ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముద్రా యోజన లబ్ధిదారులతో ప్రధానమంత్రి మాటామంతీ

Posted On: 08 APR 2025 1:25PM by PIB Hyderabad

లబ్ధిదారు:  పెంపుడు జంతువులంటే ఉన్న ఇష్టం నన్ను వ్యాపారవేత్తగా మార్చిన తీరు గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను సర్.. నా వ్యాపారానికి కే-9 అని పేరు పెట్టుకున్నానుపెంపుడు జంతువులకి అవసరమైన సామగ్రిమందులే కాకపెంపుడు జంతువులు కూడా మా వద్ద లభ్యమవుతాయిముద్రా రుణం అందిన తరువాత మా వ్యాపారాన్ని మరింత విస్తరించాంజంతువులను పెంచుకుంటున్న వారు పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన సందర్భాల్లోమా పెట్ బోర్డింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చుపెట్స్ కి  వాటి సొంత ఇంట్లో లభించే ప్రేమపూరిత వాతావరణాన్నే అందిస్తాంనాకు మూగజీవాల పట్ల గల ప్రేమ చాలా ప్రత్యేకమైంది సర్నేను తిన్నాతినకపోయినావాటికి మాత్రం సమయానికి ఆహారం అందేలా చూస్తాను..

ప్రధానమంత్రిఅయితే మీ ఇంట్లో అందరూ మీ తీరు పట్ల విసిగిపోయి ఉంటారే?

లబ్ధిదారునా కుక్కలునేను విడిగా ఇంకో చోట ఉంటాం సర్మీకు అనేక కృతజ్ఞతలు సర్మీ వల్లే నాలాంటి మూగజీవాల ప్రేమికులుఎన్జీవోలు ఎటువంటి ఆటంకాలు లేకుండా తమ పని చేసుకోగలుగుతున్నారుజంతు ప్రేమికులు కానివారికి ఇక్కడ ప్రవేశం లేదు అని నా ఇంటి గేటు వద్ద రాసి ఉంటుంది సర్..

ప్రధానమంత్రి: ఇక్కడికి వచ్చి వెళ్ళాక మీకు పబ్లిసిటీ బాగా పెరుగుతుందా?

లబ్ధిదారుఅది సహజమే కదా సర్!

ప్రధానమంత్రిమీరుంటున్న హాస్టల్ మీకు సరిపోదేమో?!

లబ్ధిదారునిజమేగతంలో నేను నెలకి 20,000 రూపాయలు సంపాదించేటప్పుడు ఇబ్బంది పడేవాడిని..  ఇప్పుడు మాత్రం నెలకు 40,000 నుంచి 50,000 వరకూ సంపాదిస్తున్నాను

ప్రధానమంత్రి: అయితే మీరిప్పుడొక పని చేయాలిఈ బ్యాంక్ వారున్నారు కదా..

లబ్ధిదారుచెప్పండి సర్.

ప్రధానమంత్రిమీకు రుణం అందించిన ఆ బ్యాంకు వారిని పిలవండిమీరు మొదలుపెట్టిన వ్యాపారం గురించి వారికి అన్ని వివరాలు చెప్పండి. “ఎందరో భయపడి వెనకడుగు వేసే పనిని మీరు చేశారునాపై నమ్మకం ఉంచి నాకు రుణం ఇచ్చారుమీరిచ్చిన రుణం సొమ్ముని నేనే విధంగా వాడుతున్నానో చూడండి..” అని వారికి చెప్పండి.

లబ్ధిదారుతప్పక సర్!

ప్రధానమంత్రిమేము ఒక మంచి పనిని చేశాం అని వారు సంతృప్తి చెందుతారు.

లబ్ధిదారు: ప్రధానమంత్రి అంటే మితభాషి అనే భావన పటాపంచలైంది.. ఆయన మాతో కలిసిపోయి ఎంతో సరదాగా మాట్లాడారుఅది నాకెంతో నచ్చిందిమరో మాట.. ఆయన చాలా గొప్ప శ్రోత!

లబ్ధిదారుకేరళ రాష్ట్రం నుంచి వచ్చిన ముద్రా రుణాల లబ్ధిదారుని నేనునా పేరు గోపీ కృష్ణన్ప్రధానమంత్రి ముద్రా యోజన నన్నొక విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలబెట్టిందిగృహాలకీకార్యాలయాలకీ పునర్వినియోగ ఇంధన వ్యవస్థలను అందించే నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతోంది.. అనేక మందికి ఉపాధిని కూడా కల్పించింది!

ప్రధానమంత్రిదుబాయ్ నుంచి వెనక్కి వచ్చేసినప్పుడు మీ ప్రణాళికలేంటి?

లబ్ధిదారు: నేను స్వదేశానికి వచ్చినప్పుడు ముద్రా రుణాల గురించి విన్నానుదాంతో ఆ  కంపెనీకి రాజీనామా ఇచ్చేశాను.

ప్రధానమంత్రిఅంటే మీరక్కడ ఉండగానే మీకు ఈ విషయం తెలిసిందా?

లబ్ధిదారు: అవునురాజీనామా సమర్పించాక ఇక్కడికొచ్చి ముద్రా రుణం కోసం దరఖాస్తు చేశానుఅప్పుడు ఈ వ్యాపారం మొదలుపెట్టాను

ప్రధానమంత్రి:  ఒక ఇంటిపై సూర్య ఘర్ బిగించేందుకు మీకెంత కాలం పడుతుంది?

లబ్ధిదారురెండ్రోజులు కంటే పట్టదు.

ప్రధానమంత్రిఒక ఇంటికి చేసే పని రెండ్రోజుల్లో పూర్తవుతుంది..

లబ్ధిదారు: మా పనితీరు అటువంటిది..

ప్రధానమంత్రి:  దుబాయ్ నుంచి తిరిగి వచ్చాక మీరు ఒత్తిడికి లోనయ్యారావ్యాపారంలో రాణిస్తానో లేదోరుణం మొత్తాన్ని  తిరిగి చెల్లించలేకపోతే ఏం జరుగుతుందోఅమ్మా నాన్నా చీవాట్లు పెడతారేమోననే బెంగ మీకుండేదా?  

లబ్ధిదారుఅమ్మ కాస్త బెంగ పడిన మాట నిజమేఅయితే దేవుడి దయ వల్ల అన్ని విషయాలూ సర్దుకున్నాయి!

ప్రధానమంత్రి: పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా ఉచిత కరెంటు పొందుతున్నవారి స్పందన ఎట్లా ఉందికేరళలో ఇళ్ళు తక్కువ ఎత్తులో ఉంటాయి కదాపైగా అడపాదడపా కురిసే వర్షాలుపొడవాటి చెట్ల వల్ల సూర్యుడి వెలుగు కాస్త తక్కువగానే ఉంటుంది కదామరి వీరంతా ఏమనుకుంటున్నారు?

