WAVES BANNER 2025
ప్రధాన మంత్రి కార్యాలయం

వేవ్స్ 2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ


* ప్రపంచ వేదికపై దేశ సృజనాత్మక సామర్థ్యాన్ని చాటి చెబుతున్న వేవ్స్: పీఎం

* వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌కు సంక్షిప్త రూపంయ మాత్రమే కాదు.. సంస్కృతి, స‌ృజనాత్మకత, అంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం: పీఎం


* బిలియన్‌కి పైగా జనాభా ఉన్న భారత్‌లో బిలియన్‌కి పైగా కథలున్నాయి: పీఎం

* క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్‌కు ఇదే సరైన సమయం: పీఎం

* ప్రస్తుత ప్రపంచం కొత్త కథల కోసం అన్వేషిస్తుంటే.. భారత్‌లో వేల ఏళ్ల నాటి కథల నిధి ఉంది, ఈ నిధి కాలాతీతమైనది, ఆలోచనలు రేకెత్తించేది, విశ్వవ్యాప్తమైనది: పీఎం

నూతన ఆర్థిక వ్యవస్థ ఆరెంజ్ ఎకానమీకి కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి మూలాధారాలు: పీఎం
తెర పరిమాణం తగ్గుతున్నప్పటికీ.. ఈ రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయి. స్క్రీన్ మైక్రోగా మారుతుంటే.. సందేశం మెగాగా మారుతోంది: పీఎం

చిత్ర నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీతం, సంగీత కచేరీలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది: పీఎం

ప్రపంచంలోని క్రియేటర్లందరికీ - పెద్ద కలలు కనండి, మీ కథలు చెప్పండి, పెట్టుబడిదారులకు - ప్రజలపై కూడా పెట్టుబడి పెట్టండి, భారతీయ యువతకు - మీ దగ్గర ఉన్న బిలియన్ కథలను ప్రపంచానికి చెప్పండి: పీఎం

 Posted On: 01 MAY 2025 1:42PM |   Location: PIB Hyderabad

మొట్టమొదటి ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ - వేవ్స్ 2025ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారుఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న మహారాష్ట్రగుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారుఈ కార్యక్రమానికి హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులురాయబారులుసృజనాత్మక రంగానికి చెందిన నిపుణులను స్వాగతిస్తూ.. వేవ్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. 100కు పైగా దేశాకు చెందిన కళాకారులుఆవిష్కర్తలుపెట్టుబడిదారులువిధాన రూపకర్తలు కలసి అంతర్జాతీయ స్థాయి ప్రతిభసృజనాత్మక వ్యవస్థకు పునాది వేశారని పేర్కొన్నారు. ‘‘వేవ్స్ కేవలం సంక్షిప్త పదం కాదు.. సంస్కృతినిసృజనాత్మకతనుఅంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం’’ అని వర్ణించారుఅలాగే ఈ సదస్సు సినిమాలుసంగీతంగేమింగ్యానిమేషన్కథలు చెప్పడానికి సంబంధించిన విస్తృతమైన ప్రపంచాన్ని ప్రదర్శిస్తుందని ప్రధాని అన్నారుఅదే సమయంలో కళాకారులురూపకర్తలకు భాగస్వామ్యాలు పెంచుకొనేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను ఇస్తుందని తెలిపారుఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ శుభకాంక్షలు తెలియజేశారుఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు.

వేవ్స్ సదస్సులో భారతీయ సినిమా చరిత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోనే మొట్టమొదటి ఫీచర్ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ 1913, మే 3న విడుదలైందన్నారుఈ చలనచిత్రానికి దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే జయంతిని నిన్నే జరుపుకొన్నామని ప్రధాని గుర్తు చేశారుగడచిన శతాబ్దంలో భారతీయ సంస్కృతిని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా విస్తరింపచేశాయని తెలిపారురష్యాలో రాజ్ కపూర్‌కు ఉన్న ప్రజాదరణనుకేన్స్ ఉత్సవాల్లో సత్యజిత్ రేకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపునుఆర్ఆర్ఆర్ సాధించిన ఆస్కార్ విజయాన్ని ఉదహరించారుభారతీయ చిత్రదర్శకులు ప్రపంచస్థాయి కథనాలను ఎలా రూపొందిస్తున్నారో వివరించారుగురుదత్ చిత్రకావ్యాలురిత్విక్ ఘటక్ తెరకెక్కించిన సాంఘిక చిత్రాలుఏఆర్ రెహ్మాన్ సంగీత ప్రతిభఎస్ఎస్ రాజమౌళి కథన విధానం గురించి వివరించారువీరంతా భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మందికి తెలియజేశారని అన్నారుసినిమా దిగ్గజాలనుసినీ పరిశ్రమకు వారు చేసిన సేవలను స్మారక తపాలా బిళ్లలతో గౌరవమిస్తున్నామని తెలిపారు.

