@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వామ్! యానిమీ, మాంగా, వెబ్‌టూన్స్‌లో ఒరిజినల్ ఇండియన్ ఐపీలను ప్రోత్సహించే దిశగా భారతదేశపు మొదటి జాతీయ కార్యక్రమం.. కాస్‌ప్లేతో శిఖర స్థాయికి వేవ్స్- 2025


వేవ్స్ వామ్! ప్రతిభావంతులైన సృజనకారులను ప్రోత్సహిస్తూ,

వారిని సాధికారులను చేసే ‘క్రియేటర్ డెవలప్మెంట్ గ్రాంట్’ నుంచి లబ్ధి పొందనున్న తుది పోటీదారులు

 Posted On: 29 APR 2025 4:37PM |   Location: PIB Hyderabad

వేలాది ఎంట్రీలుప్రాంతీయ స్థాయిలో నెలలపాటు జరిగిన పోటీల అనంతరం.. వేవ్స్ యానిమీమాంగా కాంటెస్ట్ (వామ్నేషనల్ ఫినాలేకు దేశవ్యాప్తంగా 11 నగరాల నుంచి తుది పోటీదారులు ఎంపికయ్యారుముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మే నుంచి వరకు నిర్వహించనున్న ప్రపంచ దృశ్యశ్రవణ వినోద సదస్సు (వేవ్స్)2025లో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు.

మీడియాఎంటర్‌టైన్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐసహకారంతో కేంద్ర సమాచారప్రసార మంత్రిత్వ శాఖ వామ్ పోటీలు నిర్వహిస్తోందియానిమీమాంగావెబ్‌టూన్స్కాస్‌ప్లేలో ఒరిజినల్ ఇండియన్ ఐపీల ఆవిష్కరణ, ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న భారత తొలి జాతీయ కార్యక్రమమిదితుది దశకు అర్హత సాధించిన ఈ సృజనాత్మక ఆవిష్కరణలువాటి ఆవిష్కర్తలకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వేవ్స్-2025 అద్భుతమైన గుర్తింపునిస్తుందిఅంతర్జాతీయ స్థాయిలో సంబంధిత రంగంలో నేతృత్వ స్థానంలో ఉన్నవారుఆవిష్కర్తలుస్టూడియోలుక్రియేటర్లను ఒక్కచోట చేర్చి దేశ సృజన రంగ ఆర్థిక వ్యవస్థను వేవ్స్ పెంపొందిస్తుంది. ‘క్రియేట్ ఇన్ ఇండియాక్రియేట్ ఫర్ వరల్డ్’ లక్ష్యంతో నిర్వహిస్తున్న వేవ్స్.. భారీ లక్ష్యాలను నిర్దేశించుకునేలాఅంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు చేరువయ్యేలా భారతీయ క్రియేటర్లను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందిఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంయానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్ఎక్స్‌టెండెడ్ రియాల్టీలకు సంబంధించి దేశంలో అతి పెద్ద వేదిక వేవ్స్క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్ (సీఐసీ) వేవ్స్కు ప్రధాన కేంద్రంగా ఉంది. లక్ష నమోదులతో ఈ చాలెంజ్ సీజన్ 1 చరిత్ర సృష్టించిందివాటిలో 1,100 అంతర్జాతీయ స్థాయి నమోదులు కూడా ఉన్నాయిసమగ్ర ప్రక్రియ అనంతరం.. 32 ప్రత్యేక పోటీల నుంచి 750 మందికి పైగా తుది పోటీదారులు ఎంపికయ్యారు.