లబ్ధిదారుసూర్య ఘర్ పలకలను బిగించిన తరువాత వీళ్లు కట్టాల్సిన విద్యుత్ బిల్లుల్లో గణనీయమైన తగ్గింపు కనిపిస్తోందిగతంలో సగటున ఒక్కొక్కరూ నెలకు 3000 రూపాయల బిల్లు కడితేఇప్పుడు 240-250 రూపాయలు కడుతున్నారు.  

ప్రధానమంత్రి: ఇప్పుడు మీ నెల సంపాదన ఎంతమీ ఖాతాలో ఎంత సొమ్ము నిలువ చేయగలిగారు?

లబ్ధిదారునాకు.. సుమారు...

ప్రధానమంత్రి: తటపటాయించవద్దు మిత్రమాఆదాయపు పన్ను వారు మీ వద్దకు వస్తారేమోనని భయపడకండి..

లబ్ధిదారునాకు నెలకి రూ. 2.5 లక్షల ఆదాయం ఉంటోంది..

ప్రధానమంత్రిఆర్థికమంత్రి నా పక్కనే ఉన్నారు.. మీ ఇంటికి ఇన్ కంటాక్స్ వాళ్లను పంపవద్దని నేను మంత్రిగారికి చెబుతాను..

లబ్ధిదారురెండున్నర లక్షల రూపాయలకు పైబడిన నెలసరి ఆదాయం లభిస్తోంది సర్!

లబ్ధిదారుకలలనేవి మనకు నిద్రలో కనిపించేవి కావుమనకు నిద్ర పట్టకుండా చేసేవే కలలుసమస్యలుంటాయిసవాళ్ళుంటాయి... అయితే కష్టపడే వారికే విజయం లభిస్తుంది.

లబ్ధిదారునేను ‘హౌస్ ఆఫ్ పుచ్కా’ను ప్రారంభించానుఇంట్లో ఈ వంటకాలను తయారు చేసినప్పుడు చక్కటి రుచితో కుదిరేవి.. దాంతో మిత్రులందరూ నన్ను కెఫే రంగంలోకి దిగమని ప్రోత్సహించారురీసర్చ్ మొదలుపెట్టిన నాకుఈ వ్యాపారంలో మంచి లాభాలే అందుతాయని అర్థమయ్యిందిఆహార దినుసుల ధరలను నియంత్రించగలిగితేవిజయవంతమైన వ్యాపారాన్ని నడపవచ్చునని తెలుసుకున్నాను.

ప్రధానమంత్రికొంతమంది యువతఒక తరం ఆలోచనల గురించి చెబుతాను – వీరు చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు సంపాదించుకుని సెటిల్ అవుదామని భావిస్తారుఅమ్మోవ్యాపారాలు మాకొద్దు అనుకుంటారు.. మీరు దీనికి భిన్నంరిస్క్ తీసుకునే సామర్థ్యం కలవారు.

లబ్ధిదారునిజమే సర్..

ప్రధానమంత్రి: అయితే మీకు రాయ్ పూర్ మిత్రులువ్యాపార రంగవిద్యార్థి మిత్రులు ఉండి ఉంటారు కదవారంతా ఏమనుకుంటున్నారుఉద్యోగం – వ్యాపారంవీటికి సంబంధించి మీ మధ్య ఎటువంటి చర్చ జరుగుతుందిఇది చెయ్యాలా లేక అది చెయ్యాలా అని మధనపడతారావీరంతా కూడా తమ అభిప్రాయాలను ఎదుటివారితో పంచుకోవాలని భావిస్తారా?  

లబ్ధిదారుసర్ఇప్పుడు నా వయసు 23 ఏళ్ళురిస్క్ తీసుకునేందుకు తగిన సామర్థ్యంఅవకాశం ఉన్న నాకు ఇదే తగిన సమయంఅయితే నిధులు ఎక్కడి నుంచి అందుతాయోనని ఎక్కువ శాతం యువత దిగులు పడుతుంటారువారికి ప్రభత్వ పథకాల గురించి అవగాహన ఉండటం లేదువారికి నేను చేసే సూచన ఒకటేశోధించి సాధించండిముద్రా రుణాలుపీఎం ఈజీపీ వంటి అనేక పథకాలు ఉన్నాయిపూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేసే ప్రభుత్వ పథకాలు అనేకం అందుబాటులో ఉన్నాయిమీలో అటువంటి సత్తా ఉంటేఉద్యోగాలకు ఉద్వాసన చెప్పి వ్యాపార రంగంలోకి రండి.. మీ అభివృద్ధికి ఆకాశమే హద్దు!  