దేశ సృజనాత్మక రంగ సామర్థ్యాన్ని, అంతర్జాతీయ స్థాయిలో సహకారానికున్న ప్రాముఖ్యం గురించి ప్రధానమంత్రి వివరించారుకొన్నేళ్లుగా గేమింగ్సంగీతంచిత్ర దర్శకత్వంనటన తదితర రంగాలకు చెందిన నిపుణులతో తన ఆలోచనలు పంచుకునిఆయా రంగాలపై అవగాహనను మరింత పెంచుకున్నానని తెలిపారుమహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 150 దేశాలకు చెందిన గాయనీగాయకులు ‘వైష్ణవ జనతో’ ఆలపించారని గుర్తు చేశారుఈ శ్లోకాన్ని 500-600 ఏళ్ల క్రితం నర్సింగ్ మెహతా రాశారని తెలిపారుఅంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కళా ప్రయత్నం గణనీయమైన ప్రభావాన్ని చూపించడంతో పాటు ప్రపంచ సామరస్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారుఈ సదస్సుకు హాజరైనవారిలో చాలా మంది గాంధీ మహాత్ముని 150వ జయంతికి సంక్షిప్త వీడియో సందేశాలు రూపొందించిఆయన బోధనలను విస్తరించే ప్రయత్నంలో పాలుపంచుకొన్నారని వెల్లడించారుభారతీయ సృజనాత్మక శక్తిఅంతర్జాతీయ సహకారాలతో తన సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకుందని తెలిపారుఇప్పుడు ఆ లక్ష్యం వేవ్స్ గా కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు.

వేవ్స్ సదస్సు మొదటి సంచిక సాధించిన ఘన విజయాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. ప్రారంభమైన నాటి నుంచే ‘స్పష్టమైన ఉద్దేశం’తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారుఈ అంశంలో సదస్సు అడ్వయిజరీ బోర్డు కనబరిచిన చిత్తశుద్ధినికృషిని కొనియాడారువారి ప్రయత్నాలతోనే సృజనాత్మక రంగంలో వేవ్స్ ఓ ముఖ్యమైన ఘట్టంగా నిలిచిందన్నారుపెద్ద స్థాయిలో నిర్వహించిన క్రియేటర్స్ ఛాలెంజ్‌నుక్రియేటోస్పియర్ కార్యక్రమాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారువీటిలో 60కి పైగా దేశాల నుంచి సుమారుగా 1,00,000 మంది సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. 32 పోటీల్లో తుదిపోటీలకు చేరుకున్న 800 మందికి అభినందనలు తెలిపారుఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వారికి లభించిందన్నారు.

వేవ్స్ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన భారత్ పెవిలియన్లో ప్రదర్శించిన సృజనాత్మక అంశాలను ప్రధానమంత్రి ఆసక్తి కనబరిచారు. గణనీయమైన ఆవిష్కరణలను సాధించామని పేర్కొంటూ ఇప్పుడు అవి కార్యరూపం దాల్చే సమయం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారుకొత్త క్రియేటర్లను ప్రోత్సహించడంలో వారినిఅభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు అనుసంధానిచండంలో వేవ్స్ బజార్ సామర్థ్యాన్ని ప్రముఖంగా వివరించారుకళా రంగంలో కొనుగోలుదారులుఅమ్మకందారులను అనుసంధానించాలనే ఆలోచనను ప్రశంసించారుఇలాంటి కార్యక్రమాలు క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేసి కళాకారులకు నూతన అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు.

సృజనాత్మకతకు, మానవజీవితానికి మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని వివరిస్తూ శిశువు జీవిత ప్రయాణం తల్లి జోలపాటతోనే మొదలవుతుందన్నారుశబ్దంతోనూసంగీతంతోనూ వారికి మొదట పరిచయమయ్యేది అక్కడే అన్నారుచిన్నారి కలలను తల్లి అల్లినట్టుగానేఓ యుగపు కలను సృజనాత్మక నిపుణులు రూపొందిస్తారని అన్నారుతమ కళ ద్వారా కొన్ని తరాలను ప్రభావితం చేయగల దార్శనిక వ్యక్తులను ఒక్క చోటుకి తీసుకురావడంలోనే వేవ్స్ విజయం దాగి ఉందని తెలిపారు.