అంతర్జాతీయ యానిమీ బ్రాండ్ ‘క్రంచీరోల్’ వామ్‌-2025 టైటిల్ స్పాన్సర్‌గా చేరడం దేశంలోని వర్ధమాన క్రియేటర్లను విశేషంగా ప్రోత్సహించే అంశంఇది యానిమీపై అభిమానుల ఆదరణను మరింత పెంచుతుందివామ్- 2025 విజేతలను ప్రోత్సహించిసాధికారులను చేయడం కోసం ‘క్రియేటర్ డెవలప్‌మెంట్ గ్రాంట్’ను క్రంచీబాల్ ప్రవేశపెట్టిందియానిమీమాంగావెబ్‌టూన్ రంగాల్లో వర్ధమాన కళాకారులుకథకులకు చేయూతనివ్వడం ఈ గ్రాంట్ లక్ష్యంఅంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల కోసం అసలైన మేధో సంపత్తిని వారు రూపొందించగలరు.

క్రియేటర్ డెవలప్ మెంట్ గ్రాంట్ వివరాలిలా ఉన్నాయి.:

  • మాంగా (విద్యార్థి కేటగిరీ) — రూ25,000

  • మాంగా (ప్రొఫెషనల్ కేటగిరీ) — రూ25,000

  • వెబ్‌టూన్ (విద్యార్థి కేటగిరీ) — రూ25,000

  • వెబ్ టూన్ (ప్రొఫెషనల్ కేటగిరీ) — రూ25,000

  • యానిమీ (విద్యార్థి కేటగిరీ) — రూ50,000

  • యానిమీ (ప్రొఫెషనల్ కేటగిరీ) — రూ50,000

అంతేకాకుండా.. వామ్-2025 తుదిపోటీల్లో విజేతగా నిలిచిన భారత బృందానికి క్రంచీరోల్ చేయూతను అందించనుందిటోక్యోలో అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమైన యానిమీ ప్రదర్శన యానిమీ జపాన్- 2026లో వారు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారుఅసలైన భారతీయ సృజనాత్మక ప్రతిభను అంతర్జాతీయ వేదికపై చాటడానికి ఇది సహాయపడుతుందిక్రంచీరోల్ఎల్ఎల్‌సీ అన్నది అమెరికా కేంద్రంగా ఉన్న సోనీ ఎంటర్టైన్మెంట్జపాన్‌కు చెందిన అనిప్లెక్స్ మధ్య జాయింట్ వెంచర్ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తుందిఇది సోనీ మ్యూజిక్ ఎంటర్టయిన్మెంట్ (జపాన్) (విలీనఅనుబంధ సంస్థరెండూ టోక్యోకు చెందిన సోనీ గ్రూప్ అనుబంధ సంస్థలు.

image.jpeg

వేవ్స్ గురించి

మీడియా, వినోద రంగాల్లో కీలకమైన కార్యక్రమమైన తొలి ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)ను ముంబయిలో మే 1 నుంచి 4 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

మీరు సంబంధిత రంగంలో నిపుణులైనా, పెట్టుబడిదారులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలైనా... అనుసంధానం, భాగస్వామ్యం, ఆవిష్కరణలతో మీడియా, వినోద రంగంలో ప్రతిభను చాటుకునేందుకు అత్యున్నత అంతర్జాతీయ వేదికగా ఈ సదస్సు నిలుస్తుంది.

భారతీయ సృజన శక్తిని వేవ్స్ విస్తృతంగా చాటబోతోందికంటెంట్ సృజన, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణల నిలయంగా దేశ స్థానాన్ని మరింత సుస్థిరం చేయనున్నదిసమాచార ప్రసారం, ముద్రణ మాధ్యమాలు, టీవీ, రేడియో, సినిమా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలు, ఉత్పాదక కృత్రిమ మేధ, అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్వంటి పరిశ్రమలు, రంగాలపై దృష్టి సారించారు.

ఏవైనా సందేహాలున్నాయా? జవాబుల కోసం ఇక్కడ చూడండి.

పీఐబీ వేవ్స్ బృందం ఎప్పటికప్పుడు అందించే తాజా ప్రకటనలను చదవండి.

రండి, మాతో కలసి ప్రయాణించండి! ఇప్పుడే వేవ్స్ కు రిజిస్టర్ చేసుకోండి

 

***


Release ID: (Release ID: 2125302)   |   Visitor Counter: 23