లబ్ధిదారుఇంటి పైకప్పునకు చేరుకోవాలనుకొనే వారి కోసం మెట్లు ఉంటే ఉండనీయండిఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాం మేంమా దారిని మేమే ఏర్పరుచుకోవాల్సి ఉంటుందినేను ఎండీనినా పేరు ముదస్సిర్ నఖ్ష్‌బందీ... బారాముల్లా కాశ్మీర్‌లో బేక్ మై కేక్‌ యజమానిని నేనువిజయవంతమైన ఈ బిజినెస్‌తోనేను ఉద్యోగాన్ని కోరుకొనే స్థాయి నుంచి ఉద్యోగాన్ని ఇచ్చే స్థాయికి చేరుకొన్నానుమేం బారాముల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన 42 మందికి స్థిరమైన నౌకరీలను ఇవ్వగలిగాం.  
ప్రధానమంత్రి: మీరు చాలా వేగంగా ముందుకువెళ్తున్నారుబ్యాంకు మీకు రుణాన్ని ఇవ్వక మునుపు మీ స్థితి ఏమిటో చెప్పండి?
లబ్ధిదారు: సర్మొత్తంమీదఅది 2021 నాటి సంగతిఅంతకు ముందునేను లక్షల్లోనోకోట్లల్లోనో లేను... కేవలం వేలల్లో ఉన్నాను.
ప్రధానమంత్రి: మీరు మీ బిజినెస్‌లో యూపీఐని కూడా ఉపయోగిస్తున్నారా?
లబ్ధిదారు: సర్,  సాయంత్రం నగదును సరిచూసేటప్పుడు మేం నేను చాలా నిరుత్సాహపడుతున్నా. ఎందుకంటే 90 శాతం లావాదేవీలు యూపీఐ ద్వారానే పూర్తి అవుతున్నాయి. మరి మా చేతిలో 10 శాతం నగదు మాత్రమే ఉంటోంది.
లబ్ధిదారు: నిజానికిఆయన ఎంతో అణకువతో నడుచుకొన్నట్టు నాకనిపించింది. మరి ఆయన మన దేశానికి ప్రధానమంత్రి అన్న భావనే నాకు కలగలేదు... మాతో ఎవరో ఉన్నారు. మాకు మార్గదర్శనం చేస్తున్నారు అనే తోచింది.. అంతటి వినమ్రతను ఆయన చూపించారు.
ప్రధానమంత్రి: సురేశ్ఈ సమాచారం ఎక్కడ నుంచి రాబట్టారు మీరు? ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? కుటుంబంలో మీరు ఇప్పటికే ఏం పని చేస్తున్నారు?
లబ్ధిదారుసర్నేను అప్పటికే ఒక ఉద్యోగంలో ఉన్నా.  
ప్రధానమంత్రి: ఎక్కడ?
లబ్ధిదారు: వాపీలో. మరి అప్పుడు 2022వ సంవత్సరం... నాకనిపించింది ఉద్యోగంతో గొప్పగా సాధించేదేమీ ఉండదని... ఈ కారణంగా నేను నా సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టాలనుకున్నాను.
ప్రధానమంత్రి: మీరు రోజూ మీ బతుకుదెరువు కోసం రైల్లో వాపీ వెళ్లివచ్చేవారా... రైల్లో స్నేహాలు అద్భుతంగా ఉంటాయి. అందుకని ఈ...
లబ్ధిదారు: సర్నేను సిల్వాసాలో ఉంటాను. వాపీలో పనిచేస్తాను... ఇప్పుడు నేను సిల్వాసాలోనే పనిచేస్తున్నాను.
ప్రధానమంత్రి: నాకు తెలుసు ఈ మిట్ట-పల్లాల ముఠాల గురించి. అయితే వాళ్లు అడుగుతూ ఉండి ఉంటారు... మీరు ఇంతలా సంపాదించడం ఎలా మొదలుపెట్టారు, మీరు ఏం చేస్తున్నారు అని.  వారిలో ఎవరైనా ముద్రా రుణం తీసుకోవడంతోపాటు ఎక్కడికైనా వెళ్లే ఉద్దేశంలో ఉన్నారా?
లబ్ధిదారు: అవును సర్. ఇటీవల నేను ఇక్కడికి వస్తుంటేనా దోస్తుల్లో ఒకరు కూడా నాతో ఇదే విషయం ప్రస్తావించారువీలయితే దయచేసి నాకు ముద్రా రుణం విషయంలో కొంత మార్గదర్శనం చేయండీ అని.
ప్రధానమంత్రి: ముందుగామీరంతా నా ఇంటికి వచ్చినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానుఅతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు వారి పాద ధూళి ఇంట్లో పడ్డప్పుడుఆ ఇల్లు పవిత్రం అవుతుందని మన ధర్మగ్రంథాల్లో రాశారుఅందుకనినేను మీకు మనసారా స్వాగతం పలుకుతున్నానుమీ అందరికీ ఏదో ఒక అనుభవం తప్పక ఉండే ఉంటుంది. మీలో కొందరికి మీ పనిని చేసే సమయంలో ఎంతో భావనాత్మకమైన అనుభూతులు కలిగి ఉండి ఉండవచ్చుఎవరికైనా ఏదైనా చెప్పాలనిపిస్తే గనక నేను వినాలనుకుంటున్నాను.
లబ్ధిదారు: సర్ముందుగా నేను మీతో చెప్పాలనుకుంటున్నది మీరు మన్ ‌కీ బాత్ లో మాట్లాడడంతోపాటు... వింటున్నారుకాబట్టిరాయ్‌బరేలీలో ఓ చిన్న గ్రామానికి చెందిన మహిళా వ్యాపారి మీ ఎదుట నిలిచింది. మీ సహకారంతోమద్దతుతో ఎంఎస్ఎంఈలకు ఎంతగానో ప్రయోజనం కలుగుతోందనేదానికిదే ఒక నిదర్శనంఇక్కడికి రావడం నాకు చాలా భావోద్వేగాన్ని కలిగించే సమయం... మేం మీకు మాటిస్తున్నాం... మేమంతా కలిసి భారత్‌ను వికసిత్ భారత్‌ను చేస్తాం... ఎంఎస్ఎంఈలను మేం ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొందడంలో గానిలేదా ఆర్థిక సాయాన్ని పొందడంలో గాని మేం ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పుడల్లా వాటిని మీరు పిల్లలను సాకినట్లు సాకుతున్నారు.  
ప్రధానమంత్రి: ఎన్నికలలో పోటీ చేయాలని మీరనుకుంటున్నారా?
లబ్ధిదారులేదు-లేదు సర్నేను మీతో చెప్పింది ఇదీ. ఆఁ-ఆఁ ఎందుకంటే నాకనిపించేది ఇదివరకు కూడా నేను ఈ సమస్యను ఎదుర్కొన్నానని. ఎప్పుడు అప్పోసొప్పో తీసుకోవాలని వెళ్లినా నాకు దొరికేది కాదు.  
ప్రధానమంత్రి: చెప్పండిమీరేం చేస్తుంటారు?