సమష్టి ప్రయత్నాలపై తనకున్న విశ్వాసాన్ని తెలియజేస్తూ.. కళాకారులుక్రియేటర్లుఈ రంగంలోని దిగ్గజాల అంకిత భావం రానున్న కాలంలో వేవ్స్ ను కొత్త శిఖరాలకు చేరుస్తుందని తెలిపారుభవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి తమ సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని పరిశ్రమ సహచరులను కోరారుఈ కార్యక్రమానికి మరింత ఉత్తేజకరమైన అంశాలు జోడిస్తున్నామంటూ.. భవిష్యత్తులో వేవ్స్ పురస్కారాలను ప్రారంభిస్తామని ప్రకటించారుఇవి కళసృజనాత్మక ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవిగా మారతాయని తెలిపారునిరంతరం అంకితభావంతో ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ.. సృజనాత్మకత ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనసులను గెలుచుకోవడంతరాలకు స్ఫూర్తినివ్వడమే లక్ష్యమని అన్నారు.

భారత వేగవంతమైన ఆర్థిక పురోగతిని ప్రస్తావిస్తూ.. దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారుఅంతర్జాతీయంగా ఆర్థిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందనిమొబైల్ తయారీలో రెండో అతిపెద్ద దేశంగా ఉందనిఅంకుర సంస్థల పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా అవతరించిందని తెలిపారుఅభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ ప్రస్థానం ఇప్పుడిప్పుడే మొదలైందనిసాధించాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన స్పష్టం చేశారు. “వంద కోట్ల జనాభాకు మాత్రమే కాదువంద కోట్లకు పైగా విజయగాథలకూ భారత్ నిలయం’’ అని ఆయన పేర్కొన్నారుభారతదేశ గొప్ప కళాత్మక చరిత్రను ప్రస్తావిస్తూ.. రెండు వేల ఏళ్ల కిందటే భరత ముని నాట్యశాస్త్రం భావోద్వేగాలనుమానవానుభవాలను రూపుదిద్దడంలో కళ ఎంతటి శక్తిమంతమైనదో స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారుశతాబ్దాల క్రితమే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం శాస్త్రీయ నాటకానికి కొత్త దిశను పరిచయం చేసిందని పేర్కొన్నారుఇక్కడ వీధి వీధికీ ఓ చరిత్ర ఉందనిప్రతి పర్వతమూ పాటను పలికిస్తుందనినదులన్నీ రాగాలను వినిపస్తాయని చెప్తూ.. భారత్‌కు దృఢమైన సాంస్కృతిక మూలాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారుదేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఒక్కో ఊరికీ సొంత జానపద సంప్రదాయాలూ విశిష్టమైన కథన శైలీ ఉన్నాయన్నారుజానపద కథల ద్వారా ఆ సమాజాలు తమ చరిత్రను పరిరక్షించుకుంటున్నాయని తెలిపారుభజనలుగజళ్లుశాస్త్రీయమైన కూర్పులు లేదా సమకాలీన బాణీలు... ఏవైనా సరేప్రతి స్వర మాధుర్యానికీ ఓ గాథ ఉన్నదనిప్రతి లయకూ ఆత్మ ఉన్నదని భారతీయ సంగీత ఆధ్యాత్మిక విశిష్టతను ఆయన ప్రస్తావించారు.

