WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

బాలీవుడ్ సినీ దిగ్గజం మనోజ్ కుమార్ కు నివాళులర్పించిన వేవ్స్ 2025


‘‘మనోజ్ కుమార్‌ జ్ఞాపకాలు: ప్రముఖ దర్శకుడు, నిజమైన జాతీయవాది’’ వేవ్స్ బ్రేక్ అవుట్ సెషన్ భావోద్వేగం

 Posted On: 01 MAY 2025 5:47PM |   Location: PIB Hyderabad

వేవ్స్ 2025లో “మనోజ్ కుమార్‌ జ్ఞాపకాలుప్రముఖ దర్శకుడునిజమైన దేశభక్తుడు” అనే సెషన్‌తో సినీ ఉత్సాహం హృదయానికి హత్తుకునే స్థాయికి చేరుకుందిభారతీయ చలనచిత్ర రంగంలో దేశభక్తికి మారుపేరు అయిన మనోజ్ కుమార్‌కు ఇది ఒక భావోద్వేగపూరిత నివాళిఈ సెషన్‌ను ప్రముఖ సినీ విమర్శకుడుపోడ్కాస్టర్ మయాంక్ శేఖర్ నడిపించారుఇందులో సినీ సాహిత్య ప్రపంచంలోని ప్రముఖులు పాల్గొనిగొప్ప నటుడురచయితదర్శకుడిగా మనోజ్ కుమార్ అందించిన విశిష్ట సినిమా వారసత్వాన్ని స్మరించుకున్నారు.

1937లో హరికిషన్ గిరి గోస్వామిగా జన్మించిన మనోజ్ కుమార్ జీవితం కూడా ఆయన సినిమాలలాగే ప్రేరణాత్మకంగాఎంతో భావోద్వేగంతో నిండి ఉందిదేశ విభజన సమయంలో ఆయన బొంబాయికి వచ్చారుఆయనకు అప్పుడు సినిమా సంబంధాలు లేవుగానీ కలలు మాత్రమే ఉన్నాయిఉర్దూలో కథలు రాస్తూ కథా రచయితగా ఎదిగిన మనోజ్ కుమార్దేశభక్తిసామాజిక బాధ్యతతో మిళితమైన ఒక ప్రత్యేకమైన తనదైన సినిమా శైలిని ఏర్పరచుకున్నారు 

నటుడుమనోజ్ కుమార్ కుమారుడు కునాల్ గోస్వామి తండ్రి జ్ఞాపకాలతో సెషన్ ను ప్రారంభించారు: "విభజన సమయంలో నా తండ్రి సర్వం కోల్పోయారు. కానీ తన సంకల్పాన్ని ఎప్పుడూ కోల్పోలేదుశరణార్థి శిబిరాల్లో నివసించడం నుంచి చరిత్రలో నిలిచిపోయే కథలు ఉర్దూలో రాయడం వరకు ఆయన ప్రయాణం మొక్కవోని ధైర్యానికి నిదర్శనంభగత్ సింగ్ తల్లిని 'షహీద్ప్రీమియర్ షోకు తీసుకొచ్చారుఅది ఆయన దేశభక్తిఆయన జాతీయవాదంతో కూడిన అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను సృష్టించారుఇది అరుదైన ఘనతఅని ఆయన అన్నారు

చాంద్నీ బార్ఫ్యాషన్ వంటి ప్రశంసలందుకున్న సినిమాలకు దర్శకత్వం వహించిన జాతీయ అవార్డు గ్రహీత మాధుర్ భండార్కర్.... మనోజ్ కుమార్ సినిమా శైలిని గుర్తుచేసుకున్నారు.“ఆయన పాటలను చిత్రీకరించిన విధానం అద్భుతంప్రతి ఫ్రేమ్ వెనుక ఒక భావంఒక ప్రయోజనం ఉండేది” అంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారుమనోజ్ కుమార్ సినిమాలు జాతీయవాదంసామాజిక వాస్తవికతతో కూడుకొని ఉండేవనివాటిని తన సినిమాల్లో ప్రతిబింబించే ప్రయత్నం చేశారని భండార్కర్ అన్నారు. "చాందినీ బార్” అనేక విధాలుగా మనోజ్ కుమార్ భావాలకు సరైన నివాళిఅని భండార్కర్ అన్నారు.

ప్రముఖ రచయిత,  గీత రచయిత డాక్టర్ రాజీవ్ శ్రీవాస్తవ్ ఒక స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు:

ఢిల్లీ‌లో ‘షహీద్’ ప్రదర్శనకు అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హాజరయ్యారుఆ స్క్రీనింగ్ అనంతరం, ‘జై జవాన్ జై కిసాన్’ అనే తన నినాదాన్ని ఆధారంగా చేసుకుని ఒక సినిమా తీయమని మనోజ్ కుమార్‌ను లాల్ బహదూర్ శాస్త్రి కోరారుఆ మాటలు ఆయన మనసును తాకాయిముంబయికి తిరిగి వెళ్తున్న రాత్రి రైలు ప్రయాణంలోనే మనోజ్ కుమార్ ‘ఉప్కార్‌’ కథను రాశారు” అని తెలిపారుమనోజ్ కుమార్ జీవితం సాధారణ మనిషితో మాట్లాడే సినీ మిషన్ఈ విధంగాఆయన ఆత్మ... వేవ్స్ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుంది

ప్రముఖ కాలమిస్టు,  బయోగ్రాఫర్ భారతి ఎస్ప్రధాన్ ఒక భావోద్వేగపూరితమైన ఆలోచనను పంచుకున్నారు:

'భారీ విజయం సాధించినప్పటికీఆయన నమ్మశక్యం కాని రీతిలో అందరికీ చేరువయ్యాడుఅనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా తన తదుపరి చిత్రం గురించి కలలు కన్నారుఅది ఆయన ఆత్మవిశ్వాసంఎప్పుడూ ముందు చూపే” అని పేర్కొన్నారు

సజీవ వారసత్వం

భరత్ కుమార్ గా ఆప్యాయంగా పిలుచుకునే మనోజ్ కుమార్ పద్మశ్రీదాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారుషహీద్పూరబ్  ఔర్ పశ్చిమ్రోటీ కప్డా ఔర్ మకాన్ఉప్కార్క్రాంతి వంటి ఆయన సినిమాలు కేవలం గొప్ప సినిమాలే కాదుసాంస్కృతిక విజయాలు కూడా. దేశభక్తిని కవితాత్మకంగాకథ చెప్పడాన్ని ఉత్కృష్టంగా మార్చిన వ్యక్తి పట్ల ప్రేక్షకుల చప్పట్లుసమష్టి కృతజ్ఞతా భావంతో సెషన్ ముగిసింది.

 

 * * *


Release ID: 2126014   |   Visitor Counter: 24