లబ్ధిదారుబేకరీ అండీ... బేకరీ.
ప్రధానమంత్రి: బేకరీనా?
లబ్ధిదారు: అవును సర్.
ప్రధానమంత్రిమీరిప్పుడు ఎంత డబ్బు సంపాయిస్తున్నారంటారు?
లబ్ధిదారుసర్నా నెలవారీ టర్నోవరు రెండున్నర లక్షల రూపాయల్నుంచి మూడు లక్షల రూపాయల వరకూ ఉంది.
ప్రధానమంత్రి: సరేమీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు?
లబ్ధిదారు: సర్మాది ఏడెనిమిది మందితో కూడిన ఓ బృందం.
ప్రధానమంత్రిమంచిది.
లబ్ధిదారుఅవును సర్.
లబ్ధిదారుసర్ నా పేరు లవ్‌కుశ్ మెహ్రా. నేను మధ్య ప్రదేశ్ లోని భోపాల్‌కు చెందిన వాడినిఇంతకు ముందు నేను ఒక ఉద్యోగంలో ఉండేవాణ్ని సర్. అప్పట్లో నేను ఎవరికో పనులు చేసిపెడుతూ ఉండేవాణ్నిఅంటే నేను సేవకునిగా ఉన్నాను సర్మీరు ముద్రా రుణాన్ని ఇచ్చి మా నుంచి హామీని పొందారు సర్.  మరి మేం ఇవాళ యజమానులుగా మారిపోయాం సర్నేనునిజానికి ఒక ఎంబీఏనినాకేమో ఫార్మాస్యూటికల్ పరిశ్రమను గురించి అసలేం తెలియదు.  నేను నా పనిని 2021లో మొదలుపెట్టానుముందుగా బ్యాంకులను సంప్రదించానువాళ్లు ముద్రా రుణం కోసం లక్షల రూపాయల సీసీ పరిమితిని సూచించారుఅయితే సర్నేను మొట్టమొదటిసారిగా అంత పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటున్నాను కదాదానిని తిరిగి తీర్చగలనా అని భయపడ్డానుఅందుకనినేను ఆ సొమ్ములో నుంచి మూడు నుంచి మూడున్నర లక్షల రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టేవాణ్నిసర్నా ముద్రా రుణం లక్షల నుంచి తొమ్మిదిన్నర లక్షలకు పెరిగింది. మొదటి సంవత్సరంలో నా టర్నోవరు 12 లక్షల రూపాయలు. అది కాస్తా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు 50 లక్షలు కన్నా ఎక్కువే ఉందండి.
ప్రధానమంత్రి: జీవించడానికిది కూడా ఒక మార్గమని అనుకునే వేరే నేస్తాలూ మీకు ఉండి ఉంటారనుకుంటాను.
లబ్ధిదారుఅవును సర్.
ప్రధానమంత్రిఏది ఏమైనాముద్రా యోజనను తెచ్చింది మోదీని పొగడటానికి కాదు. ముద్రా యోజన నా దేశ యువతీయువకులకు వారి సొంత కాళ్ల మీద నిలబడగలమన్న ధైర్యాన్నిస్తుంది. వారిలో ఉత్సాహం ఉరుముతుంది. నేను బతుకుదెరువును సంపాదించుకోవడానికి ఎందుకు చెట్టూపుట్టా తిరగాలి. నేనే పది మందికి ఉపాధి చూపిస్తానని వాళ్లనుకుంటారు.  
లబ్ధిదారు: అవును సర్.
ప్రధానమంత్రి: ఈ మూడ్‌ను ఏర్పరచుకోవాల్సింది మీరే. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందా?
లబ్ధిదారు: అవును సర్మా ఊరు బఛ్‌వానీ. ఇది భోపాల్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉందికనీసం ఇద్దరుముగ్గురు ఆన్‌లైన్ డిజిటల్ షాపులు పెట్టుకున్నారు. కొంతమంది ఫోటో స్టూడియోలు పెట్టుకోవడానికి ఒక లక్షారెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారునేను కూడా వారికి సాయం చేశాను సర్నా దోస్తులు కూడా సాయపడ్డారు సర్.
ప్రధానమంత్రిఎందుకంటే... నేనిప్పుడు మీ నుంచి ఆశిస్తున్నదల్లామీరు ఇతరులకు ఉపాధి కల్పించడమేగాక లాంటి హామీ లేకుండా ఆర్థిక సహాయం లభిస్తుందని వారికి చెప్పడమేకాబట్టిఇంకా ఇంట్లో కూర్చుని ఆలోచించడం ఎందుకువెళ్లండి... బ్యాంకుల వెంట పడండి!

లబ్ధిదారుఈ ముద్ర రుణ సాయం వల్లనే ఇటీవల రూ.34 లక్షలతో ఇల్లు కొనుక్కున్నాను.

ప్రధానమంత్రిఅద్భుతం!

లబ్ధిదారునేనింతకుముందు 60-70 వేల నెల జీతంతో ఉద్యోగం చేసేవాణ్నిఇప్పుడు నెలకు 1.5 లక్షల రూపాయలకుపైగా సంపాదిస్తున్నాను.

ప్రధానమంత్రిమంచిది... మీకు విశేష అభినందనలు.

లబ్ధిదారుఇదంతా మీ చలవతోనే సర్‌... మీకు ఎనలేని కృతజ్ఞతలు.

ప్రధానమంత్రిఅలాక్కాదు సోదరా... అది మీ కఠోర కృషి ఫలితం.

లబ్ధిదారుమోదీగారితో సంభాషించినపుడు మాకు ప్రధానమంత్రితో మాట్లాడుతున్నట్లు అస్సలు అనిపించలేదుమా ఇంట్లో ఒకరు... మా కుటుంబ పెద్ద మాతో ముచ్చటిస్తున్న భావన కలిగిందిముద్ర రుణ పథకం సాయంతో మేమెలా విజయం సాధించామో ఆయనకు పూర్తిగా వివరించాంఈ రుణం గురించి మరింత మందికి అవగాహన కల్పించేలా ఆయన మమ్మల్ని ప్రేరేపించిన తీరు చూసిన ఎవరైనాఈ పథకం తోడ్పాటుతో సొంత వ్యాపారం ప్రారంభించిసాధికారత సాధించగలరు.

లబ్ధిదారుసర్‌... నేను గుజరాత్‌లోని భావ్‌నగర్‌ నుంచి వచ్చాను.

ప్రధానమంత్రిమీరు చాలా చిన్నవారిలా కనిపిస్తున్నారు!

లబ్ధిదారుఅవును సర్‌...

ప్రధానమంత్రిఈ మొత్తం బృందంలో..?

లబ్ధిదారునేను చివరి సంవత్సరంలో ఉన్నాను సర్‌. 4 నెలలుగా....

ప్రధానమంత్రిచదువుకుంటూనే సంపాదిస్తున్నారా?

లబ్ధిదారుఅవును సర్‌...

ప్రధానమంత్రిశభాష్‌!

లబ్ధిదారుఆదిత్య టెక్ ల్యాబ్ పేరిట నా సొంత వ్యాపార సంస్థను ప్రారంభించానుఇందులో 3డి ప్రింటింగ్‌రివర్స్ ఇంజనీరింగ్రాపిడ్ ప్రోటోటైపింగ్ సహా కొన్ని రోబోటిక్స్ సంబంధిత పనులు కూడా చేస్తుంటానునేనిప్పుడు చివరి సంవత్సరం మెకాట్రానిక్స్ విద్యార్థినికాబట్టిఆటోమేషన్ తదితరాలపై నాకు అమితాసక్తిముద్ర రుణం సాయంతో నా ఆసక్తిని సాకారం చేసుకోగలిగానుఇప్పుడు నా వయసు 21 సంవత్సరాలు... మొదట్లో ఈ రుణం పొందడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని విన్నానుఅందువల్ల ఈ ఏడాదిలో నాకు రుణం లభించదని భావించానుఅసలు చదువు పూర్తికాని వాడిని నమ్మి రుణం ఎలా ఇస్తారన్నది నా సందేహంఒకటిరెండేళ్లు ఏదైనా ఉద్యోగంలో అనుభవం సంపాదిస్తే తర్వాత రుణం లభిస్తుందని అందరూ సలహా ఇచ్చారుకానీమా భావ్‌నగర్‌లో సౌరాష్ట్ర గ్రామీణ బ్యాంకు ఉంది... నేను వారిని సంప్రదించినా ఆలోచనను వారికి వెల్లడించానునేనేం చేయాలనుకుంటున్నానో చక్కగా వివరించానుదీనిపై వారు స్పందిస్తూమీకు కిషోర్ కేటగిరీ కింద రూ.50,000 నుంచి రూ.5 లక్షలదాకా ముద్ర రుణం పొందే వీలుందని చెప్పారుఅప్పుడు నేను రూ.2 లక్షల రుణం తీసుకుని, 4 నెలల కిందట ఈ వ్యాపారానికి శ్రీకారం చుట్టానుసోమవారం నుంచి శుక్రవారం వరకు కాలేజీకి వెళ్తానువారాంతాల్లో భావ్‌నగర్‌లో ఉంటూ నా పెండింగ్ పని పూర్తి చేస్తుంటానుఇలా నేనిప్పుడు నెలకు రూ.30-35 వేలదాకా సంపాదిస్తున్నాను సర్.