నాద బ్రహ్మ (దైవిక ధ్వనిభావనను వివరిస్తూ.. బలంగా వేళ్లూనుకుని ఉన్న భారత కళాత్మకఆధ్యాత్మిక వారసత్వాన్ని వేవ్స్ సదస్సులో శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారుశివుడి ఢమరుకాన్ని తొలి విశ్వ శబ్దంగాసరస్వతీ దేవి వీణను జ్ఞాన లయగాకృష్ణుడి వేణువును శాశ్వత ప్రేమ సందేశంగామహా విష్ణువు శంఖాన్ని సానుకూల శక్తినిచ్చేదిగా అభివర్ణిస్తూభారతీయ పురాణాలు సంగీతంనృత్యాల ద్వారా ఎల్లవేళలా దైవత్వాన్ని వ్యక్తం చేశాయని ఆయన వ్యాఖ్యానించారుసదస్సులో మంత్రముగ్ధులను చేసేలా సాగిన సాంస్కృతిక ప్రదర్శన కూడా ఈ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు. ‘ఇదే సరైన సమయం’ అని ప్రకటిస్తూ.. ‘క్రియేట్ ఇన్ ఇండియాక్రియేట్ ఫర్ ది వరల్డ్’ అన్న భారత్ లక్ష్యాన్ని శ్రీ మోదీ పునరుద్ఘాటించారువేల ఏళ్ల నాటి అమూల్యమైన సంపద దేశ కథన సంప్రదాయానికి ఉందన్నారుభారతదేశ గాథలు కాలాతీతమైనవనిఆలోచనను రేకెత్తించేవనిఅంతర్జాతీయమైనవని వ్యాఖ్యానించిన శ్రీ మోదీ.. ఇందులో సాంస్కృతిక ఇతివృత్తాలు మాత్రమే కాకుండా శాస్త్రీయతక్రీడలుధైర్య సాహసాలు కూడా ఉన్నాయని వివరించారుదేశంలోని కథన రంగం సైన్స్‌ను కాల్పనికతవీరత్వంసృజనాత్మకతతో మేళవించి.. విస్తృతమైనవైవిధ్యమైన సృజనాత్మక వ్యవస్థను నెలకొల్పుతుందని ఆయన వ్యాఖ్యానించారుఅసాధారణమైన భారతదేశ గాథలను ప్రపంచంతో పంచుకోవడంతోపాటు కొత్తఆకర్షణీయమైన విధానాల ద్వారా వాటిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యతను వేవ్స్ వేదిక తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజా పద్మ పురస్కారాలకూ వేవ్స్ సదస్సు లక్ష్యానికీ పోలిక ఉందని చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచీ ప్రతిభావంతులను గుర్తించివారి అభ్యున్నతికి దోహదపడడమే ఈ రెండు కార్యక్రమాల లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారుస్వాతంత్ర్యానంతరం కొన్నేళ్లకే పద్మ పురస్కారాలు ప్రారంభమైనప్పటికీమారుమూల ప్రాంతాల నుంచీ దేశానికి విశేష సేవలందిస్తున్న వ్యక్తులను గుర్తించడం ద్వారా ‘ప్రజా పద్మాల’ను భారత్ ఆదరించిన వేళ వాటిలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుఈ మార్పు వల్ల ఈ పురస్కారాలు ఓ లాంఛనమైన వేడుక స్థాయి నుంచి జాతీయ పండుగగా మారాయని పేర్కొన్నారుఅదేవిధంగా సినిమాసంగీతంయానిమేషన్గేమింగ్ రంగాల్లో దేశంలోని అపారమైన సృజనాత్మక ప్రతిభకు అంతర్జాతీయ వేదికగా వేవ్స్ నిలుస్తుందనిదేశంలోని అన్ని ప్రాంతాల కళాకారులకూ ప్రపంచస్థాయి వేదికపై తగిన గుర్తింపు లభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

విభిన్నమైన భావనలు, సంస్కృతులను ఆదరించగల భారతీయ సంప్రదాయాన్ని ఓ సంస్కృత వచనం ద్వారా ప్రస్తావిస్తూ.. భారతీయ నాగరికతా సౌహార్ద్రత పార్సీలుయూదుల వంటి సమాజాలను స్వాగతించిందనివారు ఈ దేశంలో విశేషంగా పురోగతి సాధించి సాంస్కృతిక నిర్మాణంలో అంతర్భాగమయ్యారని శ్రీ మోదీ వివరించారుకార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల మంత్రులుప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూప్రతి దేశమూ ఎన్నో విజయాలు సాధించిందనివిశేషంగా కృషి చేసిందని ఆయన పేర్కొన్నారుకళకు సంబంధించి ప్రపంచం సాధించిన విజయాలను గౌరవించడమే భారతదేశ బలమన్న ఆయన.. సృజనాత్మక సహకారంపట్ల దేశ నిబద్ధతను పునరుద్ఘాటించారువిభిన్న సంస్కృతులుదేశాల విజయాలను ప్రతిబింబించే కంటెంట్ సృజన ద్వారా.. అంతర్జాతీయ అనుసంధానాన్నీ కళా వినిమయాన్నీ వేవ్స్ బలోపేతం చేయగలదని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశ కథన రంగంతో భాగస్వామ్యం వల్ల.. తమ సొంత సంస్కృతి బలీయంగా ప్రతిధ్వనించే కథనాలను సృష్టించవచ్చని ధీమా వ్యక్తంచేస్తూ.. అంతర్జాతీయ సృజన సమాజానికి ప్రధానమంత్రి ఆహ్వానం పలికారుసుసంపన్నమైన భారత కథన సంప్రదాయంలో సరిహద్దులకు అతీతమైన ఇతివృత్తాలుభావోద్వేగాలు ఉన్నాయనీ.. అవి సహజంగాఅర్థవంతంగా ఆకట్టుకోగలవని ఆయన స్పష్టం చేశారుభారతీయ కథలను పరిశీలించే అంతర్జాతీయ కళాకారులుసృజనకారులు ఈ దేశ వారసత్వంతో సహజమైన బంధాన్ని అనుభూతి చెందుతారని ఆయన వ్యాఖ్యానించారుఈ సాంస్కృతిక సమ్మేళనం ‘క్రియేట్ ఇన్ ఇండియా’ అన్న భారతదేశ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందనిదానిని ప్రపంచానికి మరింత అందుబాటులోకి తెస్తుందని పేర్కొన్నారు.

