ప్రధాన మంత్రి కార్యాలయం
ఏప్రిల్ 29న యుగ్మ్ సదస్సులో పాల్గొననున్న ప్రధానమంత్రి
ప్రధానమంత్రి దార్శనికత - స్వావలంబన, సృజనాత్మకత ఆధారిత భారత్ కు అనుగుణంగా, సదస్సులో ఆవిష్కరణలకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం
భారతదేశ ఆవిష్కరణల రంగంలో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం సదస్సు లక్ష్యం
సదస్సులో భాగంగా నిర్వహించే డీప్ టెక్ స్టార్టప్ ఎగ్జిబిషన్ లో భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన అత్యాధునిక
ఆవిష్కరణల ప్రదర్శన
Posted On:
28 APR 2025 7:07PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 29న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే యుగ్మ్ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
యుగ్మ్ (సంస్కృతంలో ‘సంగమం’ అని అర్థం) అనేది ప్రభుత్వ, విద్య, పరిశ్రమ, ఆవిష్కరణ వ్యవస్థల నాయకులను కలిపే మొట్టమొదటి వ్యూహాత్మక సమ్మేళనం. వాధ్వానీ ఫౌండేషన్, ప్రభుత్వ సంస్థల సంయుక్త పెట్టుబడితో సుమారు రూ.1,400 కోట్ల విలువైన భాగస్వామ్య ప్రాజెక్టు ద్వారా భారత దేశ ఆవిష్కరణ ప్రయాణానికి ఇది దోహదం చేయనుంది.
స్వావలంబన, ఆవిష్కరణ ఆధారిత భారతదేశం అనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, ఈ సదస్సులో వివిధ కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో ఐఐటీ కాన్పూర్ (కృత్రిమ మేధస్సు, ఇంటెలిజెంట్ వ్యవస్థలు) , ఐఐటీ బాంబే (జీవశాస్త్రం, బయోటెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం) సూపర్హబ్లు, అగ్రశ్రేణి పరిశోధనా సంస్థల్లో పరిశోధనా వాణిజ్యీకరణను ప్రోత్సహించేందుకు వాధ్వానీ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ (డబ్ల్యుఐఎన్) కేంద్రాలు, అలాగే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఎన్ఆర్ఎఫ్ )తో కలిసి చివరి దశ అనువర్తిత ప్రాజెక్టులకు సంయుక్తంగా నిధులు సమకూర్చడానికి, పరిశోధన - ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అవకాశం ఉంది.
ఈ సదస్సులో భాగంగా ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ, విద్యా రంగానికి చెందిన ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్యానల్ చర్చలు కూడా జరుగనున్నాయి. పరిశోధనను వేగంగా అమలు దశకు తీసుకెళ్లే దిశగా కార్యాచరణ ఆధారిత చర్చలు, భారత్ అంతటా ఉన్న డీప్ టెక్ స్టార్టప్‌ల తాజా ఆవిష్కరణల ప్రదర్శన, విభిన్న రంగాల్లో భాగస్వామ్యాలు, సహకారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నెట్‌వర్కింగ్ అవకాశాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
ఈ సదస్సులో ప్రభుత్వ అధికారులు, అగ్రశ్రేణి పరిశ్రమ, విద్యా రంగ ప్రముఖులు పాల్గొనే ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్యానల్ చర్చలు నిర్వహించనున్నారు. పరిశోధన ఫలితాలకు వేగంగా ఆచరణ రూపం కల్పించే చర్యలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. భారత్ భారతదేశం నలుమూలల నుంచి అగ్రశ్రేణి ఆవిష్కరణలను ప్రదర్శించే డీప్ టెక్ స్టార్టప్ ఎగ్జిబిషన్, విభిన్న రంగాలలో భాగస్వామ్యాలు, సహకారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నెట్‌వర్కింగ్ అవకాశాలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి.
భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థలో భారీ స్థాయి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, అగ్రస్థానంలో ఉన్న సాంకేతిక రంగంలో పరిశోధనను వాణిజ్యపరమైన దశకు వేగవంతంగా తీసుకెళ్లడం, విద్యా-పరిశ్రమ-ప్రభుత్వ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, ఏఎన్ఆర్ఎఫ్, ఎఐసిటిఇ ఇన్నోవేషన్ వంటి జాతీయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం, ఆన్ని సంస్థల ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులో ఉంచడం, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు జాతీయ ఆవిష్కరణ దిశలో ఏకీకృత కృషిని ప్రోత్సహించడం వంటి ప్రధాన లక్ష్యాలతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
(Release ID: 2125013)
Visitor Counter : 12