ప్రధానమంత్రిఅవునా!

లబ్ధిదారుఅవును సర్‌.

ప్రధానమంత్రిమీ ల్యాబ్‌లో ఎంతమంది పనిచేస్తారు?

లబ్ధిదారుప్రస్తుతం నేనొక్కణ్నే సర్‌.

ప్రధానమంత్రిమీరు వారానికి రెండు రోజులు మాత్రమే పనిచేస్తారు...

లబ్ధిదారుఅవును సర్‌... నేను మరో చోటనుంచి పనిచేస్తానుఇంటిదగ్గర మా తల్లిదండ్రులు నాకు వీలున్నప్పుడల్లా సాయం చేస్తుంటారునాకు ముద్ర పథకం ద్వారా చేయూత లభించిందిఅయితేమనలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలన్నది నా అభిప్రాయం సర్‌... ప్రధానంగా మీకు నా కృతజ్ఞతలు.

లబ్ధిదారుసర్‌... మేమిప్పుడు మనాలిలో సొంత వ్యాపారం చేస్తున్నాంమా పెళ్లికిముందు నా భర్త కూరగాయల మార్కెట్లో పనిచేసేవాడు.. నేను అత్తగారింటికి వెళ్లాక కొంతకాలానికిఎవరి కోసమో పని చేయడంకన్నా మనమే ఓ దుకాణం పెట్టుకుందామని చెప్పానుఆయన కూడా అంగీకరించడంతో సొంతంగా కూరగాయల దుకాణం తెరిచాంమా వ్యాపారం క్రమంగా పెరగడంతో బియ్యంపిండి వంటి ఇతర వస్తువులు కూడా విక్రయించాల్సిందిగా మా ఖాతాదారులు కోరేవారువారిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారుఓ సందర్భంలో వారు మా దుకాణానికి వచ్చినపుడువారి బ్యాంకులో మాకు రుణం దొరుకుతుందాఅని అడిగాంవారు మొదట తిరస్కరించారు.ఇదంతా 2012-13 నాటి సంగతిఅప్పుడు నేనిలా అన్నాను...

ప్రధానమంత్రి: (మధ్యలో జోక్యం చేసుకుంటూమీరు 2012-13 నాటి సంగతి చెబుతున్నారు... ఎవరైనా జర్నలిస్టు ఇది వింటే మీరు పాత ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని రాస్తారు.

లబ్ధిదారు: (తిరిగి మాట్లాడుతూరుణం కోసం తాకట్టు పెట్టడానికి ఆస్తి ఏదైనా ఉందా అని వారు అడిగారుఅలాంటిదేమీ లేదని నేను చెప్పానుఅయితే, 2015-16లో ఈ ముద్ర రుణం గురించి నాకు తెలిసివారిని సంప్రదిస్తేఈ పథకం గురించి చెప్పిఇప్పుడు మీకు రుణం కావాలాఅని వారే అడిగారునేను కావాలనడంతోమమ్మల్ని ఎలాంటి పత్రాలుహామీలు  అడగకుండానే మొదట రూ.2.5 లక్షలు ఇచ్చారుఆ రుణాన్ని రెండున్నరేళ్లలో తీర్చేయడంతో రెండో దఫా రూ.5 లక్షలు ఇచ్చారుఆ తర్వాత నేను రేషన్ దుకాణం తెరిచానుఆ రెండు దుకాణాలు నిర్వహించడం నాకు సునాయాసంగా మారిందిసర్‌... నా వ్యాపారం వృద్ధి చెందడం ప్రారంభమైందిఅంటేఅంతకుముందు ఏడాదికి రూ.2.5 లక్షలు సంపాదిస్తుండగానేనివాళ రూ.10-15 లక్షలు ఆర్జిస్తున్నాను.

ప్రధానమంత్రిశభాష్‌!

లబ్ధిదారు: (సంభాషణ కొనసాగిస్తూనేను తీసుకున్న రూ.5 లక్షల రుణం కూడా సకాలంలో చెల్లించడం వల్ల మూడోసారి వారు నాకు రూ.10 లక్షలు ఇచ్చారుదాన్ని కూడా రెండున్నరేళ్లలో తిరిగి చెల్లించేశానుఅటుపైన 2024 నవంబరులో నాలుగోసారి రూ.15 లక్షలు ఇచ్చారుసర్‌... మా కార్యకలాపాలు బాగా విస్తరిస్తున్నాయిమాకు ఇలాంటి ప్రధానమంత్రిఆయన నుంచి నిరంతర మద్దతు లభిస్తున్నపుడు మేమూ ఆయనకు మద్దతిస్తాంమేము ఎలాంటి పొరపాటు దొర్లకుండా చూసుకున్నాం కాబట్టిమా భవిష్యత్తుకు ఇప్పుడు ఢోకాలేదుకానీకొందరు రుణం తిరిగి చెల్లించకుండా తమ భవితను పాడుచేసుకున్నారుబ్యాంకు వారు ఇప్పుడు రూ.20 లక్షలు రుణం ఇస్తామంటున్నారుకానీమాకిక రుణం అవసరం లేదని చెప్పానుఅయినప్పటికీ మీ ఖాతాలో రూ.15 లక్షలు ఉంటుందిఅవసరమైతే ఆ సొమ్ము తీసుకోవచ్చు... అప్పుడు మాత్రమే వడ్డీ పడుతుందిఒకవేళ తీసుకోకపోతే వడ్డీ చెల్లించే అవసరం ఉండదని చెప్పారుఏదేమైనా... మీరు తెచ్చిన ఈ పథకం నాకెంతో నచ్చింది సర్‌!

లబ్ధిదారుసర్‌... మాది ఆంధ్రప్రదేశ్‌నాకు హిందీ రాదు... తెలుగులోనే మాట్లాడగలను.