భారత్‌లో సృజనరంగ ఆర్థిక వ్యవస్థకు ఇది తొలిపొద్దుకంటెంట్సృజనాత్మకతసంస్కృతి ఈ మూడూ దానికి మూలాధారమైన కీలక స్తంభాలు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుభారతీయ సినిమాలు ఇప్పుడు వందకుపైగా దేశాల ప్రేక్షకులను చేరాయనిపైపై ప్రశంసలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు భారతీయ సినిమాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారుఅంతర్జాతీయ ప్రేక్షకులు భారతీయ కంటెంటును సబ్‌టైటిల్స్‌తో చూసే ధోరణి పెరుగుతోందనిభారతీయ కథల్లో వారు లోతుగా నిమగ్నమవడాన్ని ఇది సూచిస్తుందని అన్నారుభారతీయ ఓటీటీ పరిశ్రమ ఇటీవలి సంవత్సరాల్లో పది రెట్ల వృద్ధిని సాధించిందన్న శ్రీ మోదీ.. స్క్రీన్ పరిమాణం తగ్గినా కంటెంట్ పరిధి అవధులను అధిగమించి విస్తరించిందనిచిన్న స్క్రీన్లే పెద్ద సందేశాలను అందిస్తున్నాయని కూడా వ్యాఖ్యానించారుభారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందనిత్వరలోనే భారతీయ సంగీతం అదేవిధమైన గుర్తింపును సొంతం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు.

భారత సృజన రంగ ఆర్థిక వ్యవస్థకు గల అపారమైన సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ... మున్ముందు సంవత్సరాల్లో దేశ జీడీపీలో దీని వాటా గణనీయంగా పెరగబోతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “సినీ నిర్మాణండిజిటల్ కంటెంట్గేమింగ్ఫ్యాషన్సంగీతాల్లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఎదుగుతోంది’’ అని వ్యాఖ్యానించారుప్రత్యక్ష సంగీత విభావరి రంగంలో వృద్ధి ఆశాజనకంగా ఉందన్నారుఅంతర్జాతీయ యానిమేషన్ మార్కెట్‌లో వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయన్నారుఇది ప్రస్తుతం 430 బిలియన్ డాలర్లకు పైగా ఉందనివచ్చే దశాబ్దంలో రెట్టింపవుతుందని అంచనా వేస్తున్నారుభారతదేశ యానిమేషన్గ్రాఫిక్స్ పరిశ్రమకు ఇదొక కీలక అవకాశమని ప్రధానమంత్రి వివరించారుఅంతర్జాతీయంగా పరిధిని మరింత విస్తృతం చేసుకునేలా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంబంధిత వర్గాలను కోరారు.

