస్వామ్యంకంటెంట్ ఇండియా వద్ద తుది రూపం దాల్చిందిఇది కథ చెప్పే కళకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఒక కీలక దశను సూచిస్తుంది

"షిన్ చాన్ ఇండియా ఇయర్కార్యక్రమాన్ని ప్రారంభించిన టివి అసాహి 

టీవీ అసాహి భారతదేశంలో “షిన్ చాన్ ఇండియా ఇయర్”ను ప్రకటించిందిఈ ఫ్రాంచైజీకి ఇక్కడ ఉన్న విస్తృత ప్రజాదరణను చాటేందుకు ముఖ్యాంశాలు ఈవిధంగా ఉన్నాయి:

షిన్ చాన్మే 9న  అవర్ డైనోసార్ డైరీ థియేట్రికల్ రిలీజ్

* 2025 దీపావళికి రెండో చిత్రం “ది స్పైసీ కసుకాబే డ్యాన్సర్స్ ఇన్ ఇండియా” విడుదల

అభిమానుల కోసం ఆగస్టులో యానిమే ఇండియాసెప్టెంబర్ లో మేలా జపాన్ కార్యక్రమాలు

ఈ చొరవ గ్లోబల్ యానిమే వ్యవస్థలో పెరుగుతున్న భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడమే కాకుండాభారత్-జపాన్ సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుంది.

 

 * * *


Release ID: (Release ID: 2126532)   |   Visitor Counter: 12