ప్రధానమంత్రిమరేం పర్వాలేదుతెలుగులోనే మాట్లాడండి.

లబ్ధిదారుఅలాగా సర్!! నాకు 2009లో వివాహమయ్యాక 2019 వరకు గృహిణిగానే ఉన్నానుఆ తర్వాత జనపనార సంచుల తయారీపై కెనరా బ్యాంకు ఏర్పాటు చేసిన ప్రాంతీయ కేంద్రంలో 13 రోజులు శిక్షణ పొందానుఅటుపైన ముద్ర పథకం కింద బ్యాంకు వారు రూ.2 లక్షల రుణం ఇచ్చారుఆ సొమ్ముతో 2019 నవంబరులో సొంత వ్యాపారం ప్రారంభించానుకెనరా బ్యాంకు ఎలాంటి పూచీకత్తు లేకుండా నన్ను నమ్మి రూ.2 లక్షల రుణం మంజూరు చేసిందిరుణం కోసం నేను ఎవరి సాయమూ తీసుకోలేదుఅలాగే హామీతో నిమిత్తం లేకుండానే రుణం దొరికిందిదాన్ని సకాలంలో తిరిగి చెల్లించాక 2022లో కెనరా బ్యాంకు మరో రూ.9.5 లక్షలు మంజూరు చేసిందిఇప్పుడు మా దగ్గర 15 మంది పనిచేస్తున్నారు.

ప్రధానమంత్రిఅంటేమీరు రూ.2 లక్షలతో మొదలుపెట్టిఇప్పుడు రూ.9.5 లక్షల స్థాయిని అందుకున్నారన్న మాట!

లబ్ధిదారుఅవును సర్‌..

ప్రధానమంత్రిమీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారని చెప్పారు...

లబ్ధిదారు: 15 మంది సర్‌...

ప్రధానమంత్రి: 15 మందా!

లబ్ధిదారుఅందరూ గృహిణులే సర్‌... అందునా ఆర్‌సిటి (గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రం)లో శిక్షణ పొందినవారేఒకప్పుడు వారిలో ఒకరినైనానేనిప్పుడు శిక్షకురాలుగా పని చేస్తున్నానుఈ అవకాశం లభించినందుకు ఎంతో కృతజ్ఞురాలినిధన్యవాదాలు.. ధన్యవాదాలు... అనేకానేక ధన్యవాదాలు సర్‌!

ప్రధానమంత్రిమీక్కూడా ధన్యవాదాలు.. ధన్యవాదాలు... అనేకానేక ధన్యవాదాలు.

లబ్ధిదారుసర్‌... నా పేరు పూనమ్‌ కుమారిమాది చాలాచాలా పేద కుటుంబం.

ప్రధానమంత్రిమీరు ఢిల్లీకి మొదటిసారి వచ్చారా?

లబ్ధిదారుఅవును సర్‌...

ప్రధానమంత్రిమంచిది...

లబ్ధిదారుఅంతేకాకుండా విమాన ప్రయాణం కూడా నాకిదే మొదటిసారి సర్‌.

ప్రధానమంత్రిఅలాగా...

లబ్ధిదారుమా కుటుంబం కటిక పేదరికంలో ఉండేదిఒక పూట తింటేమళ్లీ ఆకలి తీరదెప్పుడా అని ఎదురుచూడాల్సిన దుస్థితికానీమాది వ్యవసాయ కుటుంబం.. కాబట్టే నేను ధైర్యం కూడగట్టుకునే ప్రయత్నం చేశాను.

ప్రధానమంత్రిమీరు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలరు.

లబ్ధిదారుమాది రైతు కుటుంబం కాబట్టిఎన్నో సమస్యలు వెంటాడేవిఅలాంటి పరిస్థితుల మధ్య మనమే రుణం తీసుకుని సొంత వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదంటూ నా భర్తతో అన్నానుఆయన నాతో ఏకీభవించినీ సూచన బాగుంది... మనం కచ్చితంగా సొంత వ్యాపారం పెడదామని చెప్పాడుతన మిత్రులతో ఈ ఆలోచనను పంచుకున్నపుడు వారు ముద్ర రుణం గురించి సమాచారం ఇచ్చారువారి సలహా మేరకు మేము ఎస్‌బిఐ బ్యాంకు వారిని సంప్రదించాంఎలాంటి హామీపత్రాలు వంటివి లేకుండా రుణం ఇస్తామని వారు చెప్పారుఆ తర్వాత మాకు రూ.8 లక్షల రుణం మంజూరు చేయడంతో మా వ్యాపారం మొదలుపెట్టాంమేమీ రుణం తీసుకున్నది 2024లో కాగాఇప్పుడు మా వ్యాపారం బాగా సాగుతోంది సర్‌.

ప్రధానమంత్రిమీరు చేసే వ్యాపారం ఏమిటి?

లబ్ధిదారుసర్‌... విత్తనాల వ్యాపారం చేస్తాంనా భర్త ఎంతో సాయం చేస్తారు.. మార్కెటింగ్‌ పనిలో అధికశాతం ఆయనే చూసుకుంటారుమేమొక వ్యక్తికి పని కూడా ఇచ్చాం.

ప్రధానమంత్రిమంచిది...

లబ్ధిదారుసర్‌... మా వ్యాపారం చాలా చక్కగా సాగుతోంది... త్వరలోనూ రుణం మొత్తం తిరిగి చెల్లించగలమన్న నమ్మకం నాకుంది.

ప్రధానమంత్రిమీరిప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నారు?

లబ్ధిదారుసర్‌... ప్రస్తుతం రూ.60,000దాకా ఉంటుంది.

ప్రధానమంత్రిఅలాగా... 60వేల రూపాయలా... అయితేమీ కుటుంబం ఆమోదించిందా?

లబ్ధిదారునిస్సందేహంగా సర్‌... నిస్సందేహంగా... మీరు తెచ్చిన ఈ పథకం వల్ల ఇవాళ నా కాళ్లపై నేను నిలబడ్డాను.

ప్రధానమంత్రిమంచిది... మీరెంతో మంచిమార్గం ఎంచుకున్నారు.

లబ్ధిదారుథ్యాంక్యూ సర్‌... మీతో నా మనోభావం పంచుకోవాలని ఉబలాటపడ్డానుమోదీ గారితో మాట్లాడేందుకు రాగలననే నిజం నేనింకా నమ్మలేకపోతున్నానుఢిల్లీకి వచ్చాకగానీ నాకు విశ్వాసం కలగలేదుఅందుకేమీకు నా కృతజ్ఞతలునువ్వు ఢిల్లీ వెళ్తున్నావని నా భర్త కూడా చెప్పారు.