దేశ సృజన రంగ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడపాలని యువ సృజనకారులకు పిలుపునిచ్చారు. వారి అభిరుచికృషి సృజనాత్మకతలో కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారువారు గౌహతీ సంగీతకారులైనాకొచ్చి పాడ్‌కాస్టర్లయినాబెంగళూరులోని గేమ్ డిజైనర్లయినాపంజాబ్‌లోని సినీ దర్శకులయినా... వారి కృషి విశేషంగా పురోగమిస్తున్న భారత సృజన రంగానికి చోదకంగా నిలుస్తోంది. సృజన రంగంలో నిపుణులకు ప్రభుత్వం అండగా ఉంటుందనీ.. స్కిల్ ఇండియాస్టార్టప్‌లకు చేయూతఏవీజీసీ పారిశ్రామిక విధానాలువేవ్స్ వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా చేయూత అందిస్తామని భరోసా ఇచ్చారుసృజనాత్మకతకూ భావుకతకూ ప్రాధాన్యమిచ్చే వాతావరణాన్ని నెలకొల్పడానికిసరికొత్త స్వప్నాలను ప్రోత్సహించడానికిఆ కలలను సాకారం చేసుకునే సాధికారులుగా కళాకారులను తీర్చిదిద్దడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారుసృజనాత్మకతా కోడింగ్ ఒకేచోట కలిసేలాకథన ప్రతిభతో సాఫ్ట్‌వేర్ మిళితమయ్యేలాఅగ్మెంటెడ్ రియాల్టీతో కళ తాదాత్మ్యం చెందేలా... అత్యంత ప్రధానమైన వేదికగా వేవ్స్ నిలుస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిపెద్ద కలలు కనాలనితమ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అంకితభావంతో కృషిచేయాలని యువ సృజనకారులను ప్రధానమంత్రి కోరారు.  

భారత్‌లోని కంటెంట్ క్రియేటర్లంటే తనకు అచంచలమైన విశ్వాసం ఉందని ప్రధాని అన్నారు. ఎల్లల్లేని వారి  సృజనాత్మకత ప్రపంచ సృజన ప్రధాన ముఖచిత్రాన్ని పునర్లిఖిస్తోందని ఆయన వ్యాఖ్యానించారుభారత సృజనాత్మక కళాకారుల ఉత్సాహానికి ఎలాంటి అడ్డంకులుపరిధులు గానిఒక్కోసారి ముందుకు ఒక్కోసారి వెనుకకు పోయే ఊగిసలాట మనస్తత్వం గాని లేనే లేవు... దీంతో వారిలో కొత్త కొత్త ఆలోచనలు మొగ్గలు తొడుగుతూ పూలుగా వికసించేందుకు అనువైన స్థితి నెలకొందని ఆయన అన్నారు.

యువ సృజనకారులుగేమర్లుడిజిటల్ ఆర్టిస్టులతో తాను స్వయంగా భేటీ అయ్యి మాటామంతీ జరిపిన మీదటభారత్‌లో సృజన ప్రధాన అనుబంధ విస్తారిత వ్యవస్థలో  ఎంతటి ఉత్సాహంశక్తిప్రతిభలు ఉప్పొంగుతున్నాయో అతి దగ్గర నుంచి తాను గమనించగలిగినట్లు ఆయన చెప్పారుఇండియాలోని భారీ యువ జనాభా రీళ్లుపాడ్‌క్యాస్టులుగేములు  మొదలు యానిమేషన్స్టాండప్‌లతోపాటు ఏఆర్-వీఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీవర్చువల్ రియాలిటీరూపాలకు నూతన సృజనశీల పార్శ్వాలను జోడిస్తున్నారని అభిప్రాయపడ్డారుఈ తరం కోసమంటూ ప్రత్యేకంగా సిద్ధం చేసిన వేదికే ‘వేవ్స్’ అని ప్రధాని స్పష్టం చేశారుఈ తరానికి చెందిన వారి కోసం... వారు తమ శక్తియుక్తులతో సృజనాత్మక రంగంలో ఓ విప్లవాన్ని ఊహించడమొక్కటే కాకుండా దానిని సాకారం చేయడానికి కూడా వేవ్స్ తోడ్పడుతుందని ఆయన అన్నారు.

టెక్నాలజీ చోదక శక్తిగా ఉంటున్న 21వ శతాబ్దంలో సృజనాత్మక జవాబుదారుతనానికి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదీ శ్రీ మోదీ ప్రత్యేకంగా చెబుతూటెక్నాలజీ మనిషి జీవనంపై చాలా వేగవంతమైన ప్రభావాన్ని చూపిస్తోందన్నారుఈ కారణంగా భావోద్వేగభరిత సున్నితత్వాన్నిసాంస్కృతిక సంపన్నతను పదిలపర్చుకోవడానికి అదనపు ప్రయత్నాలు అవసరమన్నారుమానవీయ కరుణను వ్యాప్తి చేసేసామాజిక చేతనను విస్తరించే శక్తి సృజనాత్మక జగతికి ఉందని ఆయన చెప్పారులక్ష్యం మరమనుషులను తయారు చేయడం ఏమీ కాదుఉన్నత స్థాయి సున్నితత్వంభావనాత్మక గాఢతమేధో సంపన్నత కలిగిన వ్యక్తులను మలచడం.. ఈ గుణాలను వట్టి సమాచారాన్ని అదేపనిగా వెల్లువెత్తించడం ద్వారానోలేక సాంకేతిక వేగంతోనో అయ్యే పని కాదు అని ఆయన స్పష్టం చేశారు.  కళసంగీతంనృత్యంకథ చెప్పడం... వీటికి ఉన్న ప్రాముఖ్యాన్ని శ్రీ మోదీ వివరిస్తూఈ కళారూపాలు వేల సంవత్సరాల నాటి నుంచి మనిషిలో అవగాహన శక్తులను సజీవంగా నిలుపుతూ వచ్చాయన్నారుఈ సంప్రదాయాలను బలోపేతం చేయడంతోపాటు ఇప్పటి కంటే మరింత ఎక్కువ ప్రోద్బల భవిష్యత్తును నిర్మించేలా కృషి చేయాల్సిందిగా సృజనాత్మక కళాకారులకు ప్రధాని విజ్ఞ‌ప్తి చేశారుసమాజాన్ని విభజించేసమాజానికి చేటు చేసే ఆలోచనావిధానాల బారిన పడకుండా యువతరాలను కాపాడాల్సిన అవసరం ఎంతయినా ఉందని కూడా ఆయన ప్రధానంగా చెప్పారుసాంస్కృతిక సమగ్రతను పరిరక్షించడంతోపాటు సకారాత్మక విలువలను ప్రతిష్ఠించడానికి ఒక కీలక వేదికగా ‘వేవ్స్’ మారగలదని ఆయన అన్నారుఈ బాధ్యతను పట్టించుకోకపోతే రాబోయే తరాలకు ఘోరమైన పరిణామాలు ఎదురుకావచ్చని ఆయన హెచ్చరించారు.    

సృజనాత్మక జగతిలో గణనీయ మార్పులను టెక్నాలజీ తీసుకువస్తోందని ప్రధాని స్పష్టం చేస్తూదీని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ప్రపంచ స్థాయి సమన్వయాన్ని ఏర్పరచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్నారుభారత సృజనాత్మక కళాకారులకు ప్రపంచమంతటా ఉన్న కథ చెప్పే కళాకారులతోనూయానిమేటర్లతోనూదార్శనికులతోనూ అనుబంధాన్ని పెనవేసి గేమ్స్ రూపకర్తలను ప్రపంచ విజేతలుగా మలచడంలో వేవ్స్ ఒక సమన్వయకర్తగా ఉంటుందంటూ ఆయన అభివర్ణించారుకంటెంటును సృష్టించడానికి ఇండియాను స్ఫూర్తిగా తీసుకొంటూదేశ సువిశాల క్రియేటివ్ ఇకోసిస్టమ్ ను ఆమూలాగ్రం అన్వేషించాలంటూ అంతర్జాతీయ సృజనాత్మక కళాకారులకుపెట్టుబడిదారులకు ఆయన ఆహ్వానం పలికారుప్రపంచ సృజనకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూవారు పెద్ద పెద్ద కలలను కనాలనితమ కథలకు ప్రాణం పోయాలని కోరారుపెట్టుబడిదారులు ఒక్క వేదికల పైనే పెట్టుబడి పెట్టడం కాకుండావ్యక్తుల పైన పెట్టుబడి పెట్టాల్సిందిగా ఆయన ప్రోత్సహించారుభారత యువత తమ వద్ద గుట్టలు గుట్టలుగా రాశి పోసి ఉన్న కథలను సాటి ప్రపంచంతో పంచుకోవాల్సిందిగా కూడా ఆయన పిలుపునిచ్చారువేవ్స్ తొలి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న వారందరికీ ఆయన తన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నరు శ్రీ సి.పిరాధాకృష్ణన్మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్డాక్టర్ ఎల్మురుగన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నేపథ్యం

వేవ్స్ 2025’ అనేది నాలుగు రోజులపాటు సాగే శిఖరాగ్ర సదస్సు. ‘‘సృజనకారులను కలపడం.. దేశాలను కలపడం’’ అనేది ఈ సదస్సు మూలసూత్రంప్రసార మాధ్యమాలువినోదండిజిటల్ నవకల్పనలకు ప్రపంచ కూడలిగా భారత్‌ను ఆవిష్కరించడానికి ఈ సదస్సు నడుం బిగించిందిదీనికోసం ప్రపంచ వ్యాప్త సృజనశీలురనుఅంకుర సంస్థలనుపరిశ్రమ ప్రముఖులనువిధాన రూపకర్తలను ఈ సదస్సు ఒక చోటుకు తీసుకువస్తోంది.