ప్రధానమంత్రిదేశంలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి పౌరుడూ పరిష్కారంపై ఆత్మవిశ్వాసంతో ఉండేలా చూడాలన్నదే నా లక్ష్యంజీవితంలో కష్టాలు సహజం... కానీ,  అవకాశం లభించినపుడు వాటిని అధిగమించి ముందడుగు వేయాలిముద్ర పథకం చేసింది ఇదే.

లబ్ధిదారుఅవును సర్‌...

ప్రధానమంత్రిదేశంలో నిశ్శబ్ద విప్లవం సంభవిస్తున్న తీరును అర్థం చేసుకోగల వారు చాలా స్వల్పంవాస్తవానికి ఇదెంతో పెద్ద నిశ్శబ్ద విప్లవం.

లబ్ధిదారుసర్‌... ముద్ర పథకంపై అందరికీ అవగాహన కల్పించేందుకు నేను కృషి చేస్తాను.

ప్రధానమంత్రిఅవును... దీని గురించి అందరికీ తెలియడం అవసరం.

లబ్ధిదారుఅవును సర్‌... తప్పక తెలియాలి.

ప్రధానమంత్రి: చూడండిమా చిన్నప్పుడు వ్యవసాయం ఉత్తమమైనది.. వ్యాపారం దానికంటే తక్కువ.. ఉద్యోగం అన్నింటికంటే చిన్నది అని వినేవాళ్లంఉద్యోగం చివరిది అనే భావన ఉండేదిక్రమక్రమంగా సమాజం ఆలోచన ఎంతగా మారిపోయిందంటే…  ఉద్యోగమే ముఖ్యంఎక్కడో ఉద్యోగం సంపాదించి స్థిరపడాలని అనుకుంటున్నారుజీవితం స్థిరమైనదిగా మారుతోందివ్యాపారం విషయంలో ఆలోచన అలాగే ఉందివ్యవసాయానికి చివరి ప్రాధాన్యత ఇచ్చే స్థాయికి ప్రజలు చేరుకున్నారుఅంతే కాదు ఒక రైతుకు ముగ్గురు కొడుకులు ఉంటే ఏం చేస్తాడుఒకరిని పొలం చూసుకోమనిమరొకరిని వెళ్లి జీవనం సాగించమని చెబుతాడుమధ్యస్థ ప్రాధాన్యత ఉన్న వ్యాపారం అనేది ఇప్పుడు చర్చనీయాంశంనేడు భారత యువతలో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే నైపుణ్యాలకు తోడుగా వారికి కొంత సహాయం అందిస్తే గొప్ప ఫలితాలు వస్తాయిముద్ర యోజనలో ఏ ప్రభుత్వానికైనా ఇది కనువిప్పు లాంటిది.
ఈ పథకాన్ని ఉపయోగించుకునేందుకు ఎక్కువ మంది మహిళలు ముందుకు వచ్చారురుణాల కోసం దరఖాస్తు చేసుకున్నరుణాలు పొందినఅదే విధంగా రుణాన్ని వేగంగా తిరిగి చెల్లించే వారిలో కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారుఅంటే ఇది కొత్త అంశంఅభివృద్ధి చెందిన భారత్‌కు ఉన్న అవకాశాలు ఈ శక్తిలో కనిపిస్తోందిదీనివల్ల మనం ఒక వాతావరణాన్ని సృష్టించాలని నేను నమ్ముతున్నానువిజయవంతమైన మీలాంటి వాళ్లకు ఏ రాజకీయ నాయుకుడి నుంచి ఎటువంటి సిఫార్సు లేఖ అవసరం లేదని ఇప్పుడు మీకు తెలుసుమీరు ఏ ఎమ్మెల్యేఎంపీ ఇంటికి వెళ్లాల్సినమీరు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం రాలేదని నేను భావిస్తున్నాను.  తనఖా లేకుండా రుణం పొందటంవచ్చిన తర్వాత దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం మీ జీవితంలో క్రమశిక్షణను తీసుకొస్తుందిఅలాకాకుండా కొందరు డబ్బులు తీసుకున్నాం కదా.. వేరే నగరానికి వెళ్తాంబ్యాంకు వాళ్లు వెతుకుతూనే ఉంటారు అని అనుకోవచ్చుజీవితాన్ని సరైన తీరితో మలుచుకునేందుకు ఇది ఒక అవకాశాన్ని ఇస్తుందినా దేశంలోని ఎక్కువ మంది యువకులు ఈ రంగానికి రావాలని నేను కోరుకుంటున్నాను.

33 లక్షల కోట్ల రూపాయలు దేశ ప్రజలకు ఎలాంటి తనఖా లేకుండా అందాయిఇది ధనవంతుల ప్రభుత్వమని మీరు వార్తాపత్రికలో చదివి ఉంటారుసంపన్నులందరినీ ఇచ్చిన మొత్తం కలిపితే కూడా 33 లక్షల కోట్లు ఉండవు. 33 లక్షల కోట్ల రూపాయలను నా దేశంలోని సామాన్యులకుదేశంలో మీలాంటి ప్రతిభావంతులైన యువతీ యువకులకు అందించాంవీరంతా ఒకరికిఇద్దరికి, 10 మందికి, 40-50 మందికి ఉపాధి కల్పించారుఅంటే ఆర్థిక వ్యవస్థలో  ఉపాధి కల్పించే ఈ బృహత్తర పనిని ఇది చేస్తోందిదానివల్ల ఉత్పత్తి కూడా పెరుగుతుందిసామాన్యుల సంపాదన పెరిగితే గతంలో ఏడాదికి ఒక చొక్కా కొనుక్కునే అతను ఇప్పుడు రెండు చొక్కాలు కొనుక్కోవాలని భావిస్తాడుపూర్వం ప్రజలు తమ పిల్లలకు చెప్పటానికి సంకోచించేవారుఇప్పుడు వారికి నేర్పిద్దాంకాబట్టి అటువంటి ప్రతి విషయం సామాజిక జీవితంలో గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది

ఇప్పుడు ఈ పథకం అమల్లోకి వచ్చి పదేళ్లు అవుతోందిసాధారణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంమీడియా సమావేశం పెట్టి ఇలా చేస్తామని ప్రకటించడం సహజంఆ తర్వాత కొందరిని పిలిచి జ్యోతి వెలిగించి చప్పట్లు కొట్టి శీర్షికలు వచ్చేలా వార్తాపత్రికల గురించి ఆందోళన చెందుతుంటారుతర్వాత ఎవరు దాని గురించి అడగరుఈ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత ఒక పథకం గురించి పరిశీలన చేస్తోందిఇది మంచిదేనా అని ప్రజలను అడుగుతున్నాంఇంత పురోగతి జరిగిందని మేం చెబుతున్నాంకానీ ఏం జరిగిందో మీరు మాకు చెప్పండిఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నట్లుగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న నా సహోద్యోగులందరూ ప్రజలను అడగబోతున్నారువారిని కలిసి సమాచారాన్ని తీసుకోబోతున్నారుదీనివల్ల ఈ పథకంలో ఏదైనా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటేకొంత మెరుగుదల చేయవలసి వస్తే.. మేం కూడా ఆ దిశగా ముందుకు సాగబోతున్నాంకానీ మా కృషిని చూడండిఇప్పుడు దీన్ని 50000 నుంచి లక్షలకు పెంచుతున్నాంఅయితే మన ప్రభుత్వ విశ్వాసం చూడండి.  సోదరా లక్షల కంటే ఎక్కువ ఇవ్వొద్దుఒకవేళ మునిగితే ఏం చేస్తాంఅప్పుడు అందరూ మోదీ జట్టుపట్టుకొని లాగుతారని గతంలో ప్రభుత్వం కూడా భావించిందికానీ నా దేశ ప్రజలు నా నమ్మకాన్ని వమ్ము చేయలేదుమీరు నా దేశ ప్రజలపై నా నమ్మకాన్ని బలపరిచారు.


 

అందుకే దీన్ని 50 వేల నుంచి 20 లక్షలకు పెంచే ధైర్యం వచ్చిందిఈ నిర్ణయం చిన్నదేమీ కాదుఈ పథకం విజయంప్రజలపై నమ్మకం.. ఈ రెండు ఇందులో కనిపించినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాంమీ అందరికీ నా అభినందనలునేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే.. మీరు 5-10 మందికి ఉపాధి కల్పించినట్లేముద్ర యోజన ద్వారా స్వంత పని చేయాలని -10 మందిని ప్రేరేపించివారికి ధైర్యాన్నివ్వండితద్వారా వారికి ఆత్మవిశ్వాసం లభిస్తుందిదేశంలో 52 కోట్ల రుణాలు అందాయిమొదట 2.5 లక్షలుఆ తర్వాత లక్షలు తీసుకున్నానని.. అందువల్ల రెండు రుణాలు ఉన్నాయని సురేష్ చెప్పారుదీనిబట్టి మొత్తం 52 కోట్ల మంది లబ్దిదారులు ఉండకపోవచ్చుకానీ 52 కోట్ల రుణాలు అనేది చాలా పెద్ద సంఖ్యప్రపంచంలోని ఏ దేశంలోనూ దీని గురించి ఎవరూ ఆలోచించలేరుఅందుకే మన యువతరాన్ని సొంతంగా ఏదైనా ప్రారంభించేలా సిద్ధం చేయాలనిదానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నానునేను గుజరాత్‌లో ఉన్నప్పుడు గరీబ్ కళ్యాణ్ మేళా అనే కార్యక్రమం ఉన్న విషయం నాకు గుర్తుందికానీ అందులో పిల్లలు.. నేను ఇప్పుడు పేదవాడిలా ఉండాలనుకోవటం లేదు లాంటి వీధి నాటకాలు వేసేవారుప్రజలను ప్రేరేపించడానికి ఇలాంటి నాటకం ఉండేది.


 

ఆ తర్వాత కొందరు వేదికపైకి వచ్చి తమ రేషన్ కార్డులను ప్రభుత్వానికి ఇచ్చి పేదరికం నుంచి బయటపడ్డామనిఇప్పుడు మాకు ఎలాంటి సౌకర్యాలు అవసరం లేదని చెప్పేవారువారి పరిస్థితిని ఎలా మార్చుకున్నారన్నది మాట్లాడేవారునేను వల్సాద్ జిల్లాలో ఉన్నప్పుడు 8-10 మందితో కూడిన బృందం వచ్చి వారికి పేద వాళ్లకు ఉద్దేశించిన ప్రభుత్వ ప్రయోజనాలన్నింటినీ ప్రభుత్వానికి ఇచ్చేశారుఅప్పుడు వారు తమ అనుభవాన్ని చెప్పారుఅదేంటంటే.. వారు గిరిజన ప్రజలుగిరిజనుల మధ్య సాయంత్రం భజనలు చేయడంపాడటం భగత్ పనికాబట్టి వారు ఒకటి లేదా రెండు లక్షల రూపాయల రుణం పొందారుఆ సమయంలో ముద్ర యోజన వంటివి లేవుఅక్కడ మా ప్రభుత్వం పథకం ఉండేదివారిలో కొందరు సంగీత వాయిద్యాలను కొనుగోలు చేసివారు కొంత శిక్షణ పొందారువీళ్లు 10-12 మందితో ఒక బ్యాండ్ సంస్థను ఏర్పాటు చేశారుఆపై పెళ్లిళ్లలో వాయించటం మొదలుపెట్టారుఆ తర్వాత సొంతంగా మంచి యూనిఫాంలు తయారు చేసుకున్నారుక్రమక్రమంగా వాళ్లంతా బాగా ప్రాచుర్యం పొంది వారంతా మంచి స్థాయిలో వచ్చారుఅందరూ 50-60 వేలు సంపాదించడం ప్రారంభించారు.


 

అంటే ఒక చిన్న విషయం కూడా ఇంత పెద్ద మార్పు తెస్తుందిఇలాంటి సంఘటనలు ఎన్నో నా కళ్లతో చూశానుఅక్కడే నాకు ప్రేరణ లభిస్తుందిమీ నుంచి నాకు ప్రేరణ లభిస్తుంది.  సోదరా చూడండి.. దేశంలో ఇలాంటి శక్తి ఒకరిలోనే కాదు చాలా మందిలో ఉంటుందిఇలాంటిదే చేద్దాందేశ ప్రజలను కలుపుకుని దేశాన్ని నిర్మించొచ్చువారి ఆశలుఆకాంక్షలువారి పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా ఇది సాధ్యమైందిఈ ముద్ర యోజన వీటిలో ఒకటిమీరు ఈ విజయాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారనిఎక్కువ మంది ప్రయోజనం పొందుతారని నమ్మతున్నానుఇది మీకు సమాజం ఇచ్చిందిమీరు కూడా సమాజానికి ఇవ్వాలి కానీ ఇప్పుడు సరదాగా ఉందాం అని అనుకోవద్దుమనం కూడా సమాజం కోసం ఏదైనా చేయాలిదాని వల్ల మనస్సుకు సంతృప్తి లభిస్తుంది

ధన్యవాదాలు
గమనిక: ముద్ర యోజన లబ్ధిదారులతో ప్రధాన‌మంత్రి సంభాషణలో ఒక లబ్ధిదారుడు తెలుగులో మాట్లాడారు.


(Release ID: 2125320)