ఒక ఆశాజనక భవిష్యత్తుకు రూపురేఖలను కల్పించడానికి టెక్నాలజీనిసృజనాత్మక కళాకారులతో పాటు ప్రతిభావంతుల సేవలను ఉపయోగించుకోవాలన్నది ప్రధాని దార్శనికతదీనికి అనుగుణంగానే  చలనచిత్రాలనుఓటీటీనిగేమింగునుకామిక్స్‌నుడిజిటల్ ప్రసార మాధ్యమాలనుకృత్రిమ మేధ (ఏఐ),  యానిమేషన్,విజువల్ ఎఫెక్ట్‌స్గేమింగ్కామిక్స్ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్‌), ప్రసార రంగ సేవలనుసరికొత్త సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని కలబోసి భారత ప్రసార మాధ్యమాలకువినోద రంగానికి ఉన్న సత్తాను వేవ్స్ సమగ్రంగా చాటిచెబుతుంది.  ప్రపంచ వినోద ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భారత వాటాను పెంచుకుంటూ, 2029వ సంవత్సరానికల్లా 50 బిలియన్ డాలర్ల విలువ గల మార్కెటును ఒడిసిపట్టాలనేదే వేవ్స్ లక్ష్యం.

భారత్ మొట్టమొదటి సారి గ్లోబల్ మీడియా డైలాగ్‌ను (జీఎండీకూడా వేవ్స్ 2025లో భాగంగా నిర్వహిస్తోంది. 25 దేశాల మంత్రిత్వ శాఖల ప్రముఖులు దీనిలో పాలుపంచుకుంటున్నారుప్రపంచ ప్రసార మాధ్యమాలువినోద ప్రధాన రంగంతో ఇండియాకున్న అనుబంధంలో ఇది ఒక ప్రధాన ఘట్టం కానుందిఈ శిఖరాగ్ర సదస్సు‌ నిర్వహణలో ‘వేవ్స్ బజార్’ మరో ముఖ్య అంశంఇది 6,100 కొనుగోలుదారు సంస్థలు, 5,200 అమ్మకందారు సంస్థలు, 2,100 ప్రాజెక్టులకు పైగా పాలుపంచుకొనే ప్రపంచ స్థాయి ఇ-మార్కెట్ ప్లేస్ఇది స్థానిక,  ప్రపంచ స్థాయి కొనుగోలుదారులనుఅమ్మకందారులను కలుపుతూ నెట్‌వర్కింగ్‌తోపాటు వ్యాపార అవకాశాలను అందిస్తుంది.

ప్రధానమంత్రి క్రియేటోస్ఫియర్‌ను చూశారుదాదాపు ఒక సంవత్సరం కిందట మొదలుపెట్టిన 32 ‘క్రియేట్ ఇన్ ఇండియా’ ఛాలెంజులకు ఒక లక్షకు పైగా రిజిస్ట్రేషన్లతో భారీ ప్రతిస్పందన రాగాఎంపిక చేసిన సృజనశీలురతో ప్రధాని భేటీ అయ్యారుప్రధానమంత్రి భారత్ పెవిలియన్‌ను కూడా సందర్శించనున్నారు.

వేవ్స్ 2025లో 90కి పైగా దేశాలకు చెందిన 10,000 మందికి పైగా ప్రతినిధులు, 1,000 మంది సృజనాత్మక కళాకారులు, 300 కన్నా ఎక్కువ సంఖ్యలో కంపెనీలతోపాటు 350కి పైగా అంకుర సంస్థలు  పాల్గొంటున్నాయిఈ శిఖరాగ్ర సదస్సులో చలనచిత్రాలుడిజిటల్ మాధ్యమాలుప్రసార సేవ,  వినోదంవిజ్ఞ‌ానం.. ఈ రెండు సేవలనూ అందించే ప్రసారాలుఏవీజీసీ-ఎక్స్‌ఆర్ సహా విభిన్న రంగాలకు సంబంధించిన 42 సర్వసభ్య కార్యక్రమాలు, 39 బ్రేకవుట్ సెషన్లు, 32 మాస్టర్‌క్లాసులను నిర్వహిస్తారు.  

 

 

***

MJPS/SR


Release ID: (Release ID: 2125850)   |   Visitor Counter: 9